.మీరు కూడా ఒకసారి ఖుర్ఆన్ ను చదివి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం దక్కుతుంది.
ఒక ముస్లిం అయి ఉండి ఖుర్ఆన్ ఉపదేశాలు తెలియకపోవడం సరికాదు. ఇస్లాం ఆచరణలో ఉండి, ఇస్లాంను విశ్వసించి అల్లాహ్ ఉపదేశాలు తెలియకపోవడం మంచి విషయం కాదు, సిగ్గుచేటు. అల్లాహ్ దాసుడై ఉండి దైవప్రవక్త[స.అ] పట్ల ఇష్టం లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన మరియు నమ్మదగిన విషయం కాదు. అల్లాహ్ను ఇష్టపడతామని చెప్పడం మరియు ఆయన ఉపదేశాలను చదవకపోవడం మరియు వాటిని అర్ధం చేసుకోకపోవడం, అంగీకృతమైనది కాదు. ఈ విధంగా చూసినట్లైతే, ఖుర్ఆన్ పట్ల ఒక ముస్లిము యొక్క కర్తవ్యం ఏమిటంటే అల్లాహ్ తరపు నుండి దైవప్రవక్త[స.అ] పై అవతరించబడ్డ ఈ పవిత్ర గ్రంథాన్ని ముందుగా సరిగా పఠించడం నేర్చుకోవాలి. ఆ తరువాత వాటిలో ఉన్న ఆయత్ల అర్ధాలను, వాటి భావాలను తెలుసుకోవాలి. మూడవ స్థితిలో ఖుర్ఆన్ ఉపదేశాల పై అమలు చేయాలి, ఆ అమలు కూడా నిష్కకపటమైనది అయి ఉండాలి. తన జీవితంలో ఖుర్ఆన్ యొక్క చట్టాన్ని మరియు దాని ఉపదేశాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ముస్లిమే కాకుండా వేరే ఎవరైనా సరే ఖుర్ఆన్ చదవడం మొదలు పెడితే, కొంత కాలంలోనే వారు సౌభాగ్యం మరియు సంతోషాన్ని పొందుతారు, అలా అని వారు గ్రహిస్తారు కూడాను. చాలా మంది ప్రముఖులు ముస్లిముల కాకపోయిన ఖుర్ఆన్ భావాన్ని పఠిస్తారని మేము టీవీలలో, న్యూస్ లలో చూస్తూ ఉంటాము. మీరు కూడా ఒకసారి ఖుర్ఆన్ ను చదివి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం దక్కుతుంది.
ఖుర్ఆన్ ను పఠించి ఇస్లాం ను అర్ధం చేసుకోండి, ఇహపరలోకాలలో సంపూర్ణత్వాన్ని పొందండి.
వ్యాఖ్యానించండి