అహ్లెబైత్(అ.స) పవిత్రులు హదీస్ దృష్టిలో

ఆది, 10/10/2021 - 17:19

దైవప్రవక్త(స.అ) తన అహ్లెబైత్(అ.స)ల పవిత్రలను మరియు వారి నుంచి ఎటువంటి తప్పు జరగదు అని నిదర్శిస్తూ ఉల్లేఖించిన కొన్ని హదీసుల సంక్షిప్త వివరణ...

అహ్లెబైత్(అ.స) పవిత్రులు హదీస్ దృష్టిలో

మొదటి హదీస్:
”يَا أَيُّهَا النَّاسُ‏ إِنِّي‏ تَارِكٌ‏ فِيكُمُ‏ مَا إِنْ‏ أَخَذْتُمْ‏ بِهِ‏ لَنْ‏ تَضِلُّوا كِتَابَ‏ اللَّهِ‏ وَ عِتْرَتِي‏ أَهْلَ‏ بَيْتِي “‏
అనువాదం: “ప్రజలారా! నేను మీ మధ్య రెండింటిని వదిలి వెళ్తున్నాను ఒకవేళ మీరు వాటి పై అమలు చేసినట్లైతే రుజుమార్గం తప్పరు(మరి అవి) ఖుర్ఆన్ మరియు నా ఇత్రత్”.[1]
ఈ హదీస్ స్పష్టంగా ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)ల పవిత్రతను నిరూపిస్తుంది, ఎందుకంటే ఖుర్ఆన్ పవిత్రమైనది దాని దగ్గరకు అసత్యం చేరలేదు. మరియు అహ్లెబైత్(అ.స)లు ఖుర్ఆన్‌తో సమానులు. అందుకని వీళ్ళు కూడా పవిత్రులే అవుతారు. రెండవ మాట ఏమిటంటే ఖుర్ఆన్ మరియు ఇత్రత్‌ను ఆశ్రయించినవాడు రుజుమార్గం నుండి తప్పలేడు. అల్లాహ్ గ్రంథం మరియు ఇత్రత్ రెండూ పవిత్రమైనవే ఎందుకంటే వాటిని పట్టుకొని ఉండడం రుజుమార్గం నుండి తప్పకుండా ఉండడానికి కారణం అవుతుంది, అని ఈ హదీస్ మనకు తెలియపరుస్తుంది. అందువల్ల అవి అన్నీంటిని మించి పవిత్రమై ఉంటాయి.

రెండవ హదీస్:
”إِنَّمَا مَثَلُ‏ أَهْلِ‏ بَيْتِي‏ كَمَثَلِ‏ سَفِينَةِ نُوحٍ‏ مَنْ‏ رَكِبَهَا نَجَا وَ مَنْ‏ تَخَلَّفَ‏ عَنْهَا غَرِق “‏
అనువాదం: “మీ మధ్య మా అహ్లెబైత్(అ.స)లు నూహ్ నౌక లాంటివారు ఎవరైతే దాని పై ఎక్కారో వారు విముక్తులైయ్యారు మరియు ఎవరైతే దాని నుండి దూరంగా ఉండిపోయారో వారు మునిగిపోతారు”.[2]
ఈ హదీస్ కూడా స్పష్టంగా “ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు పవిత్రులు” అని నిరూపిస్తుంది. అందుకనే ఎవరైతే వారి నౌకపై ఎక్కుతారో వారికి విముక్తి మరియు ఎవరైతే ఎక్కరో వారు రుజుమార్గం నుండి తప్పుతారు.

మూడవ హదీస్:
”مَنْ‏ أَحَبَ‏ أَنْ‏ يَحْيَا حَيَاتِي‏ وَ يَمُوتَ‏ مَمَاتِي‏ وَ يَدْخُلَ‏ الجَنَّةَ الَّتِي‏ وَعَدَنِي‏ رَبِّي‏ وَ هِيَ‏ جَنَّةُ الْخُلْدِ فَلْيَتَوَلَ‏ عَلِيّاً وَ ذُرِّيَّتَهُ مِنْ بَعْدِهِ فَإِنَّهُمْ لَنْ يُخْرِجُوکُم بَابِ هُدًى وَ لَنْ يُدْخِلُوکُم بَابِ ضَلَاله “
అనువాదం: ‎“‎ఎవరికైతే నా వలే జీవితం, నా వలే మరణం, నా అల్లాహ్ నాకు వాగ్ధానం ఇచ్చిన ఆ ‘స్వర్గం’లో వెళ్ళాలని ఇష్టపడుతున్నాడో అతడు అలీ(అ.స) మరియు అతని తరువాత అతని సంతానాన్ని ఇష్టపడాలి ఎందుకంటే వీళ్ళు నిన్ను హిదాయత్ ద్వారం నుండి దూరం చేయరు. మరియు మార్గభ్రష్టతకు గురి కానివ్వరు”.[3]
ఈ హదీస్ కూడా స్పష్టంగా ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స) –హజ్రత్ అలీ(అ.స) మరియు అతని పవిత్ర సంతానం– అపరాధం మరియు పాపముల నుండి పవిత్రులు, అని నిరూపిస్తుంది. ఎందుకంటే వీరు వీళ్ళను నమ్మే వాళ్ళను ఎప్పుడు కూడా మార్గభ్రష్టులు కానివ్వరు. “తప్పు చేయగలడు అన్నవాడు మానవులకు హిదాయత్ చేయలేడు” అన్న విషయం తెలిసిందే.

నాలుగొవ హదీస్:
”أَنَا الْمُنْذِرُ، وَ عَلِيٌ‏ الْهَادِي‏ وَ بِكَ‏ يَا عَلِيُّ يَهْتَدِي الْمُهْتَدُونَ مِن بَعْدِي   “
అనువాదం‎:‎ “నేను భయపెట్టు వాడిని మరియు అలీ(అ.స) హిదాయత్ చేయు వారు. ఓ అలీ(అ.స)! నా తరువాత హిదాయత్ పొందాలని అనుకుంటున్న వారు నీ నుండే హిదాయత్ పొందుతారు”.[4]
ఈ హదీస్ ఇమామ్ యొక్క పవిత్రతను నిరూపిస్తుంది. అంతే కాకుండా స్వయంగా హజ్రత్ అలీ(అ.స) తన కోసం మరియు తమ తరువాత ఇమాముల కోసం ఇస్మత్‌ను నిరూపించారు. ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు:
”فَأَيْنَ‏ تَذْهَبُونَ‏ وَ أَنَّى‏ تُؤْفَكُونَ‏ وَ الْأَعْلَامُ قَائِمَةٌ وَ الْآيَاتُ وَاضِحَةٌ وَ الْمَنَارُ مَنْصُوبَةٌ فَأَيْنَ يُتَاهُ بِكُمْ وَ كَيْفَ تَعْمَهُونَ‏ وَ بَيْنَكُمْ عِتْرَةُ نَبِيِّكُمْ وَ هُمْ أَزِمَّةُ الْحَقِّ وَ أَعْلَامُ الدِّينِ وَ أَلْسِنَةُ الصِّدْقِ فَأَنْزِلُوهُمْ بِأَحْسَنِ مَنَازِلِ الْقُرْآنِ وَ رِدُوهُمْ وُرُودَ الْهِيمِ الْعِطَاشِ أَيُّهَا النَّاسُ خُذُوهَا عَنْ خَاتَمِ النَّبِيِّينَ ص إِنَّهُ يَمُوتُ مَنْ مَاتَ مِنَّا وَ لَيْسَ بِمَيِّتٍ وَ يَبْلَى مَنْ بَلِيَ مِنَّا وَ لَيْسَ بِبَالٍ فَلَا تَقُولُوا بِمَا لَا تَعْرِفُونَ فَإِنَّ أَكْثَرَ الْحَقِّ فِيمَا تُنْكِرُونَ وَ اعْذِرُوا مَنْ لَا حُجَّةَ لَكُمْ عَلَيْهِ وَ هُوَ أَنَا أَ لَمْ أَعْمَلْ فِيكُمْ بِالثَّقَلِ الْأَكْبَرِ وَ أَتْرُكْ فِيكُمُ الثَّقَلَ الْأَصْغَرَ قَدْ رَكَزْتُ فِيكُمْ رَايَةَ الْإِيمَان “
అనువాదం: ఎటు పయనిస్తున్నావు? ఎక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నావు? చూస్తే హిదాయత్ జెండా ఎత్తి ఉంది గుర్తులు చాలా స్పష్టంగా ఉన్నాయి, హిదాయత్ యొక్క స్ధంభం స్థాపించబడి ఉంది అయితే నిన్ను ఎక్కడ దారితప్పిస్తున్నారు? నీ ప్రవక్త యొక్క ఇత్రత్ మీలో ఉండగా నీవు గుడ్డివాడివి ఎందుకు అయ్యావు. (విను) ప్రవక్త ఇత్రతే సత్యవంతులు, దీన్ యొక్క జెండా, సత్యానికి ముఖద్వారము, ఖుర్ఆన్ అవతరించడానికి మంచి మరియు అనువైన స్థానం వాళ్ళే అని భావించు, మిక్కిలి దాహంతో అల్లాడుతున్న జంతువుల వలే వాళ్ళ వద్దకు (దీన్ జ్ఞానాన్ని పొందడానికి) పరుగులు తీసుకుంటూ రా. ప్రజలారా! మీ దైవప్రవక్త(స.అ) మాట నమ్మండి: మాలో నుండి మరణించినవారు మరణించరు, మాలో నీవు ఎవరినైతే పాత అని అనుకుంటావో వారు పాత కారు. నీవు తెలియనిది చెప్పకు. సాధారణంగా మీకు నచ్చనిదే యదార్ధం అయ్యి ఉంటుంది. ఎవరికి వ్యతిరేకంగా మీ వద్ద ఎటువంటి సాక్ష్యం లేదో (మరియు ఆ వ్యక్తిని నేనే) అతడిని నిస్సాయులుగా భావించు. నేను మీ మధ్య “సిఖ్లె అక్బర్”[5] పై అమలు చేయలేదా? మరియు మీలో సిఖ్లె అస్గర్”[6] ను వదల లేదా, మీ కోసం ఈమాన్ యొక్క జెండాను స్థాపించలేదా?”.[7]

ఖుర్ఆన్, సున్నత్ మరియు హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రవచనాలు. ఇవన్నీ ఇమాముల యొక్క పవిత్రతను నిరూపిస్తున్నాయి. ఆ తరువాత కూడా “ఎవరినైతే అల్లాహ్ హిదాయత్ కోసం ఎన్నుకున్నాడో అతను పవిత్రుడు అయి ఉండాలి” అని బుద్ధి అంగీకరించడం లేదా!?. ‎“‎తప్పకుండా బుద్ధి దానిని అంగీకరిస్తుంది మరియు ఇలాంటి వాళ్ళు పవిత్రులై ఉండడం అవశ్యకం” అని అంటుంది. ఎందుకంటే ఎవరికైతే నాయకత్వం మరియు మానవత్వ హిదాయత్ యొక్క బాధ్యతను ఇవ్వడం జరుగుతుందో అతడు సాధారణ మనిషి వలే అడుగు అడుగునా తడబడూతూ, తెలిసీ తెలియక తప్పులు చేస్తూ, అతని పై తప్పుల భారం ఎక్కువై మరియు ప్రజలు అతడిని అభ్యంతరిస్తూ అతడి లోపములను చెబుతూ ఉండడం అసాధ్యం. దానికి వ్యతిరేకంగా సరళ బుద్ధి తీర్మానం ఏమిటంటే; ఇలాంటి మనిషి తన కాలంలో అందరిలో జ్ఞాని, అందరి కన్న శక్తిశాలి, ధర్మనిష్ఠ గలవాడు అవ్వడం అవసరం. ఈ గుణాలతో నాయకుడి ప్రతిష్టత నాలుగింతలు పెరుగుతుంది, ప్రజల దృష్టిలో అతడి గౌరవం పెరుగుతుంది, ప్రపంచం అతడిని గౌరవిస్తుంది. మరి దానికి ప్రతి ఫలంగా ప్రజలు ఎటువంటి ఒత్తిడి మరియు ఇచ్చకములు లేకుండా అతడి ఆజ్ఞను పాటిస్తారు.

రిఫరెన్స్
1. తిర్మిజీ, భాగం5, పేజీ328. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148. ముస్నదె ఇమామ్ అహ్మద్ హంబల్, భాగం5, పేజీ 189.
2. ముస్తద్రికుల్ హాకిం, భాగం2, పేజీ343. కన్జుల్ ఉమ్మాల్,భాగం5, పేజీ95. సవాయిఖుల్ మొహ్రిఖహ్, పేజీ184.
3. కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ155. మజ్మవుజ్జవాయిద్, భాగం9, పేజీ108. ఇసాబహ్ ఇబ్నె హజర్. జామిఆ కబీర్ తబరాని. తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ99. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ128. హిల్యతుల్ ఔలియా, భాగం4, పేజీ349. అహ్ఖాఖుల్ హఖ్ఖ్, భాగం5, పేజీ108.
4. తఫ్సీరె తబరీ, భాగం13, పేజీ108. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం2, పేజీ502. తఫ్సీరె షౌకాని, భాగం3, పేజీ 70. దుర్రె మన్సూర్, భాగం4, పేజీ 45. నూరుల్ అబ్సార్, పేజీ71. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ 129. తఫ్సీరె ఇబ్నె జౌజి, భాగం4, పేజీ307. షవాహిదత్తన్జీల్, భాగం1, పేజీ 293. అల్ ఫుసూలుల్ ముహిమ్మహ్. యనాబీవుల్ మవద్దహ్.
5. ఖుర్ఆన్.
6. అహ్లెబైత్(అ.స).
7. నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ155.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16