అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం పలు రకాల అని ఖుర్ఆన్ వివరిస్తుంది.
త్యాగం, ఉదారత్వం యొక్క గొప్ప స్థానం, అనగా తన కన్నా ఎదుటి వారిని ప్రాముఖ్యత ఇవ్వడం. త్యాగం ప్రక్కనే ఇన్ఫాఖ్(అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం) కూడా ఉపయోగించబడుతుంది. కాని ఈ రెండింటిలో చిన్న తేడా ఉంది, ఇప్పుడు ఇన్ఫాఖ్ మరియు ఈసార్(త్యాగం) మధ్య ఉన్న తేడా తెలుసుకుందాం. ఖుర్ఆన్ ఉపదేశమనుసారం ఇన్ఫాఖ్ నాలుగు తరగతులు గలదు:
మొదటి రకం: అల్లాహ్ ప్రసాదించిన దాని నుండి దానం చేయడం. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి”[బఖరహ్:254]
రెండవ రకం: కష్టార్జితం నుండి దానం చేయడం. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి ఖర్చు చేయండి”[బఖరహ్:267]
మూడవ రకం: నచ్చిన వాటి నుండి దానం చేయడం. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవమార్గంలో) ఖర్చు పట్టనంత వరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు”[ఆలిఇమ్రాన్:92]
నాలుగో రకం: తనకు అవసరం ఉన్నప్పటికీ ఎదుటివారికి దానం చేయడం: ఖుర్ఆన్ దీనిని ఈసార్(త్యాగం) అని సూచించెను. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు”[హష్ర్:9]
పైవివరణ ద్వార స్పష్టమైయ్యే విషయమేమిటంటే, ఈసార్(త్యాగం) ఇన్ఫాఖ్ యొక్క అతి గొప్ప స్థానం అని. తమకు అవసరం ఉన్నప్పటికీ ఎదుటివారికి సహాయం చేయడం ప్రతీ పనిషికి సాధ్యం కాని పని. ఈ విషయాన్ని వివరిస్తూ హజ్రత్ అలీ[అ.స] మిస్ర్ గవర్నర్ కు వ్రాసిన ఉత్తరాలలో ఇలా ఉపదేశించారు: “.... నా చుట్టు ప్రక్కల వారు ఆకలి కడుపులతో, దప్పిక కాలయాలతో ఉండగా నేను కడుపునిండా తిని ఎలా పడుకో గలను!”[నెహ్జుల్ బలాగహ్, 415]
రిఫరెన్స్
నెహ్జుల్ బలాగహ్, 415
వ్యాఖ్యలు
Mashaallah, the best thing explained, thank you agha.
వ్యాఖ్యానించండి