రూయతె ఖుదా

శుక్ర, 06/11/2021 - 09:26

“రూయతే బారి”(అనగా అల్లాహ్, మన కంటికి కనబడతాడు) అనే అంశం పై ఇరువర్గాల వారి నిదర్శనలు...

రూయతె ఖుదా

తెలుసుకోవలసిన విషయమేమిటంటే ముస్లిములందరు అల్లాహ్, ఆయన దూతలపై, గ్రంథాలపై మరియు ప్రవక్తల(అ.స) పై విశ్వాసం కలిగివున్నారు. ఇందులో ఎవ్వరికి ఎటువంటి విబేధం లేదు మరి అలాగే ఎలాగైతే ముస్లిములందరు స్వర్గనరకముల మరియు పునరుత్థాన దినమును నమ్ముతారో అలాగే ప్రవక్తల పట్ల ఎటువంటి విభేదం లేదు. అలాగే ముస్లిములందరు ఒకే ఖుర్ఆన్, ఒకే ఖిబ్లా, ఒకే దీన్ మరియు హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా(స.అ)ను అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ చివరి ప్రవక్త అని నమ్ముతారు, కాని వాళ్ళు విశ్వసించే విధానంలో చాలా విబేధాలు ఉన్నాయి. అవి కలామ్[1], ఫిఖా[2] మరియు సియాసీ[3] యొక్క మద్రసాలలో కనబడతాయి.

షియా మరియు అహ్లెసున్నత్‌ల మధ్య అభిప్రాయబేధం నమూనా

అల్లాహ్‌కు సంబంధించిన విషయాలలో ముఖ్యమైనది “రూయతే బారి”(అనగా అల్లాహ్, మన కంటికి కనబడతాడు) అనే అంశం. అహ్లెసున్నత్‌లు “పరలోకంలో పునరుత్థాన దినమున ప్రతీ మొమిన్‌కు అల్లాహ్ దర్శనం అవుతుంది” అని నమ్ముతారు. అహ్లెసున్నత్ యొక్క సహ్హాహ్(సహీ బుఖారీ, సహీ ముస్లిం మొ॥) గ్రంథాలను చదివితే స్పష్టమౌతుంది “వీళ్ళు అల్లాహ్ దర్శనాన్ని నిజంగానే నమ్ముతారు” అని.[4] మరియు వాటిలో ఆ విశ్వాసాన్ని దృఢ పరిచేటువంటి రివాయతులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ రివాయతులలో అల్లాహ్ యొక్క పోలికలు కూడా వర్ణించి ఉన్నాయి; అల్లాహ్ నవ్వుతాడని[5] వస్తూపోతూ ఉంటాడని, (అటూ ఇటూ) తిరుగుతూ ఉంటాడని, ఆకాశం నుండి భూమికి అవతరిస్తాడని[6] అంతేకాదు అల్లాహ్ తన కాలి పిక్కను తెరుస్తాడు ఆ కాలి పిక్కలో ఉన్న చిహ్నాలతో ఆయనను గుర్తించవచ్చు అని[7] అల్లాహ్, నరకంలో తన కాలు మోపుతాడు దానితో నరకం కడుపు నిండి పోయి ఇక చాలు అంటుంది అని. అల్లాహ్‌కు సంబంధం లేని ఇలాంటి మరెన్నో లక్షణాలను వీళ్ళు అల్లాహ్ కొరకై నిరూపిస్తూ ఉంటారు[8].

వాళ్ళ పుస్తకాలు మరియు ఉపన్యాసాలు ఈ విశ్వాసాలతో కూడి ఉన్నాయి. అహ్లెసున్నత్ యొక్క ఉలమాలలో కొందరు వీటిని నమ్మరు. కాని ఎక్కువ శాతం “రూయతె బారి”(అల్లాహ్ కనబడతాడు) అనే విశ్వాసం కలిగి ఉన్నారు. అల్లాహ్ ప్రళయదినం కనబడతాడని, అల్లాహ్ పౌర్ణమి నాటి చంద్రుని వలే కనిపిస్తాడని మధ్యలో ఎటువంటి అడ్డు ఉండదని, వాళ్ళ ఈ విశ్వాసం పై సాక్ష్యంగా ఈ ఆయత్‌ను ప్రదర్శిస్తారు: وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاضِرَةٌ  إِلَىٰ رَبِّهَا نَاظِرَةٞ

అనువాదం: “ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు‏”[సూరయె ఖియామత్, ఆయత్:22,23]. కాని ఈ విషయంలో షియా ముస్లింలు అహ్లెసున్నత్ తో అభిప్రాయబేధం కలిగివున్నారు. వారు అల్లాహ్ మా కళ్లకు కనిపించడు అని నమ్ముతారు.

హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) యొక్క అల్లాహ్ ఏకేశ్వర సిధ్ధాంతం పట్ల ఒక ప్రస్తావన తిలకించండి:
”لَا يُدْرِكُهُ بُعْدُ الْهِمَمِ وَ لَا يَنَالُهُ‏ غَوْصُ‏ الْفِطَنِ‏ الَّذِي لَيْسَ لِصِفَتِهِ ِ حَدٌّ مَحْدُود و نَعْتٌ مَوْجُودٌ وَ لَا وَقْتٌ‏ مَعْدُود وَ لَا أَجَلٌ مَمْدُود“
అనువాదం: “అల్లాహ్ ను మంచి మంచి గ్రహణ శక్తులు కూడా అందుకోలేవు, మంచి మంచి మేధాశక్తితో మునిగి కూడా అల్లాహ్ యొక్క యదార్ధాన్ని అన్వేషించలేరు, అల్లాహ్ యొక్క వర్ణన అన్ని విధాలుగా అసాధ్యం, అల్లాహ్ కొరకు సమయాన్ని కూడడం అసాధ్యం, ఆయన యొక్క కాలాన్ని బంధించడం మరియు పరిగణించడం అసాధ్యం”.[నెహ్జుల్ బలాగహ్, ఉపసన్యాసం నెం1]

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) “ముషబ్బహ” అనే వర్గానికి ఖండిస్తూ ఇలా ప్రవచించారు: “మేము మా బుద్ధి జ్ఞానములతో ఎంత సూక్ష్మంగా వర్ణించినా సరే అది మా వలే ఒక సృష్టి అవుతుంది అది మా వైపే తిరిగి వస్తుంది”.

అల్లాహ్ కనిపిస్తాడు అన్న విశ్వాసాన్ని రద్దు చేయడానికి స్వయంగా ఖుర్ఆన్ యొక్క ఈ ఆయతులు చాలు:

1. ఆయత్: لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞ
అనువాదం: ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు[సూరయె షూరా, ఆయత్:11]

2. ఆయత్: لَّا تُدۡرِكُهُ ٱلۡأَبۡصَٰرُ
అనువాదం: చూపులు ఆయనను అందుకోలేవు[సూరయె అన్ఆమ్, ఆయత్:103]

ప్రవక్త మూసా(అ.స) రూయత్(అల్లాహ్ దర్శనం) గురించి ప్రశ్నించినపుడు అల్లాహ్ ఇలా ప్రవచించెను:
3. ఆయత్: لَن تَرَىٰنِي
అనువాదం: (అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:) నీవు నన్ను చూడలేవు[సూరయె ఆరాఫ్, ఆయత్:143]

ఇవన్నీ షియా ముస్లింల అభిప్రాయాలు మరియు విశ్వాసాలు సత్యమైనవి అనడానికి సాక్ష్యం. వాళ్ళు ఈ అంశం పై జ్ఞానఖనిజం మరియు దైవప్రవక్త‎(స.అ) యొక్క ఉత్తరాధికారులైన అహ్లెబైత్(అ.స)ల ప్రవచనలు ప్రదర్శిస్తారు.

రిఫరెన్స్
1. మత విశ్వాసాల గురించి సంభాషణలు జరిగే విద్య.
2. ఇస్లాం ఆదేశాలను ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి తెలుసుకొనే విద్య, ఇస్లాం ధర్మశాస్త్రం.
3. దేశపాలనకు సంబంధించిన విద్య.
4. సహీబుఖారీ, భాగం2, పేజీ47, భాగం5, పేజీ 178, భాగం6, పేజీ 33.
5. సహీ బుఖారీ, భాగం4, పేజీ226, భాగం5, పేజీ 47. సహీ ముస్లిం, భాగం1, పేజీ114 మరియు 122.
6. సహీ బుఖారీ, భాగం8, పేజీ 197.
7. సహీ బుఖారీ, భాగం8, పేజీ182.
8. సహీ బుఖారీ, భాగం8, పేజీ187 మరియు 202.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15