షియా నమ్మకాలను వారి గ్రంథాల నుండి తెలుసుకోండి

శుక్ర, 07/17/2020 - 15:25

ఇతర వర్గాల వివేకమంతులైన యువకులు కళ్ళు తెరిచి షియా ముస్లిముల పుస్తకాలు చదవండి, వారితో కలవండి మరియు వాళ్ళ ఉలమాలతో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీరు యదార్ధాన్ని తెలుసుకోగలరు.

షియా నమ్మకాలను వారి గ్రంథాల నుండి తెలుసుకోండి

పారంపర్య ప్రతిపక్షపాతం మరియు శత్రుత్వపు కాలం, అంతం అయ్యింది. ఇప్పుడు కాంతి, వెలుగు మరియు ఆలోచన స్వేచ్ఛగల కాలం వచ్చేసింది. వివేకులు మరియు పరివర్తనాన్ని ఇష్టపడే యువకులు కళ్ళు తెరిచి షియా ముస్లిముల పుస్తకాలు చదవండి, వారితో కలవండి మరియు వాళ్ళ ఉలమాలతో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీరు యదార్ధాన్ని తెలుసుకోగలరు. ఎంతమంది తమ వాక్చాతుర్యం ద్వార మిమ్మల్ని మోసగిస్తున్నారో మరియు అర్ధం లేని మాటలను వినిపిస్తున్నారో!.
ఇనాడు ప్రపంచమంతా మనిషి చేతుల్లో ఉంది. షియా ముస్లిములు కూడా వివిధ నగరములలో ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఒక పరిశోధకుడికి, షియా ముస్లిముల గురించి, షియా శత్రువులతో మరియు విరోధులతో ప్రశ్నించే హక్కులేదు. మొదట్నుండే షియా ముస్లిముల శత్రువులతో ప్రశ్నించేవాడు, ఏమి ఆశించగలడు? షియా వర్గం ఒక గుప్త వర్గం కూడా కాదు, దాని విశ్వాసాలు ఎవరికీ తెలియవు, అని అనడానికి. అంతేకాదు వారి పుస్తకాలు మరియు పబ్లికేషన్స్, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. తెలుసుకోవాలని అనుకునే ప్రతీ ఒక్కరి కోసం, మద్రసాలు మరియు ఇస్లామీయ యూనివర్సిటీల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. వాళ్ళ ఉలమాల తరపు నుండి కాన్ఫ్రెన్స్‌లు, సిమినార్లు జరుగుతూ ఉంటాయి. షియా ఉలమాలు ఇస్లాం ఉమ్మత్‌ను ఐక్యమత్యంగా ఉండడానికి పిలుపునిస్తూ ఉంటారు.
ఒకవేళ ఇస్లాం ఉమ్మత్ యొక్క న్యాయవర్తనులు, చిత్తశుధ్ధి మరియు ఎటువంటి ప్రతిపక్షపాతం లేకుండా ఈ సమస్యను పరిశోధించినట్లైతే వారు తప్పకుండా యదార్ధానికి దగ్గరవుతారు. యదార్ధం కానిదంతా మార్గభ్రష్టతే, మరి అది వాళ్ళ వరకు చేరేందుకు అడ్డు పడుతుంది, అది షియా శత్రువుల తప్పుడు ప్రచారం లేదా షియా అజ్ఞానులు చేసిన తప్పులు కూడా కావచ్చు.
ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది, కేవలం ఒక్క అనుమానం తొలిగిపోతే ఒక షియా శత్రువు, మిత్రుడిగా మారడాన్ని చూడగలరు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20