ముష్రిక్ బంధువులు

మంగళ, 02/09/2021 - 17:23

ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో[సూరయె లుఖ్మాన్:15]

ముష్రిక్ బంధువులు

ఒకడు: ఖుర్ఆన్ ఇతరులకు మంచి చేయమని తాకీదు చేయలేదా2. మరి ఒక ఆయతులో తండ్రీ, సోదరుడూ మరియు బంధువుల నుండి సంబంధాన్ని తెంచుకోండి ఎందుకంటే వారు ముష్రిక్కులు కాబట్టి.  
నేను: ముందు ఆ ఆయత్ ఏ అయతో చెప్పు, దాంతో నేను సరిగా సమాధానం ఇవ్వగలను
అతడు: తౌబహ్ సూరహ్ యొక్క 23వ ఆయత్ “ఓ విశ్వాసులారా! మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు”[సూరయె తౌబహ్:23]
నేను: ఈ ఆయత్ లో వారితో సంబంధాన్ని తెంచుకోండి అని ఆదేశించబడలేదు. నవ్వు దీని అనువాదాన్ని మరోసారి పఠించు.
అతడు: మనిషి తన ముష్రిక్కులైన బంధువులను మీ స్నేహితులుగా చేసుకోకూడదు; అంటే వారితో సంబంధాన్ని తెంచుకోండి అనే కదా...
నేను: సంబంధం పెట్టుకోవడం యొక్క అర్ధం స్నేహితులుగా చేసుకోవడం యొక్క అర్ధానికి మించినది. నీకు నీ చాలామంది బంధువులతో సంబంధం ఉండి ఉంటుంది., కాని వారిలో చాలా తక్కువ మందితోనే స్నేహంగా ఉంటావు. అంటే సంబంధం ఉండడం అంటే స్నేహితుల అని అర్ధం కాదు. ఈ ఆయత్ కూడా అదే చెబుతుంది; ముష్రిక్కులైన మీ తండ్రులను మరియు సోదరులను స్నేహితులుగా చేసుకోకండి; ఎందుకంటే వారు మిమ్మల్ని అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] మార్గం నుండి దూరం చేయాలనుకుంటారు. ఎక్కడైతే అల్లాహ్ ఈ విధంగా ఇలా ఉపదేశించాడు అదే ఖుర్ఆన్ లో మంచి ప్రవర్తనను ప్రత్యేకంగా అవిశ్వాసులైన తల్లిదండ్రుల గురించి కూడా ఆదేశించాడు: “ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో”[సూరయె లుఖ్మాన్:15] అలాగే హదీసులు ఈ విధంగా మనకు ఆదేశిస్తున్నాయి; “బంధువులతో సంబంధాన్ని ఒక సలామ్ చేయడం లేదా సలామ్ యొక్క సమాధానం ఇవ్వడం ద్వార కాపాడుకోండి”(కాఫీ(తా-అల్ ఇస్లామియ), మర్హూమ్ కులైనీ, భాగం2, పేజీ157)
ఈ విధంగా చూసుకున్నట్లైతే ఖుర్ఆన్ మరియు ఇస్లాం, సంబంధాన్ని తెంచుకోవడానికి సమ్మతించడం లేదు.
అతడు: ఒకవైపు అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు అని ఆదేశించబడితే మరో వైపు వారి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆదేశించబడుతుంది. నా ఆలోచన ప్రకారం ఈ రెండు ఆదేశాలలో పరస్పర వ్యతిరేకత ఉంది.
నేను: చూడు ప్రియ మిత్రమా! ఒకరితో సంబంధం కలిగి ఉండడం అతడు నీ స్నేహితుడు కూడా అని అర్ధం కాదు అని ముందే చెప్పాను; బంధువుల ఉదాహారణ కూడా ఇచ్చాను. నీ ప్రశ్న ఖుర్ఆన్ ముష్రిక్కులైన బంధువుల(తండ్రీ, సోదరులు మొ...) నుండి సంబంధం తెంచుకోవాలని ఉపదేశించింది, వారితో ఎటువంటి సంబంధం ఉండకూడదు అని ఆజ్ఞాపించింది అని; నిజానికి ఖుర్ఆన్ ఇలా ఉపదేశించలేదు. నువ్వు మన సంభషణను మారుస్తున్నావు.
అతడు: నేను తెలుసుకోవాలనుకుంటున్న విషయమేమిటంటే ఎందుకు ఖుర్ఆన్ అవిశ్వాసులైన బంధువుల సంబంధాన్ని తెంచుకోవాలని ఆదేశించింది? దీని లాభమేమిటి?, ఎందుకు ఇలా ఆజ్ఞాపించబడింది?
నేను: ముష్రిక్కులైన బంధువులతో స్నేహాన్ని నిషేదించడం పై ఖుర్ఆన్ ఆదేశం ఒక తర్కం పై ఆధారపడి ఉంది దీని ప్రభావాలు స్వయంగా మనిషిపైనే పడతాయి. అనుకుందాం., ఒక అవిశ్వాసి తండ్రి ఉన్నాడు అతడు తన కుమారుడ్ని తాను నడుస్తున్న మార్గం పైనే నడవాలని భావిస్తాడు. ఉదాహారణకు అవిశ్వాసి అయిన తండ్రి(యూరప్ లేదా ఆఫ్రీకాకు చెందినవారు), మద్యం సేవిస్తాడు అతడు తన విశ్వాసి కుమారుడు కూడా త్రాగాలని కోరుకుంటాడు. ఈ విషయం, పరలోక ప్రభావాలతో పాటు ఇహలోకంలో అతి నీఛమైన ప్రభావాలకు కారణమౌతుంది.
అతడు: మీరు చెప్పిన మాటను సమ్మతిస్తున్నాను. ఈ సంఘటన నా మునుపటి మిత్రుడికి ఎదురొచ్చింది. అతడి తండ్రి సంవత్సరానికి కొన్ని సార్లు యూరప్ వెళ్లేవాడు, చివరికి మద్యంపానం చట్టం పట్ల గౌరవం తగ్గింది, మద్యపానానికి అలవాటు పడ్డాడు, ఇక ఇప్పుడు అతడి కుమారుడు కూడా తండ్రి అడుగుజాడలో నడిచి మద్యం సేవించడం మొదలు పెట్టాడు.
నేను: ఈ తండ్రి విశ్వాసపరంగా బలహీనంగా ఉండడం వల్ల ఇలా జరిగింది, అదే అల్లాహ్ పట్ల విశ్వాసమే లేకపోయి ఉంటే, హలాల్ మరియు హరామ్ జ్ఞానం లేకుంటే ఏమౌతుందో ఊహించు.

రిఫరెన్స్
https://btid.org/fa/news/136589

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2