షిర్క్ వ్యాధి సోకిన ఈమాన్

శని, 08/11/2018 - 14:40

ఒక్కోక్కసారి మనిషి ఈమాన్ కలిగి ఉన్నప్పటికీ వారు చేసే కొన్ని పనులు షర్క్ తో కూడి ఉంటాయి. వాటి వివరణ ఖుర్ఆన్ దృష్టిలో.

షిర్క్ వ్యాధి సోకిన ఈమాన్

1. గౌరవాన్ని ఇతరుల నుండి ఆశించడం: “ఏమిటి వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా?!”[నిసా:139].
2. మంచి కార్యను చెడు కార్యములతో కలిపేయడం: “వారు మిశ్రమమైన కర్మలు చేశారు-కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు!”[తౌబహ్:102].
3. ఇతరులతో కలిసే టప్పుడు వర్గ మరియు సమూహం పట్ల పక్షపాతం కలిగి ఉండడం: “ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది”[మొమినూన్:53].
4. ప్రార్ధన పట్ల అశ్రద్ధత మరియు జనులకు చూపేందుకు చేయడం: "ఆ నమాజీలకు వినాశం తప్పదు('వైల్' అనే నరక స్థానం వారి కొరకు ఉంది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.[మాఊన్:4,5].
5. యుద్ధంలో జనం నుండి భయపడడం: “యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్ కు భయపడవలసిన రోతిలో జనులకు భయపడసాగారు”[నిసా:77].
6. వ్యాపార మరియు ప్రాపంచిక వ్యవహారాలలో ఆదిక్యతను కోరడం, నచ్చడం: “అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది”[తకాసుర్:1].
7. ధర్మం మరియు ప్రపంచం ఎన్నుకొనే విషయంలో ప్రపంచాన్నే ఎన్నుకొని దైవప్రవక్త[స.అ]ను ఒంటరిగా విడవడం: “(జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు”[జుముఅహ్:11].  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11