అలి[అ.స] అన్యాయపరుడు కాదు

సోమ, 03/09/2020 - 17:17

ఇమాం అలి[అ.స] ల వారి న్యాయశీలతను మరియు వారి గొప్పతనాన్ని తెలియజేసే దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉపదేశం.

అన్యాయం,ఇమాం అలి,తీర్పు.

ఇమాం అలి[అ.స] ల వారు యెమెన్ లో దైవప్రవక్త తరపున నియమింపబడి ఉన్నప్పుడు ఒక రోజు కొందరు వ్యక్తులు ఇమాం అలి[అ.స] ల వారి వద్దకు వచ్చి వారి గొడవను ప్రస్థావించారు. వారిలో ఒకరి గుర్రం పారి పోయి ఒక వ్యక్తిని తన్ని చంపేసింది.ఆ గుర్రం యొక్క యజమాని ఆ గుర్రం పారిపోయిందని చెప్పటానికి ఒక సాక్షిని తీసుకు వచ్చాడు.ఇమాం అలి[అ.స] ల వారు ఆ వ్యక్తి జరిగినదానికి జామినుదారుడు కాదని తీర్పు చెప్పారు.చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు యెమెన్ నుండి దైవప్రవక్త[స.అ.వ] ల వారి వద్దకు వచ్చి “అలి[అ.స] మా పట్ల అన్యాయం చేశారు.చనిపోయిన మా వ్యక్తి ప్రాణానికి ఎటువంటి విలువ లేకుండా చేశారు” అని అన్నారు.అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు “అలి[అ.స] అన్యాయపరుడు కాదు.అతడు అన్యాయం చేయటానికి సృష్టించబడలేదు.నా తరువాత అధికారము మరియు నా వారసత్వం అతనికే చెందుతుంది.అతని వాక్కులు మరియు ఆజ్ఞలు న్యాయపరమైనవి.అతని అధికారాన్ని తిరస్కరించేవాడు అవిశ్వాసుడు” అని అన్నారు.

రెఫరెన్స్: ఖజావత్ హాయె అమీరుల్ మొమినీన్,ముహమ్మద్ తుస్తురి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16