మస్జిద్

మంగళ, 11/02/2021 - 16:33

మస్జిద్ గురించి మరియు దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న ఆయత్లు మరియు హదీసులు మరియు దానికి సంబంధిచి ప్రశ్నించబడే ప్రశ్నల సంక్షిప్త వివరణ... 

మస్జిద్

ముస్లిములు ప్రార్థన చేసుకొనే స్థలాన్ని మస్జిద్ అంటారు. ఇస్లాం ధర్మం ప్రజలను మసీదులలో ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇస్లాం ప్రజలను మస్జిద్‌లను నిర్మించడానికీ ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ముహమ్మద్(స.అ) ఇలా అన్నారు, “ఎవరైతే ఒక మసీదుని నిర్మిస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించనున్నాడు”
మస్జిద్‌లు ముస్లిముల జీవితంలో కీలకపాత్రను పోషిస్తాయి; రోజూ ఐదు పూటల నమాజ్ మరియు శుక్రవారం మధ్యాహ్నం చేసే నమాజ్ “నమాజె జుమా” జరుపుకుంటారు. మస్జిద్‌లను పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు. అంతేకాకుండా, మసీదులు అమ్మకూడదు లేదా అపవిత్రం చేయకూడదు. ఖురాన్ ఇలా చెబుతోంది: “అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్ ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్ కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని అశించవచ్చు”[సూరయె తౌబహ్, ఆయత్18].
ప్రవక్త ముహమ్మద్(స.అ) నిర్మించిన మొట్టమొదటి మస్జిద్ "ఖుబా" అని పిలివబడింది మరియు ఇది మదీనా శివార్లలో ఉంది. అయినప్పటికీ, అన్ని మస్జిదులలో పవిత్రమైనది మరియు భూమిపై నిర్మించబడిన మొదటి ఆరాధన గృహం “ఆల్-మస్జిద్ ఆల్-హరమ్”, ఈ పవిత్రమైన ధార్మిక మస్జిద్ మక్కాలో ఉంది. రెండవ పవిత్రమైన మస్జిదు, (మదీనహ్ లో ఉన్న) దైవప్రవక్త(స.అ) యొక్క మస్జిదు. ఇది దైవప్రవక్త(స.అ) మక్కా నుండి మదీనహ్ హిజ్రత్ అనంతరం నిర్మించబడినది.
మస్జిద్‌లు అనేక విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అక్కడ ముసల్లహ్ (ప్రార్థనా మందిరం), మింబర్  (ప్రసంగించువాడు లేదా ఇమామ్ నిలబడి ఉపన్యాసం ఇచ్చు పీఠం), మరియు మిహ్రాబ్ (మక్కాలో ఉన్న కబహ్ యొక్క దిశను సూచించేది, అల్ ఖిబ్లహ్) ఉంటాయి.
ఖుర్ఆన్ ఇలా ప్రవచించెను: “తూర్పుపడమరలకు అధిపతి అల్లాహ్ యే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు త్రిప్పినా, అటు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది”[సూరయె బఖరహ్, ఆయత్115].
అయితే, ఐక్యతకు చిహ్నంగా, ప్రార్థన సమయంలో ఖిబ్లా (మక్కాలోని కాబహ్ యొక్క దిశను) కు తిరిగి నమాజ్ చేయాలి అని ముస్లింలు ఆదేశించబడ్డారు. మస్జిద్ లు కూడా మినార్లు మరియు గోపురాలు కలిగి ఉంటాయి, వీటిలో ప్రార్థనకు పిలుపు ప్రకటించబడింది. ఆ పిలుపును అజాన్ అంటారు.
ఒక వ్యక్తి అతడు పురుషుడు కానివ్వండి లేదా స్త్రీ కానివ్వండి, మస్జిదులోకి ప్రవేశించే ముందు, వారు పాదరక్షములను (చెప్పులు, బూట్లను) తప్పనిసరిగా తొలగించాలి మరియు మహిళలు సంప్రదాయబద్ధంగా దుస్తులు (హిజాబ్) ధరించాలి. పురుషులు లేదా స్త్రీలు లోపల పెద్ద సంభాషణలు చేయకూడదు. మస్జిద్(సజ్దా సమయంలో భూమికి తాకే శరీరభాగాలు) అల్లాహ్ కు చెందినవి.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను.. "మస్జిదులు(సజ్దహ్ చేసే టప్పుడు భూమికి తగిలే శరీరం యొక్క ఏడు భాగాలు) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి"[సూరయె జిన్, ఆయత్18].
కాబట్టి, మస్జిద్ లో తమ ఆరాధనను నిర్వహించకుండా అడ్డుకోవడం ఇస్లాం ధర్మంలో ఒక పెద్ద పాపం అని భావిస్తారు. ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: "అల్లాహ్ మస్జిదులలో, ఆయన  నామస్మరణను అడ్డుకుని, వాటిని పాడుచేయడానికి ప్రయత్నించే వానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు?"[సూరయె బఖరహ్, ఆయత్114].

మస్జిద్ కు సంబంధించి అహ్లెబైత్(అ.స) హదీసులు:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “భూమి క్రింద క్రిములు తన(శరీరాన్ని)ను తినకూడదు అని అనుకునేవాడు మస్జిదులను తుడవాలి...”[1]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “మస్జిద్ ను గౌరవించని వాడు దుష్టుడు మరియు మల్ఊన్”[2]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “మస్జిదును కేవలం ఒక దారి మాధిరి ఉపయోగించకండి, అందులో ప్రవేశిస్తే రెండు రక్అత్లు చదవి వెళ్లండి”[3]   
మస్జిద్ యొక్క ప్రాముఖ్యాతను వివరించే చాలా హదీసులు, హదీస్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్నయి ఇక్కడ కేవలం వాటి నుంచి కొన్ని హదీసులు మాాత్రమే వివరించడం జరిగింది.
ఇస్లాంలో మస్జిద్ కు సంబంధించి చాలా అహ్కాములు ఉన్నాయి. ఉదాహారణకు మస్జిదును అపవిత్ర చేస్తే ఏమి చేయాలి?, అపవిత్రంగా మస్జిదులో ప్రవేశించవచ్చా?, ఎలాంటి పరిస్థితిలో ప్రవేశించడానికి అనుమతి ఉంది?, మరుగుదొడ్లు ఉపయోగించడానికి డబ్బులు తీసుకోవచ్చా?, చారిత్రాత్మక మస్జిదులలో ప్రవేశం కోసం డబ్బులు తీసుకోవచ్చా?, అపరాధులను అరెష్టు చేయడానికి మస్జిదులో ప్రవేశించవచ్చా?, మస్జిద్ ను రాజకీయ ఉపన్యాసాలకు ఉపయోగించవచ్చా?, మస్జిద్ ఎలాంటి ప్రదేశంలో నిర్మించాలి?, మస్జిదులో నిద్రపోవచ్చా?, మస్జిదు పొరుగువారి కర్తవ్యాలు ఏమిటి?, ఇలాంటి చాలా ప్రశ్నలు మరియు వాటి అహ్కాములు వివరించబడి ఉన్నాయి.

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ144, బాబె23, రివాయత్67.
2. వసాయిల్ అల్ షియా, భాగం3, పేజీ460, బాబె16, రివాయత్6955.
3. వసాయిల్ అల్ షియా, భాగం3, పేజీ372, బాబె12, హదీస్1.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21