స్యచ్ఛమైన అనుచరుడు

ఆది, 01/24/2021 - 16:34

స్యచ్ఛమైన అనుచరులు ఎవరు అని వివరించిన హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స]...

స్యచ్ఛమైన అనుచరుడు

ఒక వ్యక్తి హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స]తో ఇలా అన్నాడు: ఎక్కువ సంతానం కలిగివున్న పదిమంది పేదకుటుంబాలకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇమామ్: కాని ఈ షరత్తు ప్రకారం; ఇప్పటి వరకు లేదా ఆ తరువాత నీ ఆమాలును వృధా చేసుకోకుండా ఉంటే గనక.
ఆ వ్యక్తి: నా అమలు వృధా అవ్వడం సాధ్యమా? నేను మీ స్వచ్ఛమైన అనుచరులలో ఒకడిని.
ఇమామ్: నువ్వు చెప్పిన మాటతోనే వృధా అయిపోయాయి(ఎక్కువ సంతానం కలిగివున్న పదిమంది పేదకుటుంబాలకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది)
ఆ వ్యక్తి: ఎందుకని?
ఇమామ్: ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్ ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.[1]
ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు.. తమ ఉపకారాన్ని అది ఎటువంటి ఉపకారమైన సరే చాటుకుని, గ్రహీతల మనస్సులను నొప్పించడం మీ దానధర్మాలను వృధా అవడానికి కారణం. (అదీ కాకుండా) నువ్వు నా స్వచ్ఛమైన అనుచరుడు(షియా) అన్నావు, ఈ మాటతో నన్ను, దైవదూతలను మరియు నీకు కావలిగా ఉన్న దూతలందరిని నిరాశకు గురి చేశావు, ఇదే నీ దానధర్మాలు వృధా అవ్వడానికి మరియు పుణ్యం తుడిచివేయడానికి కారణం అయ్యింది.
స్యచ్ఛమైన షియా అంటే సల్మాన్, అబూజర్, మిఖ్దాద్ మరియు అమ్మార్లు, నువ్వు నిన్ను వారితో సమానంగా భావిస్తున్నావు, ఇదే నన్ను నిరాశకు గురిచేసింది.
ఆ వ్యక్తి: మరి ఎమని చేప్పాలి?
ఇమామ్: నేను మిమ్మల్ని ఇష్టపడేవారి నుండి అను
ఆ వ్యక్తి: నేను చెప్పిన మాటలకు సిగ్గు పడుతున్నాను, నన్ను క్షమించండి, నేను తౌబహ్ చేశాను
ఇమామ్: నీ ఈ తౌబహ్(పశ్చాత్తాపం) వల్ల నీ పుణ్యం తిరిగి ఇవ్వబడింది మరియు ఈ అమలు స్వీకరించబడింది.[2]

రిఫరెన్స్
1. బఖరహ్:264
2. బిహారుల్ అన్వార్, భాగం65, పేజీ159

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17