ముతవక్కిల్ మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స]

బుధ, 03/20/2019 - 07:22

ముతవక్కిల్ మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స] ఇద్దరి మధ్య దుబారా ఖర్చు పై జరిగిన సంభాషణ.

ముతవక్కిల్ మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స]

ఒకసారి ఇమామ్ అలీ నఖీ[అ.స], ముతవక్కిల్ దర్బారుకు వెళ్ళారు. అతడి ప్రక్కనే ఉన్న కుర్చీపై కుర్చున్నారు. ముతవక్కిల్ వారి అమామహ్(తలపాగ)ను చాలా ధ్యానంగా చూశాడు. ఆ తలపాగ చాలా ఖరీదైనది. ముతవక్కిల్ ఇలా అన్నాడు: మీరు ఈ అమామహ్ ను ఎంతకు కొన్నారు?.
ఇమామ్: నేను దీన్ని ఐదు వందల వెండి దిర్హములు పెట్టి కొన్నాను.
ముతవక్కిల్: ఐదు వందల దిర్హములతో తలపాగ కొనడం, ఇది దుబారా ఖర్చుకదా.
ఇమామ్: కొన్ని రోజుల ముందు ఒక దాసిని వెయ్యి ఎర్రస్వర్ణపు దీనారులు పెట్టి కొన్నావని విన్నాను?.
ముతవక్కిల్: ఔను, ఇది నిజమే.
ఇమామ్: నేను ఐదు వందల దిర్హముల ఒక గుడ్డను శరీరం యొక్క శ్రేష్ఠమైన భాగం కోసం కొన్నాను, మరి నువ్వూ!. వెయ్యి ఎర్రస్వర్ణపు దీనారుల ఒక దాసిని శరీరం యొక్క అతిఅల్పస్థానం కోసం కొన్నావు. ఇక ఇప్పుడు నువ్వే చెప్పాలి ఎవరు దుబారా ఖర్చు చేశారు అన్నది?.
ముతవక్కిల్ సిగ్గుతో చిన్నబోయాడు.[ముంతహల్ ఆమాల్, భాగం1, పేజీ270]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11