ఇమామ్ అలీ నఖీ(అ.స) కాలం పరిస్థితులు

సోమ, 02/15/2021 - 15:56

ఇమామ్ అలీ నఖీ(అ.స) కాలం యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఇమామ్ అలీ నఖీ(అ.స) కాలం పరిస్థితులు

దైవప్రవక్త(స.అ) పదవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ ఇబ్నె ముహమ్మద్ అల్ హాదీ(అ.స) 212 హిజ్రీలో సర్యా(మదీనహ్ పట్టణానికి దగ్గర)లో జన్మించారు. వారి తండ్రి హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ జవాదుల్ ఆయిమ్మహ్(అ.స). వారి తల్లి పేరు సమానహ్. వారి పేరు అలీ. వారి బిరుదులు నఖీ, హాదీ, నజీబ్. మరియు వారి కున్నియత్ అబూల్ హసన్.

ఇమామ్ కాలంలో రాజ్యాధికారం పరిస్థితులు:
ఇమామ్ అలీ నఖీ(అ.స) 220హిజ్రీలో ఇమామ్ పదవిని పొందారు. అప్పుడు వారు మదీనహ్ లో ఉన్నారు. ఇమామ్ పదవిని చేప్పటినప్పటి నుండి 13 సంవత్సరాల వరకు అక్కడే ఇమామ్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రజలు వారి నుండి అధ్యాత్మిక పరంగా తమ అజ్ఞానపు ఆకలిని విజ్ఞానంతో నింపుకునే వారు. ఇమామ్ కూడా వారి సమస్యలను తీరుస్తూ ఉండేవారు కాని అహ్లెబైత్ పట్ల శత్రుత్వం కలిగివున్న అప్పటి ఖలీఫా ముతవక్కిల్ ఇమామ్ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమా ప్రతిష్టతలను చూసి వారిని తన కళ్ల ముందు ఉంచుకోవడమే మేలు అని వారిని మదీనహ్ నుండి సామెరహ్ కు ఆహ్వానించాడు. వారు సామెరహ్ వచ్చిన తరువాత చూడడానికి వారు స్వేచ్ఛ కలిగివున్నప్పటికీ ముతవక్కిల్ వారి ఇంటిని నిరంతరం అతడి కళ్ల ముందు ఉండే విధంగా నిశ్చయించాడు. నిరంతరం వారి ఇంటిని తనిఖీ చేయడానికి ఆదేశం ఇచ్చేవాడు. వారి ఇంటికి వచ్చివెళ్ళేవారి పై భటుల ద్వార నిఘా పెట్టించేవాడు.

అతడు ప్రజలను ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు. ముఖ్యంగా షియాల పై ఒత్తిడి వచ్చే ఆదేశాలు జారీ చేసేవాడు. ఆస్థాన కవులను ఎక్కువ ధనమిచ్చి ఇమామ్ అలీ నఖీ(అ.స) గురించి అవమానిస్తూ అవహేళచేస్తూ కవిత్వం చెప్పమని ఆదేశించేవాడు. చాలా మంది ప్రముఖ సాదాత్(దైవప్రవక్త(స.అ) సంతానం)ను కారాగారంలో బంధించేవారు వాడు. అతడు తన అధికారంలో చేసిన అత్యంత భయంకరమైన కార్యాల నుండి హజ్రత్ ఇమామ్ హుసైన్ సమాధిని ధ్వంసం చేయడం. జీవనోపాధి పరంగా అబ్బాసీ ఖులఫా కాలంలో ముఖ్యంగా ముతవక్కిల్ కాలంలో ప్రజల పరిస్థితి అందులో ముఖ్యంగా అలవియాన్ యొక్క పరిస్థితి చాలా దారుణ స్థితికి చేరింది; ఎందుకంటే అబ్బాసీ అధికారులు ముస్లిముల బైతుల్ మాల్(ఇస్లామీయ అధికార ఖజానా)ను తమ సంతోషాల కోసం ఖర్చు పెట్టుకునే వారు. వారి ఖర్చులు అంతకు ముందు చూడని విధంగా ఉండేవి అని చరిత్ర నిదర్శిస్తుంది.

ఇమామ్ అలీ నఖీ(అ.స) చేపట్టిన చర్యలు:
ఇమామ్ హాదీ(అ.స)పై గట్టి నిఘా ఉన్నప్పటికీ వారు మౌనంగా కూర్చుండి పోలేదు తమ కార్యములను అప్పటి పరిస్థితులను బట్టి చేపట్టారు. వారు చేపట్టిన కార్యములలో అతి ముఖ్యమైనది వారు ప్రజలకు వివిధ రకాలుగా ఇమామత్ మరియు విజ్ఞాన స్థాయిని తమ మాటల ద్వార, సభలలో మరియు ప్రశ్నలకు జ్ఞాన పరమైన సమాధానాలతో తెలియపరిచి నమ్మకం కలిగించారు. అలాగే బనీ అబ్బాసుల అధికారం షరా పరమైనది కాదని తెలియపరిచారు. వారు చేసిన మరో కార్యం ప్రజలను ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క అదృశ్య కాలానికి సిద్ధం చేయడం.

ఇమామ్ అలీ నఖీ(అ.స) ఇలాగే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు కాని అహ్లెబైత్(అ.స) పట్ల శత్రుత్వంతో నిండి ఉన్న దుష్టుల హృదయాలు తమ నీఛమైన ప్రభావాన్ని చూపించారు, వారిని సామెరహ్ లో విషం ద్వార చంపబడ్డారు. వారిని వారి ఇంట్లోనే ఖననం చేశారు.[1]

రిఫరెన్స్
పీష్వాయీ, సీరయె పీష్వాయాన్, భాగం2, పేజీ612.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Mashaallah, shukriya for brief the history of Imam a.s

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8