ఆకాసపు ద్వారాలు తెరుచుకునే మాసము

శని, 05/09/2020 - 14:49

ఆకాశపు ద్వారాలు తెరవబడటమంటే,మానవుడు తాను చేసే పాపాల కారణంగా ఆ భగవంతునికి దూరమైపోతాడు,అవి మానవునికి ఆ భగవంతునికి మధ్య ఆటంకంగా లేదా అడ్డంకులుగా మారతాయి,అందువలనే అతని ప్రార్ధనలు కూడా ఆ భగవంతుని వద్దకు చేరవు,కానీ ఈ మాసంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి,అప్పుడు మానవుడు ఆ అల్లాహ్ తో తన అభ్యర్ధనలను మరియు విన్నపాలను విన్నవించుకోగలడు.

ఆకాశపు ద్వారలు,రమజాన్ మాసము,ఇమాం అలి.

 రమజాన్ మాసము అన్ని మాసాలలో కెల్లా పవిత్రమైన మాసము.ఎలాంటి మాసమంటే ఈ మాసంలో పాపుల యొక్క పాపాలు క్షమించబడతాయి,షైతాను బంధించ బడతాడు,స్వర్గపు ద్వారాలు తెరవబడి,నరకపు ద్వారాలు మూసివేయబడతాయి,మానవుని మునుపటి పాపాలు హరించబడతాయి.ఒక చోట ఇమాం అలి(అ.స) ల వారు  విధంగా సెలవిస్తున్నారు: ఒక వేళ అల్లాహ్, అహ్మద్ యొక్క ఉమ్మత్ [మతానుయాయులు] ను శిక్షించాలనుకుంటే వారికి రమజాను మాసాన్ని మరియు "సూర ఎ తౌహీద్" ను వారికి ఇచ్చే వాడు కాదు.వేరొక హదీసులో ఇమాం అలి[అ.స్] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: తెలుసుకోండి! ఆకాసపు ద్వారాలు ఈ మాసము యొక్క మొదటి రాత్రి నుండి తెరవబడి ఉన్నాయి.కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడటమంటే ఏమిటి? అన్న సందేహం కలుగవచ్చు. ఆకాశపు ద్వారాలు తెరవబడటమంటే ఏమిటి నిజంగా ఆకాశానికి ద్వారాలుంటాయా? దీనికి సమాధానము ఒక్కటే,మానవుడు తాను చేసే పాపాల కారణంగా ఆ భగవంతునికి దూరమైపోతాడు,అవి మానవునికి ఆ భగవంతునికి మధ్య ఆటంకంగా లేదా అడ్డంకులుగా మారతాయి,అందువలనే అతని ప్రార్ధనలు కూడా ఆ భగవంతుని వద్దకు చేరవు,కానీ ఈ మాసంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి,అప్పుడు మానవుడు ఆ అల్లాహ్ తో తన అభ్యర్ధనలను మరియు విన్నపాలను విన్నవించుకోగలడు.  

రెఫరెన్స్: కష్ఫుల్ అస్రార్ వ ఇద్దతుల్ అబ్రార్,1 వ భాగము,పేజీ నం:495, వసాయెలుష్ షీయ,10వ భాగం,పేజీ నం: 304.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13