ఇమాం అలి[అ.స] జన్మోత్సవాలు మరియు మన కర్తవ్యాలు

బుధ, 04/04/2018 - 17:49

ఎలాంటి జీవితాన్ని అయితే అలి[అ.స] ల వారు మన నుండి కోరుకుంటారో మన జీవితం అలాంటిదేనా?  

 

ఇమాం అలి[అ.స] జన్మోత్సవాలు మరియు మన కర్తవ్యాలు

ప్రపంచమంతా ఇమాం అలి[అ.స]ల వారి జన్మదిన వేడుకలలో నిమగ్నమై ఉన్నది,వాస్తవంగా ఈ వేడుకలు ఎంత ఘనంగా జరుపుకున్నా తక్కువే.ఎందువలననగా ఈ తారీకు యొక్క ప్రాముఖ్యత అటువంటిది,ఎందువలననగా ఈ రోజు జన్మించిన వ్యక్తి  కేవలం తన వాళ్ళ కోసం వారి బాధలు,కష్టాలే కాకుండా సమాజంలో ఉండే ప్రతీ మానవుని కష్టాలను తీర్చుట కోసం తాపత్రయ పడేవాడు,అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకోవాలి?ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం ద్వారా మనం ఈ ప్రపంచానికి ఆయన పేరు మీదుగా ఏ సందేశాన్ని ఇస్తున్నాము అనేది ముఖ్యం.
ఏ విధంగా జరుపుకోవాలంటే సమస్త ప్రపంచానికి ఆయన వ్యక్తిత్వం మరియు ఆయన బోధనలను తెలియజేయవలసిన అవసరం ఉన్నది,ఎందుకనగా ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా,ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే,ఆయన జీవితం యొక్క ప్రతీ క్షణం ఆ అల్లాహ్ ఇష్టానుసారంగా గడిచింది అలాంటిది ఆయన అనుచరులు ప్రవర్తన ఆయనకు బాధ కలిగేల ఉండటం సరియైనదా?
ఆయన వ్యక్తిత్వం గురించి కేవలం ముస్లిములే కాదు క్రైస్తవులు సైతం ఆయన నిర్మల హ్రుదయానికి,ఆయన సాదా సీదా జీవితానికి,ఆయన తెలివి మరియు జ్ఞానానికి ముగ్దులయ్యారు.
సర్ విలియం మొర్[1818-1905] ఇలా అన్నారు: “ఇమాం అలి[అ.స]ల వారు ముస్లిం ప్రపంచంలో ఎల్లప్పుడూ వారి సజ్జనత్వం[మంచితనం] మరియు తెలివి మరియు జ్ఞానానికి ఉదాహరణగా ఉంటారు”.
ప్రొఫెసర్ ఫిలిప్[1886-1978] ఇలా అన్నారు: “ఇమాం అలి[అ.స] యొక్క గుర్తింపు ఆయన సరళత్వం మరియు సాదా సీదాగ ఉండే స్వభావంతోనే అని చెప్పవచ్చు,ఎందువలననగా ఆయన చిన్ననాటి నుండి  ఆయన తన సర్వశ్వాన్ని మహాప్రవక్త[స.అ.వ]ల వారిపై త్యాగం చేసి ఉన్నారు”.
ఇప్పుడు మనము మన అంతరాత్మను ప్రశ్నించవలసిన పని ఉంది,ఏ విషయానికైతే అలి[అ.స] ల వారు చింతించేవారో మన చింతన కూడా దాని గురించేనా?ఏ ఏకేస్వరవాదం గురించి ఇమాం అలి[అ.స] తన జీవితమంతా పోరాడుతూనే ఉన్నారో ఆ ఏకేస్వరవాదం మన జీవితంలో ఉన్నదా?అలి[అ.స] యొక్క సాదా సీదా జీవితం మన ఫ్యాషన్ లతో నిండిన జీవితాలలో కనుమరుగైపోలేదు కదా?మనము వారి ఉపదేశాలను ఎంతవరకు అనుసరిస్తున్నాము?ఖురాన్,నెహ్జుల్ బలాఘాలకు మన జీవితంలో ఏ మాత్రం ప్రాముఖ్యత ఉన్నది? ఈ విషయాలపై ఆలోచించ వలసిన అవసరం ఉన్నది.

రిప్రెన్స్
కితాబ్ ఇమాం అలి[అ.స] పేజీ నం:87.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19