క్షమించడం విశ్వాసుల లక్షణం

బుధ, 01/17/2018 - 18:47

ఇతరులను క్షమించని వారు ఆ దేవుని నుండి క్షమాపన కోరుటకు అర్హులు కాలేరు. 

క్షమించడం విశ్వాసుల లక్షణం

చాలా చోట్ల మనిషి తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా లేదా తిట్టినా దానిని ఓర్చుకోవటం చాల కష్టం, ఇట్లాంటి పరిస్థితులలో మనిషి తనపై తన అధికారన్ని కోల్పోయి తిట్టిన వారిపై పగ తీర్చుకోవాలనే ఆలోచన కలుగుట ప్రతీ వారిలో సహజమే.
కానీ విశ్వాసుల మరియు స్వర్గీయుల లక్షణాలను ప్రస్థవిస్తూ దివ్యఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు[ఆలి ఇమ్రాన్/134].
పై ఆయత్ ప్రకారం ఇతరులపై కోపగించుకోకుండా వారిని మన్నించి వదిలివేసిన వారే ఆ అల్లాహ్ ప్రేమకు అర్హులు.
మహాప్రవక్త[అ.స] ఈ విధంగా ప్రవచించారు:
إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ نَادَى مُنَادٍ مَنْ كَانَ أَجْرُهُ عَلَى اللَّهِ فَلْيَدْخُلِ الْجَنَّةَ فَيُقَالُ مَنْ ذَا الَّذِي أَجْرُهُ عَلَى اللَّهِ فَيُقَالُ الْعَافُونَ عَنِ النَّاسِ
ప్రళయదినాన అందరూ దేవుని సన్నిధిలో హాజరు చెేయబడతారు అప్పుడు అందరితో ఈ విధంగా సంభొదించటం జరుగుతుంది: "ఎవరిపై ఐతే దేవుని యొక్క ప్రతిఫలం ఉన్నదో వారు స్వర్గంలోకి ప్రవేసించగలరు", అప్పుడు ప్రస్నించేవారు ఈ విధంగా ప్రస్నిస్తారు: "ఎవరిపై ఆ దేవుని ప్రతిఫలం రాయబడినది", ఈ విధంగా జవాబు వస్తుంది: "ఎవరైతే ఇతరులను మన్నించేవారో వారే"[బిహారుల్ అన్వార్ 64వ భాగం, పేజీ నం:266].
ఇమాం హుసైన్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
إِنَ‏ أَعْفَى‏ النَّاسِ‏ مَنْ‏ عَفَا عِنْدَ قُدْرَتِه
"మీలో మన్నించే వారిలో అతిపెద్దగా మన్నించేవారెవరంటే ప్రతీకార శక్తి కలిగి ఉండి కూడా ఇతరులను క్షమించేవారు"[అద్-దుర్రతుల్ బాహిరహ్ పేజీ: 23].
సర్వశక్తులు కలిగిన ఆ భగవంతుడే ఎప్పుడైతే తన దాసులు తననుంచి నిజమైన క్షమాపన కోరుకుంటారో వారిని క్షమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు కానీ ఇతరులను క్షమించని ఈ మనవుడు ఆ దేవుని కన్నా బలవంతుడా!

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్ 64వ భాగం, పేజీ నం:266.
అద్-దుర్రతుల్ బాహిరహ్ పేజీ: 23.

 

                                                                       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6