షియా, అహ్లెసున్నత్ దృష్టిలో-1

గురు, 12/23/2021 - 17:26

ఇక్కడ మనం చెప్పే విషయాలు కేవలం అహ్లె సున్నత్ వర్గాలలో బుద్ధివివేకాలకు వ్యతిరేకమైన మరియు బనీ ఉమయ్యాల ఆలోచనలు కలిగివున్న వర్గం వారి ఉద్దేశాలు మాత్రమే...

షియా, అహ్లెసున్నత్ దృష్టిలో-1

అహ్లె సున్నత్ పుస్తకాలలో షియాల పట్ల న్యాయంగా ఉన్న మరియు ఇస్లామీయ ఆదేశాల పై అమలు చేసే ఈనాటి అహ్లెసున్నత్ ఉలమాలలో కొందరు తప్ప అహ్లెసున్నత్ యొక్క పూర్వీకులు మరియు ఇప్పటి ఉలమాలలో బనీ ఉమయ్యాల ఆలోచనల అధీనంలో, ఎల్లప్పుడూ షియాలకు వ్యతిరేకంగా వ్రాస్తూనే ఉన్నారు. అందువల్లే మీరు వారిని ప్రతీ విషయంలో జోక్యం చేయడాన్ని చూడవచ్చు. వారు చెప్పే మాటలు వారికే అర్ధంకావు, అహ్లెబైత్(అ.స) యొక్క అనుచరులైన షియాలను దూషిస్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి వారు కూడా వాటి నుండి విముక్తులు కారు. వారు ఆగ్రహం మరియు బలవంతంగా ఇస్లామీయ ఖిలాఫత్
ను చేజిక్కించుకున్న వారి ఉత్తమ పూర్వీకులైన ముఆవియా మొ॥ వారి అడుగు జాడలలో నడుస్తూ, అన్యాయంగా షియాల పై నిందలు వేస్తారు, వారిని కాఫిరులు, అవిశ్వాసులు అంటారు. వారిని చెడు పేర్లతో సంబోధిస్తారు.

ఒకసారి యూదుడైన “అబ్దుల్లాహ్ ఇబ్నె సబా”ను షియా వర్గ సృష్టికర్త అని వ్రాస్తారు. మరోసారి షియాలు నిజానికి అగ్న్యుపాసకులు(అగ్నిని పూజించేవారు), మరియు వాళ్ళు రాఫిజీయులు[1], అల్లాహ్ వాళ్ళకు చెడు చేయుగాక! వీళ్ళు ఇస్లాంకు వ్యతిరేకంగా యూదుల మరియు క్రైస్తవుల తరపు నుండి రాయబారులు, అని నిందిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కపటవర్తనులు, ఎందుకంటే వీళ్ళు తఖయ్యాహ్[2] పై అమలు చేస్తారు, వీళ్ళు మహ్రమ్[3]తో పెళ్ళి చేసుకోవడాన్ని సమ్మతిగా భావిస్తారు, వ్యభిచారానికి ముత్అ అని పేరు పెట్టి దానిని హలాల్
గా నిర్ధారిస్తారు, అని అంటారు. మరి వారిలో కొందరు, షియాల ఖుర్ఆన్ వేరు మరియు మన ఖుర్ఆన్ వేరు అని అంటారు. షియాలు అలీ(అ.స) మరియు వారి కుమారుల నుండి ఇమాములైన వారిని పూజిస్తారు, ముహమ్మద్(స.అ) మరియు జిబ్రయీల్ ను శత్రువులుగా భావిస్తారు. మొ॥, అని వ్రాస్తారు.
ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండానే వారి అభిప్రాయాల ప్రకారంగా వారి కలం ద్వారానే అహ్లెసున్నత్ ఉలమాల తరపు నుండి షియాలకు వ్యతిరేకంగా ఏదో ఒక పుస్తకం ప్రజల్లోకి వచ్చేస్తుంది. మరియు ప్రతీ దానిలో షియాలను కాఫిరులు అని చెప్పబడుతుంది. మరియు వాళ్ళను అవమానిస్తారు.
వారి ఇలాంటి రాతల వెనక మంచి ఉద్దేశం, లేదా డిఫెన్స్ చేయలనే ఉద్దేశం ఉండదు. ఇస్లామీయ ఉమ్మత్ యొక్క చిన్నాభినం మరియు నాశనాన్ని ఆశించే వారి పెద్దలను సంతోషపరచడమే వాళ్ళ ఉద్దేశం.
వాళ్ళు వ్రాసేదంతా అర్ధం లేని మాటలు, వాటికి స్వమతపక్షపాతం మరియు శత్రుత్వం తప్ప వేరే ఎటువంటు సాక్ష్యాలు ఉండవు. పరిశోధించకుండా పూర్వీకులను ఫాలో అయిపోతారు. వారి ఉదాహారణ పూర్తిగా చిలక వంటిది, విన్నదే తిరిగి చెబుతుంది. అమవీయుల పరిచారకులైన నవాసిబ్
ల పుస్తకాల నుండి వ్రాసేస్తూ ఉంటారు. యజీద్ మరియు ముఆవియాను కూడా వీళ్ళే ప్రశంసించేవారు.[4]
వారి పూర్యీకులు, యజీద్ మరియు అతడి తండ్రి తన ఉపకారులను వెండీ మరియు బంగారపు కాంతులతో కళ్లు కనిపించకుండా చేసేవాడు. మరియు వాళ్ళ అంతరాత్మలను కొనేవాడు. ఐతే ఈనాడు కోట్ల డాలర్లతో, లండన్ మరియు ప్యారిస్
లో పెద్ద పెద్ద నిరుపమానమైన భవంతులు మరియు అందులో గులాబీ రేఖల బుగ్గల యువతుల, మంచి మంచి మద్యాలకు బదులుగా ఆ అహ్లెసున్నత్ ఉలమాల అంతరాత్మ, దీన్ మరియు దేశాన్ని కొనేయబడుతుంది.

ఒకవేళ వారు నిజంగా దైవప్రవక్త(స.అ) సున్నత్
ను అనుచరించే వరైవుంటే, మరి అలా అని వాళ్ళు అనుకుంటారు కూడాను, దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తమ గుణాలను అవలంభించేవారు. మరి విశ్వాసం పరంగా తమ వ్యతిరేకులను కూడా గౌరవించేవారు.
దైవప్రవక్త(స.అ) ఈ హదీస్ ఇలా మనకు ఉపదేశించడం లేదా: ఒక ముస్లిం, మరో ముస్లిం కొరకు సీసము పట్టించిన గోడవంటి వాడు, దాని ఒక భాగం ఇంకో భాగాన్ని ఆశ్రయిస్తుంది.
ఇలా కూడా ప్రవచించారు: ముస్లిములందరూ ఒకే శరీరం లాంటి వారు, ఒక భాగానికి బాధ కలిగినప్పుడు పూర్తి శరీరం దాని వల్ల వ్యాకులత చెందుతుంది.
దైవప్రవక్త(స.అ) స్పష్టంగా ఇలా అని ప్రవచించలేదా?: “ముస్లిమును దూషించేవాడు పాపి మరియు ముస్లిమును చంపేవాడు కాఫిర్”[5]

రిఫరెన్స్

1. అలీ(అ.స) మరియు వారి సంతానాన్ని ఇష్టపడేవారు.
2. ప్రాణ భయంతో తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా చెప్పడం లేదా అమలు చేయడం.
3. వివాహమునకు నిషిద్ధమైన బాంధవ్యము.
4. సౌదీ అరేబీయ యొక్క విజారతుల్ మఆరిఫ్ “హఖాయిఖు అన్ అమీరిల్ మొమినీన్ యజీద్ ఇబ్నె ముఆవియా” అన్న పేరు గల ఒక పుస్తకాన్ని ప్రచురించారు. మరియు విజ్ఞాన శాఖ వారు దానిని తమ మద్రసాల విద్యాభ్యాస క్రమములో చేర్చారు.
5. అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ97,98.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31