ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) విద్వాంసుల మాటల్లో

ఆది, 08/22/2021 - 15:46

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ప్రతిష్టత గురించి అహ్లె సున్నత్ వర్గనాయకుల మాటలు..

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) విద్వాంసుల మాటల్లో

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ప్రపంచ విద్వాంసుల దృష్టిలో
హనఫీ వర్గనాయకుడు, అబూహనీఫహ్  
రెండు సంవత్సరాలు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) శిష్యరికం చేసిన అబూహనీఫా నిత్యం ఇలా చెబుతూ ఉండేవారు.. ఒకవేళ ఆ రెండు సంవత్సరాల శిష్యరికం లేకపోయి ఉంటే నేను నాశనం అయ్యేవాడ్ని జాఫర్ ఇబ్నె ముహమ్మద్ కు మించినా జ్ఞానినీ, ఫఖీహ్ ను చూడలేదు. వారు ఈ ఉమ్మత్ యొక్క ఉత్తమ జ్ఞాని

మాలికీ వర్గనాయకుడు, మాలిక్
మాలిక్ ఇలా ఉల్లేఖించెను: “జాఫర్ ఇబ్నె ముహమ్మద్ కు మించిన ప్రతిష్టత గల వ్యక్తిని ఏ కళ్లూ చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ హృదయం గ్రహించలేదు; అది వారి ప్రతిష్టతల విషయంలో కానివ్వండీ, జ్ఞానపరంగా కానివ్వండీ, ఆరాధన పరంగా కానివ్వండీ మరియ పవిత్రత పరంగా కానివ్వండీ. వారి హదీసును ఉల్లేఖించేవారు, ఎదుటివారికి ఉపయోగపడే విధంగా మంచిగా సంభాషించేవారు. అల్లాహ్ సాక్షిగా ఏది మాట్లాడినా సత్యమే అయ్యి ఉండేది”

మొహమ్మద్ ఇబ్నె తల్హా షాఫెయీ
అహ్లె సున్నత్ వర్గానికి చెందిన గొప్ప ఆలిమ్ అయిన హమ్మద్ ఇబ్నె తల్హా షాఫెయీ ఉల్లేఖనం: ఇమామ్ జాఫరె సాదిఖ్ అహ్లెబైత్ యొక్క గొప్పవారిలో ఒకరు; అతను చాలా విద్యలు తెలిసివున్నవారు, నిజమైన ఆరాధన, నిత్యం అల్లాహ్ స్మరణ చేయువారు మరియు ఖుర్ఆన్ కరీమ్ ను ఎక్కువగా పఠించేవారు. వారు నిత్యం ఖుర్ఆన్ భావాల గురించి వివరిస్తూ ఉండేవారు, వాటి నుండి ముత్యాలాంటి అంశాలను సూచించేవారు, అందులో ఉన్న అద్భుతాలను బోధించేవారు. వారు పరిశీలనకు వీలుగా ఉండేందుకు తమ సమయాన్ని వివిధ ఆరాధనల కొరకు కేటాయించి ఉంచేవారు. వారిని చూస్తే మనిషికి పరలోకం గుర్తుకొచ్చేది, మనసులను దోచుకునే వారి మాటలు హృదయం నుండి ప్రపంచాన్ని లాగిపడేసేది, వారి అనుచరణ మనిషిని స్వర్గ వారుసులుగా చేస్తుంది. వారి కనుల కాంతి వారు దైవప్రవక్త(స.అ) వారసులు అని నిదర్శించేది.

ఇబ్నె సబ్బాగె మాలికీ
అహ్లె సున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఇబ్నె సబ్బాగె మాలికీ ఉల్లేఖనం: జాఫరె సాదిఖ్ వారి సోదరులందరిలో వారి తండ్రి యొక్క ఉత్తరాధికారి మరియు వారి తరువాత ఇమామ్ గా నిర్దారించబడినవారు. ఇతరుల పై ఉత్తమ ప్రతిష్టతగలవారు. గొప్ప స్థానం, పేరు కలిగివున్నవారు. ప్రజలు వారి నుండి జ్ఞానాన్ని ఉల్లేఖించేవారు. విద్వాంసులు, జ్ఞానులు వారి నుండి హదీసులను ఉల్లేఖించినంతగా అహ్లెబైత్ కు చెందిన ఏ ఒక్కరి నుండి ఉల్లేఖించలేదు అని ప్రజలు భావించేవారు.

ఇబ్నె హబ్బాన్
అహ్లె సున్నత్ కు చెందిన ప్రముఖ ఆలిమ్ ఇమామ్ సాదిఖ్(అ.స) గురించి ఇలా అనెను: జాఫర్ ఇబ్నె ముహమ్మద్ కు మించిన ఫఖీహ్ ను చూడలేదు; వారు అహ్లెబైత్ కు చెందిన వారు. మేము వారి ఉల్లేఖనలు అవసరంగా భావించేవారం.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స),  ఇచ్చే ఉపన్యాస సభలకు మరియు విద్యాలయానికి, ఎవరైతే తరువాత ఫిఖా వర్గాలకు ఇమాములయ్యారో వారే కాకుండా ఫిలాసఫర్స్ మరియు ఫిలాసఫీ నేర్చుకోవాలనుకున్న విద్యార్ధులు వివిధ దూరపు పట్టణాల నుండి వచ్చేవారు. బస్రా పట్టణంలో ఫిలాసఫీ పాఠశాలను స్థాపించిన “హసనె బసరీ”, “మోతజిలహ్” వర్గాన్ని స్థాపించిన “వాసిల్ ఇబ్నె అతా” మొదలగు వారందరూ కూడా ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క శిష్యులే, వీరందరు ఆ జ్ఞానసముద్రం నుండి జ్ఞాన ఆణిముత్యాలు పొందినవారే.
అహ్లెసున్నత్ యొక్క ప్రముఖ విద్వాంసులలో ఒకరైన “అబూ బహ్రె జాహిజ్” ఇలా అన్నారు: ప్రపంచాన్ని తన జ్ఞానంతో నింపేసినవారే జాఫర్ ఇబ్నె ముహమ్మద్[అ.స]. అబూ హనీఫా మరి అలాగే సుఫ్యానె సూరీ వారి శిష్యులు అంటారు, మరి ఈ ఇద్దరి శిష్యరికంతోనే వారి(ఇమామ్ జాఫరె సాదిఖ్) యొక్క జ్ఞాన ప్రతిష్టత నిదర్శనానికి చాలు.[1]

రిఫరెన్స్
[1] మహ్దీ పీష్వాయీ, సీమాయే పీష్వాయాన్, పేజీ97-101.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13