హారిస్ సంఘటన

ఆది, 04/19/2020 - 17:28

దైవప్రవక్త[స.అ] గదీర్ ప్రచారం పై సందేహం వ్యక్తం చేసిన వ్యక్తి గురించి సంక్షిప్త వివరణ...

హారిస్ సంఘటన

ఒకవ్యక్తి ఈ గదీరె ఖుమ్ సంఘటన విని జీర్ణించుకోలేక దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: మీరు మాకు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అని అన్నారు, మేము మీ మాటను స్వీకరించాము. మీరు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయమని ఆదేశించారు, మేము మీకు విధేయత చూపాము. మీరు రమజాన్ మాసంలో ఉపవాస దీక్షను పాటించమన్నారు, మేము మీ పట్ల విధేయతను చూపాము. మీరు హజ్ కోసం మక్కా వెళ్ళమని ఆదేశించారు, మేము విశ్వసించాము. కాని మీరు వాటిన్నింటి ద్వార సంతృప్తి చెందలేదు, ఇక ఇప్పుడు మీ పినతండ్రి కుమారుడి చేయిని ఎత్తి “నేనెవరికైతే మౌలా(స్వామి)నో, వారికి అలీ మౌలా(స్వామి)!!... అని మాపై మౌలా(స్వామి)గా నిర్ధారించేశారు. ఈ కొత్త ఆదేశం మీ తరపు నుంచా లేక అల్లాహ్ తరపు నుంచా?”. దైవప్రవక్త[స.అ] ఇలా సమాధానమిచ్చారు: ఆ అద్వితీయుఁడైన అల్లాహ్ సాక్షిగా, ఇది అల్లాహ్ జల్లజలాలుహు తరఫు నుంచే.
ఈ సమాధానం విన్న తరువాత ఆ వ్యక్తి తిరిగి తన ఒంటె వైపుకు వెళ్తూ ఇలా అన్నాడు: ఓ ప్రభూ! ముహమ్మద్ చెప్పిందే సత్యమైతే నాపై ఆకాశం నుండి రాళ్లు కురిపించు మరియు కఠినమైన శిక్షకు గురి చేయి. అతడు తన ఒంటె వరకు చేరక ముందే అల్లాహ్ ఆకాశం నుండి రాయిని పంపాడు అది అతడి తలను చీల్చుతూ అతడి శరీరంలో దిగిపోయింది, అతడు అక్కడిక్కడే మరణించాడు. ఆ సమయంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఆయతులను అవతరింపజేశాడు:
“అడిగేవాడొకడు తప్పకుండా రానున్న శిక్షను గురించి అడిగాడు. అది అవిశ్వాసుల పై (రానున్నది). దానిని తప్పించే వాడెవ్వడూ లేడు. అది (ఆ శిక్ష) సోపానాలకు యజమాని అయిన అల్లాహ్ తరఫున సంభివిస్తుంది.[మఆరిజ్:1-3]

రిఫరెన్స్
ఉపయోగపడే జ్ఞానపరమైన సంక్షిప్త వ్యాసాలు, IslamInTelugu.org

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20