షియా, అహ్లెసున్నత్ దృష్టిలో-2

శుక్ర, 12/24/2021 - 15:58

షియా ముస్లిములు కూడా కలెమా చదువుతారు. ఇస్లాం ఆదేశానుసారం కలెమా చదవిన వారిని తప్పుడు సాక్ష్యాలతో ఇష్టానికి కాఫిర్ గా నిర్ధారించి వారిని చంపడం పుణ్యం అని భావించడం ముమ్మాటికీ నేరం మరియు ఇస్లాం దీనిని సమ్మతించదు...

షియా, అహ్లెసున్నత్ దృష్టిలో-2

ఒకవేళ స్వయంగా “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అని పిలవబడే వారికి దైవప్రవక్త(స.అ) సున్నతే తెలిసి ఉంటే “కలెమా” చదివే వారిని, నమాజ్ చదివే వారిని, జకాత్ చెల్లించే వారిని, ఉపవాస దీక్షను అమలు చేసేవారిని, హజ్ నిర్వర్తించేవారిని, మంచి పనులు చేయమని ఆదేశించే వారిని మరియు చెడు పనులనుండి ఆపే వారిని, ఎప్పుడూ కాఫిర్ అని అనే వారుకాదు.
అహ్లెసున్నత్
లు, నిజానికి అమవీయుల మరియు ఖురైషీయుల సున్నత్ పై అమలు చేస్తారు. వాళ్ళు అజ్ఞాన కాలపు బుద్ధి మరియు వర్గపక్షపాత ఆలోచనల అధీనంలో కలంను చేతపడతారు. ఇక వాళ్ళు ఏది వ్రాసినా దాని పై ఆశ్చరం కలగకూడదు. ఎందుకంటే కంచెంలో ఏది ఉంటే, దాని నుండి అదే కారుతుంది.
ఖుర్ఆన్ ప్రవచించిన ఆ మాటను దైవప్రవక్త(స.అ) ప్రవచించలేదా?
قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۢ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ ..
అనువాదం: (ఓ ప్రవక్తా! ఇలా) చెప్పండి: “ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపుకు రండి”.[అలి ఇమ్రాన్ సూరా:3, ఆయత్:64]
ఒకవేళ వారు నింజంగా అహ్లెసున్నత్
లు అయి ఉంటే తమ షియా సోదరును, తమకు మరియు షియాల మధ్య ఏకాభిప్రాయంగల ఆ “కలెమా” ద్వార ఐక్యమత్యంగా ఉండేందుకు ఆహ్వానించేవారు. ఎందుకంటే ఇస్లాం తన శత్రువులైన యూదులు మరియు క్రైస్తవులనే వారితో ఏకాభిప్రాయం గల “కలమా”పై ఐక్యమత్యంగా ఉండడానికి ఆహ్వానిస్తుంది; ఐతే దైవం, నమాజ్ చదివే దిశ మరియు అభిలాష ఒకటైన వారు, ఎందుకు ఐక్యం అవ్వరూ.
అయితే అహ్లెసున్నత్ ఉలమాలు తమ షియా ఉలమాల సోదరులకు ఎందుకని ఆహ్వనించరూ?, వారితో పాటు చర్చించడానికై ఎందుకు కూర్చోరు?, మంచి పద్దతితో వాళ్ళతో ఎందకు సంభాషించరూ?, ఒకవేళ వారి విశ్వాసాలు మంచివి కాకపోతే వాటిని ఎందుకని సరి చేయరూ?.
ఇరువర్గాల ఉలమాలు పాలుగొనేటువంటి ఒక ఇస్లామీయ కాన్ఫ్రెన్స్
ను ఎందుకు ఏర్పాటు చేయరూ?, అందులో ఎవరు సరైన మార్గం పై ఉన్నారో మరియు ఎవరు అసత్యపు మార్గం పై ఉన్నారో తెలుసుకునేందుకు విరుద్ధ సమస్యలను ముస్లిములందరి ముందు ఎందుకు పెట్టరూ?.
ముఖ్యంగా ప్రపంచమంటా ¾ శాతం ఉన్న అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు, వారి వద్ద మార్గాలున్నాయి, ప్రభుత్వంలో పలుకుబడీ మరియు వారితో సంబంధాలు ఉన్నాయి. వారికి ఎందుకని సులభం కాదు, వారు గ్రహాలకు కూడా యజమానులు.

కాని అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు ఏమాత్రం ఇలా చేయలేరు. ఖుర్ఆన్ ఆహ్వానించే ఇటువంటి జ్ఞాన పరమైన పోటికి తయారు కాలేరు. అల్లాహ్ ప్రవచనం:
قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ
అనువాదం: వారితో ఇలా చెప్పండి: మీరు (మీ వాదనలో) సత్యవంతులైతే దాని నిదర్శనాలేమిటో సమర్పించండి.[బఖరా సూరా:2, ఆయత్:111]

మరి ఇలా కూడా ప్రవచించెను:
قُلۡ هَلۡ عِندَكُم مِّنۡ عِلۡمٖ فَتُخۡرِجُوهُ لَنَآۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ أَنتُمۡ إِلَّا تَخۡرُصُونَ
అనువాదం: వారితో ఇలా చెప్పండి: మీ దగ్గర ఏదైనా జ్ఞానం ఉంటే, దానిని బయటికి తీసుకొని రండి. (మీరు) కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు, (అబద్ధాలను అల్లుతారు).[అన్ఆమ్ సూరా:6, ఆయత్:148]   

అందుకనే మీరు వారిని, షియాలను దూషిస్తూ మరియు వారి పై నిందలు వేయడాన్ని చూడగలరు. వాస్తవానికి వారికి తెలుసు సాక్ష్యాలు, నిదర్శనలన్నీ షియాల వైపే ఉన్నాయి అని.
యదార్థం తెలిస్తే ఎక్కడ ముస్లిలలో ఎక్కువ మంది షియాలుగా మారిపోతారో అన్న భయం వల్ల అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు, ఇలా చేయడానికి భయపడుతున్నారు, అని నేను అనుకుంటున్నాను.
ఈజిప్ట్ యొక్క యూనివర్సిటీ యొక్క చాలా ఉలమాలకు ఇలాగే జరిగింది. వారు యదార్థ అన్వేషణలో కష్టాలను ఎదురుకున్నారు. అయితే వారికి యదార్ధం లభ్యం అయ్యింది. మరియు వారు షియా వర్గాన్ని ఎంచుకున్నారు మరియు తమ పూర్వీకుల విశ్వాసాలను వదిలేశారు.
అహ్లెసున్నత్ ఉలమాలు, వారి వ్యవస్థకు చిందరవందర చేయడానికి ఛాలెంజ్ అయిన ఆ ఆపదను చాలా బాగా గ్రహించారు. అందుకనే వారు, తమ అనుచరుల పై మరియు విధేయుల పై షియాల వద్ద కూర్చోవడాన్ని హరామ్
గా నిర్ధారించారు. అలాగే వారి(షియా)తో చర్చిచడాన్ని, వారితో వివాహమాడడాన్ని మరియు వారు జపా చేసిన వాటిని తినడాన్ని కూడా హరామ్
గా నిర్ధారించారు.
వారి ఈ పరిస్థితి ద్వార వారు దైవప్రవక్త(స.అ) సున్నత్ నుండి ఎంత దూరంగా ఉన్నారో, మరియు ముహమ్మద్(స.అ) ఉమ్మత్
ను తమ పూర్తి బలగాలతో మార్గభ్రష్టులు చేయాలనుకున్న అమవీయుల సున్నత్‌కు ఎంత దగ్గరగా ఉన్నారో స్పష్టమౌతుంది. ఎందుకంటే అమవీయుల మనసులు అల్లాహ్ స్మరణకై సిధ్ధంగా ఉండేవి కావు. వాటి అవతరణను అల్లాహ్ తరపు నుండి, అని కూడా నమ్మేవారు కాదు. వాళ్ళు బలవంతంగా ఇస్లాంను స్వీకరించారు.

ఎలాగైతే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మంచి సహాబీయులను చంపినవాడు, అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క నాయకుడు ముఆవియా ఇబ్నె అబీ సుఫ్యాన్ ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు: “నేను మీతో నమాజ్ చదివించడానికో, ఉపవాసాలు పెట్టించడానికో, హజ్ చేయించడానికో యుద్ధం చేయలేదు. నేను మీతో యుద్ధం మీ పై అధికారం చేయడానికి చేశాను. మరి మీరు దానితో సంతోషంగా లేకపోయినా సరే అల్లాహ్ నాకు ప్రసాదించాడు”

అల్లాహ్ ఇలా ప్రవచించెను:
إِنَّ ٱلۡمُلُوكَ إِذَا دَخَلُواْ قَرۡيَةً أَفۡسَدُوهَا وَجَعَلُوٓاْ أَعِزَّةَ أَهۡلِهَآ أَذِلَّةٗۚ وَكَذَٰلِكَ يَفۡعَلُونَ
అనువాదం: సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్యంసం చేస్తారు. అక్కడి మర్యాదస్తులను అవమానాలపాలు చేస్తారు. వీళ్ళూ అదే చేయవచ్చు.[నమ్ల్ సూరా:27, ఆయత్:34]

రిఫరెన్స్
అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ99-102.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15