షాబాన్ మాసపు చివరి మూడు ఉపవాసాలు

గురు, 04/16/2020 - 17:47

ఇమాం సాదిఖ్[అ.స] ల వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం షాబాన్ మాసపు చివరి మూడు రోజుల ఉపవాసముంటే పూర్తి మాసం ఉపవాసమున్న పుణ్యాన్ని అతని కార్యచిట్టాలో లిఖించటం జరుగుతుంది.

షాబాన్ మాసం,ఇమాం సాదిఖ్,ఉపవాసం.

షాబాన్ మాసము తన కృప మరియు కారుణ్యంతో మనల్ని వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.ఈ మాసాన్ని ఆ దేవుని దయ మరియు అతని సామిప్యాన్ని పొందటానికి ఏ మాత్రం కృషి చేశాము?అని మనల్ని మనము ప్రశ్నించుకునే అవసరముంది.ఒక వేళ మనము ఆ కృపాశీలుడైన అల్లాహ్ దయను అతని సామిప్యాన్ని పొందలేకపోయామా? లేదా ఈ మాసాన్ని ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క నిజమైన దాసులు ఆదరిస్తారో ఆ విధంగా ఆదరించలేకపోయామా? అని అనుకుంటే ఈ మాసం యొక్క చివరి రోజులు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాయి.ఈ పూర్తి మాసంలో చేయలేకపోయిన పుణ్యకార్యాలను చేయటానికి మరియు ఆ దేవుని సన్నిధిలో ప్రాయశ్చితాన్ని ఈ షాబాన్ యొక్క చివరి రోజులలో పొందటానికి కృషిచేయగలము. ముఖ్యంగా ఈ మాసపు చివరి మూడు రోజులలో ప్రార్ధనలతో పాటు ఉపవాసముండమని చాలా హదీసులలో తాకీదు చేయటం జరిగింది.ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే షాబాన్ మాసం యొక్క చివరి మూడు రోజులు ఉపవాసముండి వాటిని రమజాన్ మాసంతో కలుపుతారో,ఆ భగవంతుడు అతనికి ఒకదాని తరువాత ఒకటి రెండు మాసాల ఉపవాసం యొక్క పుణ్యాన్ని అతని కార్యాల చిట్టాలో లిఖిస్తాడు.

రెఫరెన్స్: వసాయెలుష్ షీయా,7వ భాగము,పేజీ నం:375,హదీసు నం:22.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17