ఖుర్ఆన్ పఠన ప్రాముఖ్యత

గురు, 01/18/2018 - 03:38

.దైవప్రవక్త[స.అ] వచనానుసారం ఖుర్ఆన్ ను పఠించడం వల్ల మనిషి జీవితం సౌభాగ్యంగా మరియు సంతోషంగా ఉంటుంది. 

ఖుర్ఆన్ పఠన ప్రాముఖ్యత

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను: “ఒకవేళ జీవితంలో సౌభాగ్యం మరియు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందాలనుకుంటే, ప్రళయ దీనాన విముక్తి మరియు ఆరోజు ఉండే మండుటెండలో నీడ కావాలనుకుంటే, ఆ భయంకరమైన హడలు పుట్టించే మరియు దిగ్ర్భమకు గురి చేసే ఆ రోజున హిదాయత్ కావాలనుకుంటే, ఖుర్ఆన్ ను పఠించడం నేర్చుకోండి; ఎందుకంటే: అది అల్లాహ్ ప్రస్తావనం, షైతాన్ నుండి రక్ష మరియు ప్రళయదీనాన మన కార్యముల తూకములో శ్రేష్ఠమైనది”.[బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ19]
దైవపప్రవక్త ఇలా కూడా ప్రవచించారు: “మీలో ఖుర్ఆన్ పఠనాన్ని నేర్చుకునే మరియు ఇతరులను నేర్పించే వారే అందరిలో ఉత్తములు”. [వసాయిలుష్షియా, భాగం4, పేజీ852]
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను: “అల్లాహ్ ఖుర్ఆన్ను ఒక ప్రత్యేక కాలనికి గాని లేదా ప్రత్యేకమైన ప్రజల కోసమని గాని నిశ్చయించలేదు. ఖుర్ఆన్, ప్రళయదినం వరకు ప్రతీ కాలంలో కొత్తదిగా మరియు ప్రతీ ఒక్కరికి కొత్తదనాన్ని ఇస్తుంది”.[బిహారుల్ అన్వార్, భాగం2, పేజీ 280]
ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ] ఖుర్ఆన్ పట్ల మన కర్తవ్యాన్ని ఇలా సూచించారు: “ఖుర్ఆన్ తప్పకుండా మన జీవితం యొక్క ప్రతీ భాగంలో ఉండాలి”

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ19 మరియు బాగం2, పేజీ280.
హుర్రె ఆములి, వసాయిలుష్షియా, భాగం4, పేజీ852.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10