రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆ భావర్ధాలు

బుధ, 05/05/2021 - 12:53

రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహుమ్మగ్ సిల్ నీ ఫీహి మినజ్ జునూబ్, వ తహ్హిర్ని ఫీహి మినల్ వుయూబ్, వమ్ తహిన్  ఖల్బీ ఫీహి బి తఖ్వల్ ఖులూబ్ యా ముఖీల అసరాతిల్ ముజ్నిబీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నా పాపములను నా నుండి కడిగేయి. లోపముల నుండి నన్ను పవిత్రుడ్ని చేయి. నా హృదయాన్ని ధర్మనిష్ఠగల వారి హృదయాల వలే పరీక్షించు, ఓ పాపాత్ముల తప్పులను చూసీచూడనట్లు ఉండేవాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: పాపముల చెడున కడిగేయడం
రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నా పాపములను నా నుండి కడిగేయి అని వేడుకుంటున్నాము. ప్రశ్నేమిటంటే పాపముల నుంచి ఎలా విముక్తి పొందగలము. ఇస్లామీయ బోధనల ప్రకారం పాపముల నుంచి విముక్తి చెందడానికి అతి ముఖ్యమైన మార్గం అల్లాహ్ సన్నిధిలో ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ చేయడం. ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ అమృతం లాంటివి అవి మనిషి ఆత్మను పవిత్రం చేయడమే కాకుండా మరెన్నో శుభాలను, అనుగ్రహాలను అతడి సొంతం చేస్తాయి.
ఇస్తిగ్ఫార్ మరియు తౌబ్ యొక్క అర్ధం
ఇస్తిగ్ఫార్, క్షమాభిక్షకు నిర్వచనం.[2] ఇస్తిగ్ఫార్ పదం, గఫర(غ ف ر) పదం నుండి తీసుకోబడినది, గఫర అనగా కప్పడం, మూసివేయడం.[3] ఇస్తిగ్ఫార్ ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ ముందు నోటితో లేదా అమలు ద్వార[4] క్షమాపణ[5] పాపములను కప్పిపెట్టమని[6] వేడుకోవడం; మరి ఈ విన్నపం యొక్క లక్ష్యం ఆ పాపముల చెడు ప్రభావముల మరియు అల్లాహ్ శిక్ష నుంచి సురక్షితంగా ఉండడం.
ఇస్తిగ్పార్ ఖుర్ఆన్ మరియు రివాయతుల దృష్టిలో
జీవితంలో ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ యొక్క ప్రాముఖ్యతను ఖుర్ఆన్ యొక్క చాలా ఆయతులు సూచిస్తున్నాయి. అల్లాహ్ కొన్ని ఆయతులలో తన దాసులను స్పష్టంగా తౌబహ్ చేయమని ఆదేశిస్తున్నాడు: ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి-నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్లు ప్రవహించే(స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు.[తహ్రీమ్:8]
నిష్కల్మషమైన పశ్చాత్తాపం నాలుగు షరత్తులు గలదు: 1. హృదయపూర్వకగా పశ్చాత్తాపం, 2. నోటితో ఇస్తిగ్ఫార్, 3. పాపమును విడిచిపెట్టడం మరియు 4. భవిష్యత్తులో మరలా పాపం చేయను అని గట్టి నిర్ణయం.[7]

రెండవ అంశం: లోపముల పట్ల పవిత్రత
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను లోపముల నుండి మమ్మల్ని పవిత్రుడ్ని చేయి అని వేడుకుంటున్నాము.
లోపముల అంగీకరణ విషయం అయితే మనిషి యొక్క లోపాలను లెక్కపెట్టి ఇక్కడ చెప్పడం ఈ శీర్షిక శక్తికి మించిన విషయం. అల్లాహ్ మరియు మనిషి యొక్క సంబంధాన్ని అలాగే అతడి సంబంధాన్ని తన(ఆత్మ)తో మరియు ఇతరులతో బలహీనం మరియు పాడు చేసే ప్రతీ కారణాన్ని మనిషి యొక్క లోపం అని ఇస్లాం బోధిస్తుంది. ఈ విధంగా చెడు లక్షణాలు మరియు పాపములు మనిషి కోసం లోపాలుగా భావించవచ్చు. వీటన్నీంటి నుంచి దూరమై అల్లాహ్ ఆశ్రయాన్ని పొందగము.  

మూడవ అంశాలు: ధర్మనిష్ఠగలవారి హృదయం
రమజాన్ మాసం యొక్క 23వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! మా హృదయాన్ని ధర్మనిష్ఠగల వారి హృదయాల వలే పరీక్షించమని వేడుకుంటున్నాము. ధర్మనిష్ట కలిగివున్నవారు అత్యుత్తమ వ్యక్తులు. ఖుర్ఆన్ మరియు రివాయతులు వారిని గొప్పవారుగా నిర్ధారించడమే కాకుండా వారి ప్రత్యేక లక్షణాలు కూడా సూచిస్తున్నాయి. ఇమామ్ అలీ(అ.స) ఒక ఉపన్యాసంలో ఇలా ఉపదేశించారు: “ధర్మనిష్ఠగలవారు ఈలోకంలో కొన్ని ప్రతిష్టతలు గలరు: వారి మాటలు సత్యమై ఉంటాయి, వారి వస్త్రధారణ సాధరంగా ఉంటుంది, వారి నడకలో అణుకువ ఉంటుంది, అల్లాహ్ చేత హరామ్ గా నిర్ధారించబడినవాటి పట్ల వారి కళ్లు క్రిందికి ఉంటాయి, వారు తన చెవులను మంచి జ్ఞానం కోసం పరిమితం చేస్తారు, వారు కష్టసుఖాలలో ఒకే రకంగా ఉంటారు”[8]

ఓ అల్లాహ్! నీ దయాగుణం మరియు కారుణ్యం ద్వార మనందరి పాపములను క్షమించి మనకు మరో అవకాశాన్ని ప్రసాదించు.

రిఫరెన్స్
1. ఇఖ్బాలుల్ అఅమాల్, భాగం1, పేజీ216
2. షంసుల్ ఉలూమ్, భాగం8, పేజీ4982
3. లిసానుల్ అరబ్, భాగం5, పేజీ26. అన్ నిహాయహ్, భాగం3, పేజీ373.
4. ముఫ్రదాత్, పేజీ609
5. కష్ఫుల్ అస్రార్, భాగం2, పేజీ46
6. అల్ తహ్రీర్ వల్ తన్వీర్, భాగం4, పేజీ92
7. తఫ్సీరె నమూనహ్, భాగం24, పేజీ290
8. నెహ్జుల్ బలాగహ్(సుబ్హీ సాలెహ్), పేజీ303

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13