గౌరవానికి కారణాలు హదీసులలో

శని, 02/01/2020 - 18:14

గౌరవానికి కారణాలు మసూముల హదీసులలో.

గౌరవం,దైవప్రవక్త,విధేయత.

గౌరవమనేది ఆ భగవంతుని కానుక.దానిని ఈ లోకసంబంధిత వస్తువులలో పొందాలనుకోవటం మూర్ఖత్వం.ఎందుకంటే ఈ లోకంలో మనకు ప్రాప్తించే ప్రతీ వరము ఆ దేవుని వద్ద నుండి లభించేదే.అలాంటిది ఆ దేవునిని వదిలి స్థిరత్వం లేని లోకసంబంధిత వస్తువులలో గౌరవాన్ని పొందాలనుకోవటం మానవుని మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది.అల్లాహ్ హదీసె ఖుద్సీలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “నేను గౌరవాన్ని రాత్రులు మెలుకువ ఉండటంలో[రాత్రులు ప్రార్ధనలో గడపటంలో] ఉంచాను కానీ ప్రజలు దానిని రాజుల యొక్క దర్బారులలో వెతుకుతున్నారు వారు ఎప్పటికీ దానిని[గౌరవాన్ని] పొందలేరు”. ఒక హదీసులో దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: మీ భగవంతుడు ప్రతీ రోజూ మీతో ఈ విధంగా సంభోదిస్తున్నాడు: “నేను మీ భగవంతుడను,నేను సర్వాధికుడను ఎవరైతే ఇహపరలోకాల గౌరవాన్ని పొందలనుకుంటారో వారు సర్వాధికారుని పట్ల విధేయత చూపించవలె”. వేరొక చోట ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే తమను తాము దేవుని విధేయత కొరకు అర్పించుకుంటారో వారు దేవుని పట్ల అవిధేయతతో గౌరవించబడే వారి కంటే [అల్లహ్ కు] ప్రియమైన వారు”.

రెఫరెన్స్: ఇస్నా అషరియా,సయ్యద్ ముహమ్మద్ హుసైన్ ఆములి,పేజీ నం:155,మీజానుల్ హిక్మహ్,పేజీ నం:1958,హదీసు నం:12838,కంజుల్ ఉమ్మాల్,ముత్తఖీ హింది,2వ భాగము,పేజీ నం:42084.      

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10