జనాబె అబూతాలిబ్ గురించి ఆయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ ఇస్ఫెహానీ అరబీ భాషలో కవితను రచించారు, వాటి నుండి కొన్నింటి అనువాదం తెలుగులో...
జనాబె అబూతాలిబ్ గురించి ఆయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ ఇస్ఫెహానీ అరబీ భాషలో కవితను రచించారు, వాటి నుండి కొన్నింటి అనువాదం తెలుగులో
1. హిదాయత్ కాంతి ముస్తఫా పినతండ్రి హృదయంలో దాగి ఉన్నా స్పష్టంగా కనిపించేది
2. వారి లోపల నిజమైన విశ్వాసం దాగి ఉంది, అది(దాగి ఉన్న ఈమాన్) మనకు అంతుచిక్కని రహస్యం
3. వారిలోని విశ్వాసం ద్వార వారున్న స్థానాన్ని పవిత్రులు తప్ప మరొకరు పొందలేరు
4. వారి విశ్వస గుర్తులు వివేకులకు మిట్ట మధ్యహ్న సమయంలో సూర్యుడు కాంతికి మించి వెలుతురైనవి(స్పష్టమైనవి)
5. వారు అంతిమ దైవప్రవక్త[స.అ] యొక్క సంరక్షకులు, అన్ని విధాలుగా వారిని కాపాడుకుంటూ వచ్చారు
6. శత్రువుల చేతుల్లో అపజయానికి పాలవ్వకుండా అడ్డుగా నిలిచారు, కష్టసమయాలలో శరణుగా నిలిచారు
7. స్థానం మరియు ప్రత్యేకత పరంగా వారిని చూసుకుంటే వారు యాసీన్ రక్షకులు మరియు తాహా శరణులు
8. మహానీయ ప్రవక్త[స.అ] యొక్క సహాయానికి నడుము బిగించారు దాంతో ఇస్లాం తన పాదాల పై నిలబడింది
9. వారికున్న గొప్పతనం ఎత్తైన పెద్ద పెద్ద కోటలకు మరియు ఆకాశానికి మించినది
10. ఎందుకని ఉండదు, వారు ముస్తఫా పోషకులు, పవిత్రులు మరియు మార్గదర్శకులు మరియు దైవప్రవక్త[స.అ] ఉత్తారాధికారుల తండ్రి
11. వసీ(ఇమామ్ అలీ) మరియు జాఫరె తయ్యార్ తండ్రి, నా ప్రాణం సాక్షిగా ఇది వారి ఉత్తమ ప్రతిష్టత[గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, పేజీ709]
రిఫరెన్స్
గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ709.
వ్యాఖ్యానించండి