దైవప్రవక్త[స.అ] మరణాంతరం సఖీఫహ్లో ఏకమైన వాళ్ళు దైవాజ్ఞాను పట్టించుకోకుండా డెమోక్రటిక్ మార్గాన్ని ఎన్నుకున్నారు...
ఇస్లాం ఆదేశాలకు వ్యతిరేకంగా స్వయపరియాలోచన మద్దత్తు దారులు ప్రతీ కాలంలో ఉన్నారు. కాని ఇస్లాం స్పష్ట ఆదేశాల మార్గంలో కట్టుబాట్లుంటాయి మనసుకు నచ్చినట్లు చేయలేము. మరి పరియాలోచన మార్గంలో అయితే ఎటువంటి కట్టుబాట్లుండవు, స్వాతంత్రమే స్వాతంత్రం. దీనిని డెమోక్రటిక్ మార్గం అంటారు. ఇక్కడ స్పష్టమైయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త[స.అ] మరణాంతరం సఖీఫహ్లో ఏకమైన వాళ్ళు దైవాజ్ఞాను పట్టించుకోకుండా డెమోక్రటిక్ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇలాంటి సంధర్భంలో ప్రజలు స్వయంగా తమ మంచి చెడ్డల నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అల్లాహ్కు కూడా అధికారం ఉండదు. డెమోక్రటిక్ పదం సహాబీయులకు కూడా తెలియదు. వాళ్ళకు కేవలం షూరా కట్టుదిట్టములు తెలుసు. అలా అని అబూబక్ర్ను షురా ఎన్నుకుంది అనడం కూడా సరికాదు ఎందుకంటే అందులో పాలుగొన్నవాళ్ళ వద్ద ఎటువంటి మార్గదర్శక ఆధారపత్రం లేదు.
వ్యాఖ్యానించండి