హజ్రత్ అబూతాలిబ్[అ.స] కుమారుని నామకరణం

మంగళ, 03/27/2018 - 07:57

హజ్రత్ అబూతాలిబ్[అ.స] కుమారుని నామకరణ వివరణ ఒక హదీస్ ఆదారంగా.

హజ్రత్ అబూతాలిబ్[అ.స] కుమారుని నామకరణం

“యజీద్ ఇబ్నె ఖఅనబ్” ఉల్లేఖన అనుసారం: ..... మూడు రోజులు అలాగే గడిచాయి, నాలుగోవ రోజు అలీ[అ.స] యొక్క తల్లి ఆయనను తన చేతుల పై ఎత్తుకొని కాబా నుండి బయటకు వచ్చి ఇలా అన్నారు: “నిస్సందేహముగా నేను నా కన్న ముందు గతించిన స్ర్తీల పై ప్రతిష్టత గలను, ‘ఆసియా బింతె ముజాహమ్’ ఈమె, అల్లాహ్ ను ఆరాధించడం నేరంగా భావించే చోట అల్లాహ్ ను రహస్యంగా ఆరాధించేవారు. మరియు ‘మరియమ్ బింతె ఇమ్రాన్’, ఈమె తాజా పండ్లను తినేందుకు ఎండిపోయిన కర్జూరపు చెట్టును కదిపారు. కాని నేను అల్లాహ్ గృహంలో ప్రవేశించాను(అల్లాహ్ అతిథినయ్యాను) మరియు స్వర్గం యొక్క పండ్లను భుజించాను. మరి నేను బయటికి వచ్చేటప్పుడు ఇలా అని ఒక శభ్దం వినబడింది; “ఓ ఫాతెమా! నీ కుమారుడికి “అలీ” అని నామకరించు ఎందుకంటే ఇతడు గొప్పవాడు మరియు గౌరవనీయుడు. అల్లాహ్ అలీయే ఆలా ఇలా అనెను: “నేను ఇతడి పేరును నా పేరును బట్టి పెట్టాను, ఇతడిని నా గుణం ద్వార గుణవంతుడ్ని చేశాను మరియు నా గుప్తజ్ఞానాన్ని ప్రసాదించాను. ఇతనే నా ఇంట్లో ఉన్న విగ్రహాలను నాశనం చేస్తాడు, ఇతనే నా గృహం పై ఎక్కి అజాన్ ఇస్తాడు. ఇతను నన్ను చాలా ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు. ఇతని పట్ల మిత్రభావం కలిగి ఉన్న వారు(ఇష్టపడేవారు) మరియు అతని పట్ల విధేయత చూపు వారికి శుభం మరియు ఇతని పట్ల వైరం మరియు వ్యతిరేకత కలిగి ఉన్నవారికి అశుభం ఉంది”.[అమాలీ సదూఖ్, పేజీ80]

రిఫ్రెన్స్
షేఖ్ సదీఖ్, అమాలీ సదూఖ్, పేజీ80.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meraj on

خیلی عالی بود
زندہ باشید سلامت باشید

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34