అల్ హకీమ్

ఆది, 01/07/2018 - 08:14

.అల్లాహ్ అత్యుత్తమ పేర్లలలో ఒకటి అల్ హకీమ్ అనగ మహా వివేచనా పరుడు మరియు వివేకవంతుడు. 

అల్ హకీమ్

“అల్ హకీమ్” అనగ మహా వివేచనా పరుడు, వివేకవంతుడు మరియు ఆయన ఏ నిర్ణయం గైకొన్నా అది యుక్తితో, పరమార్థంతో నిండి ఉంటుంది దాన్ని గురించి మనం ఊహించలేము. ఈ పేరు దివ్యఖుర్ఆన్ కొరకు కూడా వాడబడుతుంది. ఇది అల్లాహ్ అత్యుత్తమ పేర్లలో ఒకటి.
“అల్ హకీమ్” పదం అల్లాహ్ పేరుగా ఖుర్ఆన్‏లో 91 సార్లు వచ్చింది. “అజీజ్” పదంతో 47 సార్లు, “అలీమ్” పదంతో 39 సార్లు, “ఖబీర్” పదంతో 4 సార్లు. “తవ్వాబ్”, “వాసివున్”, “హమీద్” పదాలతో ఒకసారి ప్రస్తావించబడింది.
పవిత్ర ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: ఆయనే అల్లాహ్-సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూప కల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లు ఆయకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు.[అల్ హష్ర్, ఆయత్ 24].
هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَى يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15