దహ్‌వుల్ అర్జ్

మంగళ, 07/06/2021 - 14:41

దహ్‌వుల్ అర్జ్; భూమి విస్తరణ రోజు గురించి కొన్ని అంశాలు..

దహ్‌వుల్ అర్జ్

జిల్ ఖఅదహ్ మాసం యొక్క 25వ తారీఖు, ఇమామ్ రిజా(అ.స) రివాయత్ ప్రకారం దహ్‌వుల్ అర్జ్ రోజు.[1][2] నిస్సందేహంగా మనిషి ఈ విశ్వం యొక్క క్రమాన్ని మరియు అద్భుతాలను సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే, రోజురోజుకి ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటాము. ఈ ఆశ్చర్యం సృష్టికర్త పట్ల ప్రేమను పెంచుతుంది. సృష్టికర్త గురించి తెలుసుకోవాలనే ఆశను పెంచుతుంది. విశ్వంలో ఉన్న ఎన్నో అద్భుతాలలో ఒకటి “దహ్‌వుల్ అర్జ్; భూమి విస్తరణ రోజు”.[3]

దహ్‌వుల్ అర్జ్ రోజు అంటే?
“దహ్‌వుల్ అర్జ్” నీటి నుంచి మెల్లమెల్లగా భూమి బయటకు వచ్చి విర్తరించ మొదలయిన విషయాన్ని సూచిస్తుంది.[4] ఎందుకంటే మొదట్లో భూమండలం నీటితో నిండి ఉండేది, మెల్లమెల్లగా నీరు భూమి యొక్క గొతుల్లో జారుకుంది, భూమి బయటకు వచ్చి విస్తరించింది, దీనినే “దహ్‌వుల్ అర్జ్” అంటారు.[5]

దహ్‌వుల్ అర్జ్ ఖుర్ఆన్ దృష్టిలో
అల్లాహ్ “దహ్ఉల్ అర్జ్” గురించి పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ లో వివరించెను: “తరువాత భూమిని విస్తరించాడు”[సూరయె నాజిఆత్, ఆయత్:30]. ఈ ఆయత్ ను అల్లామా తబతబాయి[ర.అ] ఇలా వ్యాఖ్యానించారు: ఈ ఆయత్ యొక్క అర్ధం; ఆకాశాన్ని పైకప్పుగా చేసిన తరువాత, ప్రతీ చిన్నదానిని తమతమ స్థానంలో నిర్ధారించిన తరువాత, దాని రాత్రిని చీకటిగా మరియు పగలును వెలుతురుగా నిశ్చయించిన తరువాత భూమిని విస్తరించాడు, అని.[6].
మరి కొందరు ఇలా వ్యాఖ్యానించారు: మరో ఆయత్ లో ఇలా ఉంది: “ఇంకా మేము భూమిని వ్యాపించాము(విస్తరించాము), దానిపై పర్వాతాలను పాతి పెట్టాము”[సూరయె హిజ్ర్, ఆయత్:19]. ఈ ఆయత్ లో వచ్చిన «مد» పదం నుండి కూడా వ్యాపించడం, విస్తరించడం, లాగటం అనే అర్ధాలే వస్తాయి అని ఉలమాలు చెబుతున్నారు.

దహ్‌వుల్ అర్జ్; కాబా నుంచి భూమి విస్తరణ
మొదట్లో వరదనీళ్లతో భూమండలం నీళ్ళతో కప్పబడి ఉండేది, నీళ్లు మెల్లమెల్లగా లోతుగా ఉన్న భూభాగాలలో జారుకున్న తరువాత భూమి మెల్ల మెల్లగా నీళ్ల నుంచి బయటకు కనబడడం మొదలయ్యింది, ఇస్లామీయ రివాయతల ప్రకారం నీళ్ల నుంచి బయటకు కనబడిన మొట్ట మొదటి భూమి కాబా భూమి[7]

దహ్‌వుల్ అర్జ్ ప్రతిష్టత
దహ్‌వుల్ అర్జ్ రోజు ప్రతిష్టత గురించి పవిత్ర మాసూములు వివరించారు. అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇలా ఉల్లేఖించెను: “నింగి నుండి మొట్టమొదటి దయానుగ్రహం అవతరించబడిన రోజు జిల్ ఖఅదహ్ యొక్క 25వ తేది; అందుకని ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉంటారో మరియు ఆ రాత్రి ప్రార్థనలు చేస్తారో, వారికి వందేళ ప్రార్ధన పుణ్యం ప్రసాదించబడుతుంది”
మరి అలాగే మరోచోట వారు ఇలా సెలవిచ్చారు: “ఆ రోజు, ఒక సమూహం అల్లాహ్ ను స్మరిస్తే, ఆ సమూహ సభ్యులు వేరుకాక ముందే అల్లాహ్ వారి కోరికలను మన్నిస్తాడు; అల్లాహ్ ఈ రోజున వేల సంఖ్యలో దయానుగ్రహాలను అవతరింపజేస్తాడు, కలిసికట్టుగా అల్లాహ్ ను స్మరించే, ఉపవాసం ఉండేవారు మరియు రాత్రి ప్రార్ధనలు నిర్వర్తించే వారు ఆ దయానుగ్రహాల భాగ్యాన్ని పొందుతారు”[8].

దహ్‌వుల్ అర్జ్ రోజు చేయవలసిన ఆథ్యాత్మికచర్యలు
సంవత్సరం పొడుగున ఉపవాసం ఉండడం శ్రేష్ఠమైన నాలుగు రోజులలో నుండి ఒకరోజు ఈ రోజు. ఆ రోజు ఉపవాసం, కలిసికట్టుగా అల్లాహ్ స్మరణ మరియు గుస్ల్ స్నానం తరువాతం రెండు ముఖ్యమైన చర్యలు ఉన్నాయి అవి:
మొదటిది: షియా హదీస్ గ్రంథాల ప్రకారం ఉదయం పూట(సూర్యుడు ఉదయించిన కొద్ది చేపు తరువాత) రెండు రకాతుల నమాజ్ చదవాలి. రెండు రక్అత్లలో కూడా అల్ హందు సూరహ్ చదివిన తరువాత ఐదు సార్లు షంమ్స్ సూరహ్ ను పఠించాలి. నమాజ్ పూర్తయిన తరువాత ఇలా చదివి లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీయ్యిల్ అజీమ్ అని చెప్పి దుఆ చేయాలి. ఆ తరువాత ఈ దుఆ ను చదవాలి: యా ముఖీలల్ అసరాతి అఖిల్నీ అస్రతీ, యా ముజీబద్దఅవాతి అజిబ్ దఅవతీ, యా సామిఅల్ అస్వాతి ఇస్మఅ సౌతీ, వర్ హమ్నీ వ తజావజ్ అన్ సయ్యిఆతీ వమా ఇందీ యా జల్ జలాలి వల్ ఇక్రామ్.
రెండవది: ఈ దుఆ: అల్లాహ్ హుమ్మ దాహియల్ కఅబహతి వ ఫాలిఖల్ హబ్బతి వ...[9].

రిఫరెన్స్
1. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం11, పేజీ217, హదీస్29.
2. కుల్లియాతె మఫాతీహె నవీన్, పేజీ829.
3. పయామె ఇమామె అమీరుల్ మొమినీన్(అ.స), భాగం6, పేజీ219.
4. పయామె ఇమామె అమీరుల్ మొమినీన్(అ.స), భాగం3, పేజీ177.
5. మకారిమ్ షీరాజీ, లుగాత్ దర్ తఫ్సీరె నమూనహ్, పేజీ354.
6. తర్జుమా అల్ మీజాన్, భాగం20, పేజీ308.
7. మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, భాగం5, పేజీ345.
8. మకారిమ్ షీరాజీ, కుల్లియాతె మఫాతీహె నవీన్, పేజీ831.
9. షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, పేజీ437.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16