.ఇస్లాం దృష్టిలో షిర్క్ మహా పాపం మరియు ఘోరమైన అన్యాయం.
షిర్క్ అనగ సమానం మరియు సాటిని విశ్వసించడం. అనగ అల్లాహ్ విషయంలో రూపురేఖలు, పోలికలు మరియు ప్రతిమను అంగీకరించడం, అది అల్లాహ్ అస్థిత్వంలో అయినా లేదా గుణవిశేషాలలో అయినా లేదా సృష్టిపరంగా అయినా లేదా ఆరాధన పరంగా అయినా గాని. సాధారణ భాషలో చెప్పాలంటే షిర్క్ అనగ బహుదేవారాధన. ఖుర్ఆన్ దృష్టిలో షిర్క్ మహాపాపం. ఖుర్ఆన్ ఉపదేశానుసారం అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం ఘోరమైన అన్యాయం. వీటినే వివరిస్తూ అల్లాహ్ తన గ్రంథంలో అవతరించిన కొన్ని ఆయత్ లను తిలకించండి:
1. షిర్క్, క్షమించరాని పాపము కేవలం తౌబా ద్వారానే క్షమార్హులవుతారు
అల్లాహ్ ఇలా ప్రవచించెను: తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని(షిర్క్ ను) అల్లాహ్ ఏమాత్రం క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపములను క్షమిస్తాడు. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోరపాపంతో కూడిన కల్పన చేశాడు.[నిసా,48]
2. షిర్క ఘోరమైన అన్యాయం
అల్లాహ్ ఇలా ప్రవచించెను: “లుఖ్మాన్ తన కుమారునికి హితభోధ చేస్తూ ఇలా అన్నాడు: కమారా! అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా షిర్క్ ఘోరమైన అన్యాయం”[లుఖ్మాన్,13].
వ్యాఖ్యలు
I’m not that much of a online reader to be honest but your blogs really nice, keep it up!

I'll go ahead and bookmark your site to come back later on. Many thanks

genus Pritzelago (Maya)

http://boreliozakrakow.tumblr.com
వ్యాఖ్యానించండి