.గదీర్ హదీసును అహ్లెసున్నత్ ప్రముఖులు ప్రవచించారు. వాటిని అల్లామా అమీనీ[ర.అ] తన పుస్తకం “అల్ గదీర్”లో ప్రవచించారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే గదీర్ హదీసును అహ్లెసున్నత్ ప్రముఖులు ప్రవచించారు. ఇంతకు ముందు వేరే వ్యాసంలో ప్రవచించిన వారు కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రవచించారు, ఉదా: “తిర్మిజీ”, “ఇబ్నె మాజా”, “ఇబ్నె అసాకిర్”, “అబూ నయీమ్”, “ఇబ్నె అసీర్”, “ఖారజ్మీ”, “సివ్తీ”, “ఇబ్నె హజర్”, “అల్ హైసమీ”, “ఇబ్నె సబ్బాగె మాలికీ”, “ఖందూజీ”, “హనఫీ”, “ఇబ్నె అల్ మగాజీ”, “ఇబ్నె కసీర్”, “హుమ్యనీ”, “హస్కానీ”, “గజాలీ”, “బుఖారీ” తమ తమ చరిత్ర పుస్తకాలలో (వీళ్ళందరు రచించారు), అల్లామా అమీనీ[ర.అ] తన పుస్తకం “అల్ గదీర్”లో ఇలా ప్రవచించారు: అహ్లెసున్నత్ ఉలమాలు, రావీయుల తరగతుల మరియు వర్గాల విభేదాలు ఉన్నపుటికీ హిజ్రీ శకం మొదటి శతాబ్దం నుండి పద్నాల్గొవ శతాబ్దం వరకు ప్రతీ శతాబ్దంలో ఈ హదీసును ఉల్లేఖించారు, మరి వాళ్ళ సంఖ్య 360 కన్న ఎక్కువ. పరిశోధన చేయాలను కుంటున్న వారు అల్లామా అమీనీ[ర.అ] గారి “అల్ గదీర్” పుస్తకాన్ని చదవవచ్చు.[అల్ గదీర్, 11భాగాలు]
రిఫ్రెన్స్
అల్లామా అమీని గారి పుస్తకం “అల్ గదీర్”. ఇది 11 భాగలలో రచించ బడింది. ఇందులో గదీర్‌కు సంబంధించిన ప్రతీ దానికి అహ్లెసున్నత్ ఉలమాల ప్రవచనను లిఖించారు.
వ్యాఖ్యలు
أحسنت أحسنت
Shukriya.
వ్యాఖ్యానించండి