నా ఉమ్మత్ యొక్క అభిప్రాయబేధం

మంగళ, 06/08/2021 - 17:26

దైవప్రవక్త(స.అ): "నా ఉమ్మత్ యొక్క అభిప్రాయబేధం ఒక రకమైన కృప" ఈ హదాస్ ఆధారంగా షియా మరియు అహ్లెసున్నత్ మధ్య హదీస్ వ్యాఖ్యానం యొక్క తేడా...

నా ఉమ్మత్ యొక్క అభిప్రాయబేధం

షియా మరియు అహ్లె సున్నత్ వర్గాలవారు నమ్మే, ఏ ఒక్క వర్గానికీ ప్రత్యేకించబడని ఒక సరైన హదీసును తీసుకున్నా సరే అందులో షియా మరియు సున్నీయుల మధ్య దాని అర్ధంలో అభిప్రాయబేధం కలదు. ఉదా: హదీస్:“اختلاف امتی رحمه” అనువాదం: “నా ఉమ్మత్ యొక్క అభిప్రాయబేధం(ఒక రకమైన) కృప” అహ్లెసున్నతులు ఈ హదీస్ గురించి ఇలా అంటారు; “ఒక ఇస్లాం ఆదేశంలో అభిప్రాయబేధాలు ఉండడం ముస్లిముల పై కృప అది ఎలా అంటే ఎక్కువ అభిప్రాయాలు ఉంటే ఎవరికి ఏ మాట సరైనది అని అనిపిస్తే దాన్ని ఎంచుకొగలరు. ఒకవేళ ఇమామ్ మాలిక్ ఒక ఫత్వా(ఇస్లాం ధర్మశాస్త్రానుసారమైన తీర్పు) ఒక పనిలో కొంచెం కష్టంగా ఉంటే వ్యక్తి అబూ హనీఫా యొక్క తఖ్లీద్ చేయగలడు(అలాగే హనఫీ ఇమామ్ మాలిక్ యొక్క తఖ్లీద్ చేయగలడు) ఆ వ్యక్తి మాలికీ అయిన సరే”.

కాని షియా ముస్లింలు ఈ హదీసును కొన్ని ఆధారాల పరంగా వేరే విధంగా వివరిస్తారు. వాళ్ళ వద్ద ఒక రివాయత్ ఉంది, ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)తో ఈ హదీసు అర్ధం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: దైవప్రవక్త‎(స.అ) సత్యం పలికారు. అప్పుడు ప్రశ్న అడిగినవాడు ఇలా అన్నాడు: అంటే ఉమ్మత్ యొక్క అభిప్రాయబేధం కృప అయినట్లైతే ఉమ్మత్ యొక్క ఐక్యత శిక్ష మరియు ఆపద అవ్వాలి కదా!. (అప్పుడు) ఇమామ్ ఇలా వివరించారు: దాని అర్ధం నీవు మరియు వేరే వాళ్ళు అనుకున్నట్లు కాదు, దైవప్రవక్త(స.అ) యొక్క ఉద్దేశం “కొందరు మరి కొందరి వద్ద(విద్య నేర్చుకోవడానికి) వెళ్ళడం, ప్రయాణం చేయడం దయా మరియు కృప” అని.(“ఇఖ్తిలాఫ్” అనగా విద్య నేర్చుకోవడానికి చేసే ప్రయాణం).
ఆ తరువాత తాను చెప్పిన మాటకు సాక్ష్యంగా ఈ ఆయత్‌ను ప్రదర్శించారు:
فَلَوۡلَا نَفَرَ مِن كُلِّ فِرۡقَةٖ مِّنۡهُمۡ طَآئِفَةٞ لِّيَتَفَقَّهُواْ فِي ٱلدِّينِ وَلِيُنذِرُواْ قَوۡمَهُمۡ إِذَا رَجَعُوٓاْ إِلَيۡهِمۡ لَعَلَّهُمۡ يَحۡذَرُونَ
అనువాదం: వారి జనసమూహంలోని ప్రతీ భాగం నుండి కొందరు బయలుదేరి వచ్చి, దీన్ జ్ఞానాన్ని పొంది, తిరిగి వెళ్ళి తమ ప్రాంతంలోని ప్రజలకు వారు(ఇస్లాం వ్యతిరేక వైఖరిని) మానుకోవాలని హెచ్చరిక ఎందుకు చేయరు?[సూరయె తౌబహ్, ఆయత్:122] (అనగా ఇస్లాం విద్యాభ్యాసం కొరకు ప్రయాణం చేయాలి, దీనినే హదీసులో “اختلاف امتی رحمه”‌గా గుర్తు చేయబడింది) ఆ తరువాత ఇమామ్ ఇలా ప్రవచించారు: “ఒకవేళ దీన్‌లో అభిప్రాయబేధం సృష్టిస్తే వాళ్ళు షైతాన్ యొక్క ముఠాకు చెందిన వారు అవుతారు”.[1]

ఈ వ్యాఖ్యా, సంతృప్తి పరిచే వ్యాఖ్యా. ఎందుకంటే ఐక్యత వైపు ఆహ్వానిస్తుంది. ఒకే విషయాన్ని ఒక వర్గం తన పరియాలోచన వల్ల హలాల్ అని మరో వర్గం వారు హరామ్ అని ఇంకో వర్గం వారు మక్రూహ్ అని మరో వర్గం మస్తహబ్ అని ఒకరు వాజిబ్[2] అని చెప్పే వివిధ వర్గాలుగా అవ్వకూడదని, విబేధం వైపు ఆహ్వానించదు.

చూడండి, అరబీ భాషలో “اختلفت اليک” మరియు “اختلفت معک” ఈ రెండు వాక్యములలో చాలా తేడా ఉంది. మొదటి వాక్యం యొక్క అర్ధం “నేను మిమ్మల్ని ఉద్దేశించాను” లేదా “నేను మీ వద్దకు వచ్చాను”. మరి రెండవ వాక్యం యొక్క అర్ధం “నాకు మీ అభిప్రాయంతో విభేదం ఉంది”.

అంతే కాకుండా ఈ హదీస్ ను అహ్లెసున్నతుల ప్రకారం వివరించినట్లైతే అది విబేధాల వైపుకు ఆహ్వానిస్తుంది మరి వివిధ అభిప్రాయాల మరియు వర్గాలకు దారితీస్తుంది. ఇది ఖుర్ఆన్ ఆదేశాలకు పూర్తి వ్యతిరేకంగా నిలుస్తుంది. ఎందుకంటే ఖుర్ఆన్ ఐక్యత వైపు ఆహ్వాన్నిస్తుంది. అల్లాహ్ ఇలా ప్రవచించెను: “(ప్రజలారా!) మీ ఈ సంఘం ఒకే సంఘం, నేను మీ ప్రభువును, కనుక మీరు నాకు మాత్రమే భయపడండి”[సూరయె మొమినూన్, ఆయత్:52]
మరో ఆయత్ లో “అంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్:103]
మరో ఆయత్ లో: “పరస్పరం కలహించుకోకండి అలా చేస్తే మీలో బలహీనత ప్రవేశిస్తుంది, మీ శక్తి సన్నగిల్లిపోతుంది”[సూరయె అన్ఫాల్, ఆయత్:46] 
ఈ ఆయతులలో ఐక్యతగా ఉండమని ఆదేశించబడింది.

కొంచెం ఆలోచించండి, ఒకటిగా ఉన్న ఉమ్మత్‌ను ఒకరు మరొకరిని నిరాకరించే, హేళన చేసే, కాఫిర్ అని నిందించే, అంతటితో ఆగకుండా చంపడాన్ని కూడా న్యాయసమ్మతమైనదిగా భావించే వివిధ వర్గాలలో మరియు తెగలలో విభజించడం, ఇంత కన్నా ఎక్కువ విరుధ్ధం మరియు వివాదం ఏముంటుంది!?. చరిత్రే దీనికి పెద్ద సాక్షి, దానితో పాటు అల్లాహ్ వాటి యొక్క చెడు ఫలితాలను కూడా సూచించాడు. మరియు ఒకవేళ మీలో విభేదాలు ఏర్పడితే వాటి పరిణామం చాలా చెడుగా ఉంటుంది అని హెచ్చరించాడు. అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించెను: “స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురిఅయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్:105]
మరో ఆయత్ లో: “తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ముఠాలుగా చీలి పోయిన వారితో నిశ్చయంగా నీకు ఏ సంబంధమూ లేదు”[సూరయె అన్ఆమ్, ఆయత్:159]
మరో ఆయత్ లో: “తమ ధర్మాన్ని వేర్వేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రికులలో కలిసిపోకండి”[సూరయె రూమా, ఆయత్:31,32]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, భాగం23, పేజీ236, హదీస్2.
2. ఉదా: బిస్మిల్లాహ్‌ను నమాజులో ఇమామ్ మాలిక్ మక్రూహ్ అని మరియు ఇమామ్ షాఫెయీ వాజిబ్ అని ఇమామ్ అబూహనీఫా మరియు ఇమామ్ అహ్మద్ ముస్తహబ్ అని అంటారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20