అప్పు చేయటం ఇష్టం లేదు

ఆది, 03/08/2020 - 14:54

తమ అవసరాలకు మించి ఖర్చులు చేసి అప్పుల బారిన పడొద్దని తెలిపే ఇమాం అలి[అ.స] ల వారి ఒక సంఘటన.

అప్పు,ఇమాం అలి,అవసరం.

ఒక రోజు ఇమాం అలి[అ.స] ల వారు ఒక మాంసాన్ని విక్రయించే దుకాణం మీదుగా వెళ్ళటం జరిగింది అది చూసిన కసాయి ఇమాం అలి[అ.స] ల వారితో "ఓ అమీరుల్ మొమినీన్ నా వద్ద తాజా,మంచి మాంసము వచ్చియున్నది,మీ ఇంటివారి కొరకు దానిలో నుండి కొంత కొనగలరు" అని అన్నాడు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు నా వద్ద ప్రస్తుతం డబ్బులు లేవు అని అన్నారు.తిరిగి కసాయి పరవాలేదు నేను మీరు డబ్బులు ఇచ్చే వరకు సహనాన్ని పాఠించగలను[డబ్బులు తరువాత చెల్లించగలరు] అని అన్నాడు.దానికి ఇమాం అలి[అ.స] నేను మాంసాన్ని కొనటం పట్ల సహనాన్ని పాఠించగలను కానీ అప్పుగా తీసుకోలేను అని చెప్పి మాంసాన్ని కొనకుండా తన దారిన వెళ్ళిపోయారు. తమ స్థాయికి మరియు అవసరాలకు మించి ఖర్చులు చేసి అప్పుల బారిన పడే వారికి ఇమాం అలి[అ.స] ల వారి ఈ సంఘటన ఒక గుణపాఠం.

రెఫరెన్స్: ఇర్షాదుల్ ఖులూబ్,దైలమి,పేజీ నం:119.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9