అప్పు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసులలో

శని, 12/21/2019 - 18:30

అప్పు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసులలో.

అప్పు, దైవప్రవక్త, స్వర్గం.

1.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే ప్రజల సొమ్ము తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో[అప్పుగా] తీసుకుంటారో ఆ భగవంతుడు ఆ అప్పును తీరుస్తాడు[ఆ అప్పును తీర్చటంలో అతనికి సహాయపడతాడు] మరియు ఎవరైతే ప్రజల నుండి సొమ్మును వారిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో తీసుకుంటాడో అల్లాహ్ ఆ సొమ్మును నాశనం చేస్తాడు”. [నెహ్జుల్ ఫసాహ,పేజీ నం:762,హదీసు నం:2979].
2.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే కష్టాలలో ఉన్నవారికి మరియు నిస్సహాయులకు రుణమిస్తారో మరియు దానిని తిరిగి తీసుకునేటప్పుడు మంచితనంతో ప్రవర్తిస్తారో [అతని పాపాలు మన్నించబడి] అతని కర్మచిట్టా తిరిగి మొదలుపెట్టబడుతుంది.మరియు భగవంతుడు అతనికి ప్రతీ దిర్హమునకు బదులు వెయ్యి ఖింతారులను [ఎక్కువ మొత్తంలో ధనము] స్వర్గములో ఇస్తాడు”. [సవాబుల్ ఆమాల్ వ ఇqఆబుల్ ఆమాల్,పేజీ నం: 289].
3.మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారు వేరొక సందర్భంలో ఈ విధంగా ఉల్లేఖించారు: “ఎవరైతే తన ఇతర ముస్లిము సోదరునికి[ఎవరికైతే అప్పు యొక్క అవసరముందో] అప్పు ఇచ్చే పరిస్థితిలో ఉండి కూడా అప్పు ఇవ్వడో భగవంతుడు అతనిపై స్వర్గం యొక్క సుగంధాన్ని హరాం చేస్తాడు”. [ఆమాలె షైఖ్ సదూఖ్,పేజీ నం:430].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15