షైఖ్ అబ్బాసె ఖుమ్మి ల వారు షబే ఖద్ర్ గోప్యతకు కారణాన్ని ప్రస్థావిస్తూ "విశ్వాసులు ఈ మూడు రాత్రుల సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని,ఈ మూడు రాత్రులు మెలకువగా ఉండి ఆ సమయాన్ని ప్రార్ధనల కొరకు కేటాయించాలని అలా చేయటం జరిగింది" అని అన్నారు.
పవిత్ర రమజాన్ యొక్క 19,21,23 రాత్రులను "షబె ఖద్ర్" గా పిలుస్తారు.మాసూముల హదీసులలో కూడా ఒక చోట 23 రాత్రి అని,మరొక చోట ఈ రాత్రులలో రెండు రాత్రులు షబె ఖద్ర్ అని ,మరి కొన్ని చోట్ల ఈ మూడు రాత్రులు షబె ఖద్ర్ అని చెప్పటం జరిగింది.కానీ వీటిలో ఏ రాత్రి షబె ఖద్ర్ అయ్యి ఉండవచ్చు అనేది కచ్చితంగా చెప్పలేము.కానీ షబే ఖద్ర్ ను గోప్యంగా ఉంచటానికి గల కారణం ఏమిటి అన్న ప్రశ్న కలుగుతుంది.దానికి ఎన్నో కారణాలు వివరిచటం జరిగింది.షైఖ్ అబ్బాసె ఖుమ్మి ల వారు ఒక చోట దీనికి కారణాన్ని ప్రస్థావిస్తూ షబె ఖద్ర్ ఏ రాత్రి?అనేది మాసూముల ద్వారా కూడ కచ్చితంగా వివరించబడలేదు,ఎందుకంటే విశ్వాసులు ఈ మూడు రాత్రుల సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని,ఈ మూడు రాత్రులు మెలకువగా ఉండి ఆ సమయాన్ని ప్రార్ధనల కొరకు కేటాయించాలని అలా చేయటం జరిగింది.
రెఫరెన్స్: షైఖ్ అబ్బాసె ఖుమ్మి,మఫాతీహుల్ జినాన్,ఫర్హంగె ఇస్లామి,తెహ్రాన్,1370,పేజీ నం:411.
వ్యాఖ్యానించండి