బహుమతి

మంగళ, 08/04/2020 - 13:42

ఎలాంటి బహుమతిని ఇంటికి తీసుకువెళ్ళాలి లేదా ముందు ఎవరికి ఇవ్వాలి? అనే దానిపై దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక హదీసు ద్వారా వివరణ.

బహుమతి,దైవప్రవక్త,సంతోషపరచటం.

ఇబ్నె అబ్బాస్ దైవప్రవక్త[స.అ.వ] ల వారి సమక్షంలో ఉన్నారు,వారితో పాటు ముహాజిరీన్ మరియు అన్సారులు కూడా ఉన్నారు.అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే బజారుకు వెళ్ళి తన కుటుంబం కొరకు బహుమతిని కొంటే వారు ఒక పేదవానికి సద్ఖా ఇచ్చిన వాడి మాదిరి.ఆ తరువాత ఈ విధంగా ఉల్లేఖించారు: అతడు పళ్ళు లేదా [ఏదైనా] ఆహారాన్ని లేదా తనకు తోచిన ఏ వస్తువునైనా బహుమతిగా ఇవ్వాలి.అందులోనూ ముందుగా అమ్మాయికి ఇవ్వాలి ఆ తరువాత అబ్బాయికి ఇవ్వాలి.ఎవరైతే తన కుమార్తెను సంతోషపరుస్తారో వారు ఇస్మాయిల్ సంతతి నుండి ఒక బానిసకు విముక్తి ఇచ్చినట్లు. మరియు ఎవరైతే తన కుమారుడిని సంతృప్తి పరిచి అతని కళ్ళు ఇతరుల చేతులపై[బహుమతిపై] పడకుండా చేసి వారిని సంతోషపరుస్తారో వారు అల్లాహ్ పట్ల భయభక్తులతో కన్నీటిని కార్చిన వారి మాదిరి మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తులతో కన్నీటిని కారుస్తారో వారిని అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశించేలా చేస్తాడు.

రెఫరెన్స్: తొహ్ఫతుల్ వాయెజీన్,6వ సంపుటి,పేజీ నం:109,వసాయెలుష్ షీయ,7వ సంపుటి,పేజీ నం:227.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11