అజ్ఞానులు పది లక్షణాలు కలిగి ఉంటారు అని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్ ...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అజ్ఞానులు పది లక్షణాలు కలిగివున్నారు, వారి భాగ్యంలో బుద్ధి లేదు, అవి:
1. ఎవరితోనైతే జీవితాన్ని గడుపుతాడో వారికే అన్యాయం చేస్తాడు
2. తన చేయి క్రింద ఉన్న వారిని హింసిస్తాడు
3. తన పైవారితో అధికప్రసంగం చేస్తాడు
4. మాట్లాడే మాటలు తన తెలివి, వివేకాలతో ఉండవు
5. మాట మాట్లాడితే పాపానికి గురి అవుతాడు, మౌనంగా ఉంటే అశ్రద్ధతకు గురి అవుతాడు
6. ఆరాచకం ఎదురైతే దాని వైపుకు వెళ్ళి దానికి గురి అయ్యి నాశనం అవుతాడు
7. ప్రతిష్టతను మరియు మంచిని చూసి దాని నుండి ముఖం త్రిప్పుకుంటాడు
8. గతంలో చేసిన పాపాల పట్ల పశ్చాత్తాప భావం ఉండదు మరియు మిగిలిన జీవితంలో పాపం చేయకుడదు అన్న ఆలోచనా ఉండదు
9. మంచి పని చేయటంలో ఆలస్యం చేస్తాడు
10. నష్టపోయిన మరియు నాశనం చేసినవాటి గురించి పట్టించుకోడు[తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ28]
రిఫ్రెన్స్
తొహ్ఫుల్ ఉఖూల్, అల్ హసన్ ఇబ్నె అలీ ఇబ్నిల్ హుసైన్ ఇబ్నె షోబతుల్ హర్రానీ, మొఅస్ససతుల్ అఅలమీ, బీరూత్, 1423హి – 2002మీ.
వ్యాఖ్యానించండి