తీజానీ సంభాషణం ఒక వహాబీతో

శని, 06/12/2021 - 14:41

అల్లాహ్ మనవల్లే శరీరభాగాలు కలిగివున్నడు అని నమ్మే ఒక వహాబీ ఆలిమ్ తో జరిగిన సంభాషణం..

తీజానీ సంభాషణం ఒక వహాబీతో

పరిశోధన చేసి షియా గా మారి మరెందరినో రుజుమార్గాన్ని చూపించినటువంటి తీజానీ సమావీ గారు ఒక వహాబీతో జరిగిన సంభాషణను తాను రచించిన ఒక పుస్తకంలో వివరించారు:

“...నాకు ఇప్పుటికీ గుర్తుంది, ఒకసారి నేను ఆఫ్రీకా యొక్క తూర్పు దిశలో ఉన్న కెన్యా యొక్క “లాహూ” అను పట్టణం పైనుండి వెళ్తుండగా, అక్కడ ఒక వహాబీ జమాత్ ఇమామ్‌ను మసీదులో ఉపన్యాసమివ్వడం విన్నాను. అతను ఇలా అంటున్నాడు: “అల్లాహ్‌కు(కూడా) రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక ముఖం ఉన్నాయి” ఇది విని నేను నిరాకరించాను. అందుకు అతను ఖుర్ఆన్ యొక్క ఆయత్‌లను సాక్ష్యంగా ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు: చూడండి స్వయంగా ఖుర్ఆనే ఇలా ప్రవచిస్తున్నది: وَقَالَتِ ٱلۡيَهُودُ يَدُ ٱللَّهِ مَغۡلُولَةٌۚ غُلَّتۡ أَيۡدِيهِمۡ وَلُعِنُواْ بِمَا قَالُواْۘ بَلۡ يَدَاهُ مَبۡسُوطَتَانِ

అనువాదం: యూదులు ఇలా అంటారు: అల్లాహ్ చేతులు బంధింపబడి ఉన్నాయి(అనగా అల్లాహ్ పిసినారి) వాస్తవానికి వాళ్ళ చేతులకే బంధాలు పడి ఉన్నాయి వారి వాగుడుకు శాపం వారిపైనే పడింది (ఎందుకని అల్లాహ్ చేతులు బంధించబడి ఉంటాయి!?) అల్లాహ్ రెండు చేతులు విశాలంగా ఉన్నాయి[సూరయె మాయిదహ్, ఆయత్:64] 

మరో చోట ఇలా ఉంది: وَٱصۡنَعِ ٱلۡفُلۡكَ بِأَعۡيُنِنَا وَوَحۡيِنَا ...

అనువాదం: మా పర్యవేక్షణలో మా ‘వహీ’ కి అను గుణంగా ఒక పడవను తయారు చేయి...[సూరయె హూద్, ఆయత్:37]

మరో చోట:  كُلُّ مَنۡ عَلَيۡهَا فَانٖ وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ
అనువాదం: ఈ పుడమి పై ఉన్న ప్రతీ వస్తువూ నాశనమైపోయేదే. కేవలం మహోన్నతుడూ, మహోపకారీ అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు.[సూరయె రహ్మాన్, ఆయత్:26, 27]
నేను: సోదరా! ఈ ఆయతులు మరి వేరే ఆయతులు అన్ని మజాజీ[1] హఖీఖీ[2] కాదు.
వహాబీ: పూర్తి ఖుర్ఆన్ హఖీఖత్ అందులో మజాజ్ లేదు.
నేను: అయితే ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానం ఎలా చేయగలము.
ఆయత్: وَمَن كَانَ فِي هَٰذِهِۦٓ أَعۡمَىٰ فَهُوَ فِي ٱلۡأٓخِرَةِ أَعۡمَىٰ
అనువాదం: ఈ ప్రపంచంలో అంధుగా ఉన్నవాడు, పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడు(సూరయె ఇస్రా, ఆయత్:72]

అయితే మీరు దీనిని ఈ పదానికి గల అసలు అర్ధాన్నే తీసుకుంటారా? అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ అంధుడు పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడా?.
వహాబీ: మేము, అల్లాహ్ యొక్క చేతులు, కాళ్ళు మరియు ముఖం గురించి చర్చిస్తున్నాము. అంధులతో మాకు సంబంధం లేదు!.

నేను: అంధుల గురించి వదిలేద్దాం, మీరు كُلُّ مَنۡ عَلَيۡهَا فَانٖ وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ గురించి ఏం చెబుతారు?

అక్కడున్న వాళ్ళను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు: మీలో ఈ ఆయత్ అర్ధం కాని వారు ఎవరైనా ఉన్నారా? ఈ ఆయత్ చాలా స్పష్టమైనది ఎలాగైతే అల్లాహ్ యొక్క ఈ ప్రస్తావన స్పష్టమైనదో: ఆయత్: كُلُّ شَيۡءٍ هَالِكٌ إِلَّا وَجۡهَهُ అనువాదం: ఒక్క ఆయన ఉనికి తప్పు ప్రతీదీ నశించేదే[సూరయె ఖసస్, ఆయత్:88]
నేను: నీవు తడిగా ఉన్న మట్టిలో ఇంకా నీళ్ళు కలిపేశావు. సోదరా! మా ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదం ఖుర్ఆన్ గురించి. “మీరు ఖుర్ఆన్‌లో మజాజ్ అర్ధాలు లేవు పూర్తి ఖుర్ఆన్‌లో హఖీఖీ అర్ధాలే ఉన్నాయి”, అని అంటున్నారు. మరి నేను ఖుర్ఆన్‌లో మజాజ్ అర్ధాలు కూడా ఉపయోగించ బడ్డాయి ముఖ్యంగా “అల్లాహ్ యొక్క అవయవాల మరియు పోలిక ప్రస్తావన ఉన్న ఆయతులలో” అని అంటున్నాను. ఇక మీరు మీ మాట పై ఇంత మొండిగా ఉన్నట్లైతే మీకు ఈ ఆయత్ كُلُّ شَيۡءٍ هَالِكٌ إِلَّا وَجۡهَهُ యొక్క అర్ధాన్ని ఇలా అర్ధంచేసుకోవలసి వస్తుంది “అల్లాహ్ యొక్క రెండు చేతులు, రెండు కాళ్ళు అంతేకాదు పూర్తి శరీరం నశించి అయిపోతుంది కేవలం ఆయన ముఖం మాత్రమే మిగిలి వుంటుంది” కాని అల్లాహ్ ఈ విషయాలకు మించిన వాడు.
ఆ తరువాత నేను సభికులను ఉద్దేశించి ఇలా అన్నాను: ఈ వ్యాఖ్యను అంగీకరిస్తారా? ఇది విని అందరు మౌనంగా ఉండిపోయారు. మరి ఆ వహాబీ ఆలిమ్ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తరువాత నేను అతడితో సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను. అతడి రుజుమార్గ దర్శనం కోసం దుఆ చేశాను.

రిఫరెన్స్
1. ఒక పదం యొక్క అసలు అర్ధంలో కాకుండా వేరే అర్ధంలో ఉపయోగించడం.
2. పదాన్ని తన అసలు అర్ధంలోనే ఉపయోగించడం.
3. లెఅకూన మఅస్సాదిఖీన్, తౌహీద్ విశ్వాసం అధ్యాయం.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12