ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: అయితే కాస్త వాళ్లను ఆపండి. వారికి ప్రశ్నలు వేయాల్సివుంది[సూరయె సాఫ్ఫాత్, ఆయత్24], అల్లాహ్ సర్వం తెలిసినవాడైవుండి ఇలా ప్రళయదినాన ప్రశ్నించడం ఎందుకు?
అల్లాహ్ యొక్క జ్ఞానం పట్ల విశ్వాసం కలిగిలేనివారి అవిశ్వాసుల యొక్క సందేహాలలో ఒకటి; ఖుర్ఆన్ లో ప్రళయదినాన ప్రశ్నించబడుతుంది అని ఉంది ఉదాహారణకు وَ قِفُوهُمْ إِنَّهُمْ مَسْؤُلُون “అయితే కాస్త వాళ్లను ఆపండి. వారికి ప్రశ్నలు వేయాల్సివుంది”[సూరయె సాఫ్ఫాత్, ఆయత్24] ఈ అవిశ్వాసుల ప్రశ్నేమిటంటే అల్లాహ్ కు సర్వం తెలియదా! అయితే ప్రళయదినాన ఏమి తెలుసుకోవాలని ప్రశ్నిస్తారు? అల్లాహ్ ప్రశ్నింస్తాడు అనే విషయానికి అర్థమేమిటి?
సమాధానం:
అల్లాహ్ కు సర్వం తెలుసు, అల్లాహ్ యొక్క జ్ఞానం సంపూర్ణమైనది మరియు అది అనంతమైనది అని నమ్మడం ఇస్లాం యొక్క మూల అంశాలలో ఒకటి. ఈ నమ్మకం కొన్ని అల్పమైన ప్రశ్నల ద్వార ఉదాహారణకు మనిషితో అల్లాహ్ ప్రశ్నించడం వల్ల ఆయన జ్ఞానంలో లోపం ఉంది అని అర్థం కాదు; ఎందుకంటే ప్రతీ ప్రశ్న, ప్రశ్నించేవారి అజ్ఞానం పై నిదర్శనం కాదు.
ఒకవేళ అల్లాహ్ తనకు ఎదుటివారి గురించి ఎరుక లేనందుకు ప్రశ్నింస్తే, ఇది అల్లాహ్ లో లోపం ఉంది అని అర్ధం. ఇలా గనక వుంటే అసంపూర్ణమైన అల్లాహ్, స్వయంగా ఉండలేడు. సంపూర్ణత కలిగివున్న ఉనికికి ఎవరి అవసరం ఉండదు అది పూర్వం నుండి ఉనికి కలిగి ఉంటుంది కాని అసంపూర్ణత కలిగి ఉన్నవారికి ఉనికి కోసం ఒకరి అవసరం ఉంటుంది.[1]
తెలుసుకోవడం మరియు తన అజ్ఞానాన్ని దూరం చేసేందుకు ప్రశ్నించేవాడిని అజ్ఞాని అంటారు. అలా అని ప్రతీ ప్రశ్నించేవాడిని అతడు తెలుసుకోవడానికో లేదా అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికో ఇలా చేశాడు అని చెప్పలేము. అల్లాహ్ తన సృష్టి అయిన మనిషిని ప్రశ్నిస్తున్నాడు అంటే, ఈ ప్రశ్న అజ్ఞానంతో కాదు., నిజానికి అది ఆ మనిషి యొక్క తాను చేసినవాటి పట్ల అంగీకారం, వాదన ముగించేందుకు. ఈ పద్ధతి ప్రపంచమంతటా స్వీకరించబడ్డ పద్ధతి.
సాధారణంగా ఈ సమాజంలో ప్రశ్నించడం నిత్యం ఏదో తెలుసుకోవడం కోసమో లేదా అజ్ఞానంతోనో మాత్రమే కాదు, చాలాసార్లు ప్రశ్నించే విషయం చాలా స్పష్టమైనది మరియు తెలిసినదే అయినా ఎదుటివారి సమ్మతాన్ని, అంగీకారాన్ని, లేదా మరో ఏదో కారణంగా ప్రశ్నించడం జరుగుతుంది. మేమందరం సూళ్ళకు వెళ్ళి చదువుకున్నవారమే, ఆ రోజులు ఒక్క సారి గుర్తుతెచ్చుకోండి, ఎన్నోసార్లు గౌరవనీయులైన ఉపాద్యాయులు హోమ్ వర్క్ సరిగా చేయని విద్యార్ధులతో “నిన్న ఇవి వ్రాయమని చెప్పలేదా?” లేదా “ఇంతకు ముందు కూడా వ్రాయకపోతే ఏమిచేశానో గుర్తు లేదా?” మొ.. ఇక్కడ ఉపాద్యాయులు చేసే ప్రశ్నలు తెలుసుకోవడం మరియు అజ్ఞానంతోనా?
ఇంకో ఉదాహారణ; న్యాయాలయంలో న్యాయమూర్తికి అపరాధి పై వేయబడిన నింద గురించి అంతా తెలుసు, అతడి ఏ శిక్ష వేయాలో కూడా అతనికి తెలుసు, అయినా సరే కోర్టులో అపరాధిని పిలిపించి ప్రశ్నించి అతడి అంగీకరణ అతడి నోటితోనే విని శిక్షను వెల్లడిస్తారు, ఇలా చేయడానికి కారణమేమిటంటే చేసిన అపరాధానికి స్వయంగా అంగీకారం వ్యక్తం చేయకపోతే తరువాత అతడు నేను చేయలేదనో లేదా నాపై అన్యాయంగా ఈ నింద మోపారనో చెప్పే అవకాశం ఉంటుంది; ఇదే విధంగా నరకానికి పంపించబడ్డ మనిషి నాకు అన్యాయం జరిగింది అని నిరసన వ్యక్తం చేయకూడదని అల్లాహ్ కూడా మనిషి నుంచి అంగీకారాన్ని తీసుకుంటాడు.
రిఫరెన్స
https://btid.org/fa/news/133229
వ్యాఖ్యానించండి