ఖుర్ఆన్ మరియు గ్రంథం

మంగళ, 04/14/2020 - 17:24

నేను నా తరువాత అల్లాహ్ గ్రంథం మరియు నా సున్నత్ ను విడిచి వెళ్తున్నాను, అని కాదా దైవప్రవక్త[స.అ] ప్రవచించినది?

ఖుర్ఆన్ మరియు గ్రంథం

నేను నా తరువాత అల్లాహ్ గ్రంథం మరియు నా సున్నత్ ను విడిచి వెళ్తున్నాను, అని కాదా దైవప్రవక్త[స.అ] ప్రవచించినది?.
ఇది ఒక సహజమైన అపార్థము. యదార్థమేమిటంటే దైవప్రవక్త[స.అ] యొక్క చివరి ఉపన్యాసంతో సంబంధం ఉంది అని చెప్పబడిన ఈ ప్రవచనం, ఎటువంటి ఆధారం లేనిది. ఈ ప్రవచనం “సహాహ్ సిత్తహ్” నుండి ఏ ఒక్క గ్రంథంలో రచించబడి లేదు. మాలిక్ యొక్క గ్రంథం “ముఅత్తా”, ఇబ్నె హిషామ్ యొక్క “సీరతె రసూలల్లాహ్” మరియు “తారీఖె తబరీ”లో ఉన్న రివాయత్లు రావీయుల క్రమం(అస్నాద్) ప్రకారం అసంపూర్ణమైనవి. మరికొన్ని రివాయత్లున్నాయి వాటి అస్నాద్(రావీయుల క్రమం) సంపూర్ణంగానే ఉన్నాయి, అవి చాలా తక్కువ. ఆ హదీసులన్నింటి రావీయులు అహ్లెసున్నత్ రిజాల్ జ్ఞానం తెలిసిన ఉలమాల దృష్టిలో ఏమాత్రం నమ్మకస్తులు కారు. పరిశోధన చేయాలనుకుంటున్నవారు వీటికి సంబంధించిన గ్రంథాలను చదివి యదార్థాలను సమ్మతించగలరు.
ఇక్కడ దైవప్రవక్త[స.అ] సున్నత్ ను అనుసరించకూడదు అని ఏమాత్రం అనడం లేదు. ఇంతకు ముందు చెప్పిన విధంగా; దైవప్రవక్త[స.అ], ముస్లిములు వారి[స.అ] సున్నత్ ను మాన్యత, స్వచ్ఛత మరియు అపార్థాలు లేని మూలంగా భావించి అహ్లెబైత్[అ.స]లను ఆశ్రయించాలి అని కోరుకున్నారు.
ఆయత్ “ఓ ముహమ్మద్[స.అ]! వారితో ఇలా చెప్పండి నేను మీ నుండి అల్లాహ్ ఆదేశాలను చేర్చిన దానికిగాను ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు, కాని అహ్లెబైత్[అ.స] ప్రేమను మాత్రం కోరుతున్నాను”[షూరా:23], ఈ ఆయత్ అవతరింపబడినప్పుడు ముస్లిములు దైవప్రవక్త[స.అ]తో ఇలా ప్రశ్నించారు: మాపై ఎవరి ప్రేమ అయితే విధిగా నిర్ధారించబడిందో మీ ఆ అహ్లెబైత్ ఎవరూ? దైవప్రవక్త[స.అ] ఇలా సమాధానమిచ్చారు: అలీ, ఫాతెమా మరియు వారి ఇద్దరు కుమారులు[అ.స].[అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, భాగం2, పేజీ444].

రిఫరెన్స్
అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, భాగం2, పేజీ444; అల్ ఖస్తలానీ, ఇర్షాదుస్ సారీ షర్హు సహీహ్ అల్ బుఖారీ, భాగం7, పేజీ331; అల్ సీవ్తీ, అల్ దురరుల్ మన్సూర్, భాగం6, పేజీ6,7; అల్ అలూసీ అల్ బగ్దాదీ, రూహుల్ మఆనీ, భాగం25, పేజీ2,31

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18