మూర్ఖత్వపు నవ్వు!

శని, 01/13/2018 - 19:44

మృత్యువు అనేది వాస్తవం దానిని మరచి మూర్ఖత్వంగా జీవించటం విశ్వాసుల లక్షణం కాదు. 

మూర్ఖత్వపు నవ్వు!

ఇమాం అలీ(అ.స)ల వారు ఒక జనాజా వెంబడి వెళుతుండగా ఒక వ్యక్తి బిగ్గరగా నవ్వటాన్ని గమనించి ఈ విధంగా సెలవిచ్చారు: "(వీరి ప్రవర్తన ఏ విధంగా ఉందంటే) బహుశా ఈ మృత్యువు వేరే వారికి రాసిపెట్టి ఉన్నది మరియు (చనిపోయిన)వారి యొక్క హక్కులు మనపై తప్ప అందరిపై రాసి ఉన్నాయి, ఏ చనిపోయేవాళ్ళనైతే మేము చూస్తున్నామో వారు బాటసారులు(పరలోకపు) వారికి తిరిగి పయనమవ్వవలసి ఉన్నది, మొదట వారిని మనము ఈ నేలలో పూడ్చివేస్తాము పిదప వారి యొక్క ఆస్తులను తినటం మొదలుపెడతాము ఏ విధంగానటే మనము ఈ భూమిపై శాశ్వతంగా ఉండేవారము,దాని తర్వాత మనము ఉపదేశించే ప్రతీ వారిని మరచి ఆపదల మరియు విపత్తుల బారిన పడి ఉన్నాము".
ఈ ఉపదేశంలో ఇమాం(అ.స)ల వారు చెప్పదలచిన దేమిటంటే ఈ మానవుడు ఎంత నిర్లక్ష్యంగా ఈ జీవితాన్ని గడుపుతున్నాడు మరియు తన కర్తవ్యాలను మరచి మూర్ఖత్వంగా నవ్వుతున్నాడు ముఖ్యంగా ఈ ప్రవచనంలో మూడు మాటలు గమనించదగినవి:
1. రేపు నీవు కూడ చనిపోయినప్పుడు నీ జనాజాపై ఎవరైన నవ్వితే అది నీకు ఇష్టమేనా?
2. హక్కులు మొత్తం మిగిలిన వారిపైనే రాసి ఉన్నాయా? నీ పై ఏ హక్కులు రాయబడలేదా??మరియు నీవు నీ కర్తవ్యాలను పూర్తిగా నిర్వర్తించకుండా ఈ విధంగా వెక్కిలించటం సమంజసమా?
3. ఈ వీడ్కోలు పలకడం ఎమన్నా ఈ లోకంలో అతిధులను వీడ్కోలు పలకటం అనుకున్నావా,అతడు ఒక పరలోకపు బాటసారి అని తన ఉన్నవారిని శాస్వతంగా వదిలి పరలోకం వైపు పయనిస్తున్నాడని మరిచావా?దీనిని గమనించకుండా ఒక మూర్ఖుడిలా నవ్వటం న్యాయమా?

రిఫరెన్స్
నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:122.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24