.షియా వర్గానికి చెందిన హదీస్ యొక్క మూల గ్రంథాల నుండి ఒకటి అయిన అల్ ఇస్తిబ్సార్ గురించి సంక్షిప్త వివరణ.

“అల్ ఇస్తిబ్సార్” గ్రంథం యొక్క పూర్తి పేరు “అల్ ఇస్తిబ్సార్ ఫీమా ఇఖ్తలఫ మినల్ అఖ్బార్”. దీనిని షైఖ్ తూసీ[ర.అ] రచించారు. ఇందులో ఫిఖాకు సబంధించిన వివిధ టాపిక్లతో కూడి ఉన్న రివాయత్లను ఉల్లేఖించారు అంతేకాదు ఆ రివాయత్లకు వ్యతిరేకంగా ఉన్న వాటిని కూడా ఉల్లేఖించి ఆ రెండింటి మధ్యలో కనిపించే విరుద్ధాన్ని తొలగించారు. ఈ గ్రంథం కూడా షియా హదీస్ మూల గ్రంథాల నుండి ఒకటిగా నిర్ధారించబడింది. ఒక ధర్మవేధి ఫరా అహ్కాములకు సంబంధించి ఫత్వా ఇవ్వాలంటే తప్పకుండా ఈ గ్రంథం యొక్క రివాయత్ లను చూడాలి. ఇస్తిబ్సార్ గ్రంథం షైఖ్ కులైనీ[ర.అ] గ్రంథం “అల్ కాఫీ”, షైఖ్ సదూఖ్[ర.అ] గారి గ్రంథం “అల్ ఫఖీహ్”, మరియు షైఖ్ తూసీ[ర.అ] గారి మొదటి గ్రంథం “తహ్జీబుల్ అహ్కామ్”ల ప్రక్కకు వచ్చి చేరింది.
ఈ గ్రంథంలో ఉన్న హదీసులు తక్కుఎక్కువలకు గురి కాకూడదని షైఖ్ తూసీ[ర.అ] యే ఈ గ్రంథంలో ఎన్ని హదీసులన్నాయి అన్న విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రంథంలో 5511 రివాయత్ లు ఉన్నాయి.
వ్యాఖ్యానించండి