గౌరవానికి కారణాలు దివ్యఖురాను దృష్టిలో

సోమ, 02/10/2020 - 18:47

దివ్యఖురాను దృష్టిలో గౌరవాన్ని పొందటానికి గల కొన్ని కారకాలను ఇచట ప్రస్థావించటం జరిగింది.

గౌరవం,దివ్యఖురాను,విశ్వాసులు.

ఈ లోకంలో ప్రతీ వ్యక్తి గౌరవాన్ని పొందాలనుకుంటాడు.కొందరు ఆ గౌరవాన్ని ధనం ద్వారా సాధించాలనుకుంటారు మరికొందరు దానిని అధికారం ద్వారా మరికొందరైతే సమజంలో తమకున్న బలం మరియు పలుకుబడి ద్వారా గౌరవాన్ని పొందాలనుకుంటారు.కానీ అల్లాహ్ దృష్టిలో గౌరవానికి నిజమైన అర్హులెవరు? దివ్యఖురానులో అల్లాహ్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎవరైతే గౌరవాన్ని ఆ అల్లాహ్ నుండి ఆశిస్తారో వారే నిజంగా గౌరవానికి అర్హులు అని చెబుతూ ఉన్నాడు.,అల్లాహ్ దైవవాణిలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “గౌరవాన్ని ఆశించేవారెవరైనా సరే సకల గౌరవోన్నతులు అల్లాహ్ వే [నని తెలుసుకోవాలి]” [ఫాతిర్/10].  పవిత్రమైన ఇస్లాము మతాన్ని మరియు పవిత్ర ఖురానును అనుసరించటం ద్వారా గౌరవాన్ని పొందవచ్చు.దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “ఈ గ్రంధావతారణ సర్వాధికారుడైన,వివేకవంతుడైన అల్లాహ్ తరపున జరిగింది” [అజ్ జుమర్/1].అల్లాహ్ యే అన్ని గొప్పతనాలకు మరియు అన్ని రకాల గౌరవాలకు మూలం కాబట్టి అతను అవతరించిన దివ్యఖురానును అనుసరించట ద్వారానే ఈ లోకంలో గౌరవాన్ని పొందగలము. విశ్వాసులకు దగ్గరవ్వటం ద్వారా కూడా గౌరవాన్ని పొందగలమని దివ్యఖురాను చెబుతుంది: “నిజానికి గౌరవమైతే అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు,విశ్వాసులకే చెందుతుంది.కానీ ఈ కపటులు తెలుసుకోవటం లేదు” [అల్ మునాఫిఖూన్/8].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14