అహ్లెసున్నత్, షియాల దృష్టిలో-1

మంగళ, 12/28/2021 - 11:29

“అహ్లెసున్నత్ వల్ జమాఅత్”
ను స్వమత పక్షపాతము గల సాధారణ షియాలు తప్ప పూర్వపు మరియు ఇప్పటి షియా ఉలమాలు వారిని తమ సోదరులుగా భావిస్తారు...

అహ్లెసున్నత్, షియాల దృష్టిలో-1

“అహ్లెసున్నత్ వల్ జమాఅత్”
ను నాసిబీగా భావించే స్వమత పక్షపాతము గల సాధారణ షియాలు తప్ప పూర్వపు మరియు ఇప్పటి షియా ఉలమాలు “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” వారిని తమ సోదరులుగా భావిస్తూనే వచ్చారు. అహ్లెసున్నత్ బనీఉమయ్యాల మోసానికి గురి అయ్యి మంచి పూర్వీకుల పట్ల మంచి భావన కలిగి ఉన్నారు మరియు కళ్ళు మూసుకొని వాళ్ళను ఫాలో అవుతారు, అది వేరేవిషయం అనుకోండి. అలా అమవీయులు వాళ్ళను రుజుమార్గం నుండి తప్పించేశారు. మరియు వారితో కలిసి ఉంటే మార్గభ్రష్టత నుండి కాపాడే మరియు హిదాయత్ చేసేటువంటి “సఖ్లైన్” (అల్లాహ్ గ్రంథం దైవప్రవక్త(స.అ) ఇత్రత్(అ.స)) నుండి దూరం చేశారు.
మీరు చూసే ఉంటారు, షియాలు వ్రాసేదంతా వాళ్ళు తమ నుండి డిఫెన్స్ మరియు తమ విశ్వాసాలను విశ్లేషిండంతో పాటు తమ సున్నీ సోదరులను ఏకేశ్వారవాదన పై ఐక్యమత్యంగా ఉండేందుకు ఆహ్వానిస్తూ ఉంటారు.
షియా ఉలమాలు పరిశోధనను పూర్తి చేసేందుకు మరియు వర్గాలన్నీంటిని ఒకే దుప్పటి పై కూర్చోబెట్టి చర్చలు జరిపించడానికై వివిధ దేశాలలో మరియు పట్టణాలలో కేద్రాలను స్ధాపించారు.
మరియు వాటిలో కొందరు అహ్లెసున్నత్ యొక్క “అల్ అజ్‌హర్”కు చెందిన మంచి మంచి విద్వాంసుల వద్దకు వెళ్ళి చర్చలు జరిపారు. వారితో విజ్ఞాన పరమైన వాగ్వాదము చాలా మంచి పద్ధతిలో చేశారు. శత్రుత్వం మరియు వైరాన్ని దూరం చేయడానికి ప్రయత్నించారు. ఎలాగైతే “ఇమామ్ షరఫుద్దీన్ మూసవీ”, “మౌలానా సలీముద్దీన్ బషరీ”తో కలిసినప్పుడు చర్చ జరిగిందో అలాగా. మరియు ఆ పరిచయం మరియు వారి ఉత్తరాల ఫలితమే “అల్ మురాజిఆత్” అను ఒక పుస్తకం, ప్రజల ముందుకు వచ్చింది. అది ముస్లిములందరూ దగ్గరవ్వడానికి ముఖ్య పాత్ర వహించింది. అలా ఈజిప్ట్
లో షియా ఉలమాల ప్రయత్నం ఫలించింది. మరియు ఈజిప్ట్ యొక్క ముఫ్తీ అయిన “ఇమామ్ మహ్మూద్ షల్తూతీ” అప్పుడు “షియా జాఫరీ వర్గాన్ని స్వీకరించడం సమ్మతం” అని ఫత్వా ఇచ్చారు. మరి అప్పటి నుండే అల్అజ్‌హర్ యూనివర్సిటీలో “జాఫరీ ఫిఖా” చదివించడం మొదలు పెట్టారు.

షియా ముస్లిముల తీరు ముఖ్యంగా వారి ఉలమాల తీరు ఎల్లప్పుడూ పవిత్ర ఇమాములు మరియు పూర్తి విధంగా ఇస్లాం యొక్క నాయకత్వాన్ని వహించే  జాఫరియా వర్గం గురించి ప్రపంచానికి విశ్లేషిస్తుంది. వారు ఈ క్రమంలో చాలా పుస్తకాలు మరియు వ్యాసాలు వ్రాశారు. మరియు సమావేశాలు జరిపారు. ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఇస్లామీయ విప్లవం విజయవంతం అయిన తరువాత టహ్రాన్
లో “వహ్దతే ఇస్లామీ”(ఇస్లామీయ ఐక్యత) పేరుతో వర్గాల సమ్మేళన టాపిక్ పై కాన్ఫ్రెన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ద్వేషం మరియు శత్రుత్వాలన్నీంటిని దూరం చేయడానికి గల ఒక సత్యమైన ఆహ్వానం ఇది. ముస్లిములందరీలో సోదరా భావాన్ని కలగజేయాలనే మరియు ఒకరిని ఒకరు పరస్పరంగా గౌరవించాలన్న, అందరి ఉద్దేశం ఇది.
ప్రతీ సంవత్సరం “వహ్దతే ఇస్లామీ” కాన్ఫ్రెన్స్
లో షియా మరియు సున్నీ ఉలమాలు మరియు విద్వాంసులు ఆహ్వానించబడతారు. వారందరూ ఒక వారం పాటు ఒక స్వచ్ఛమైన సోదరా భావ నీడలో గడుపుతారు, కలిసి తింటారు, కలిసి నమాజ్ చదువుతారు, దుఆ చేస్తారు, అభిప్రాయాలను వెల్లడిస్తారు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకుంటారు.
ఆ కాన్ఫ్రెన్స్ జరపడానికి గల ఉద్దేశం, హృదయాలను ఒకేచోట చేర్చడం, మరియు ముస్లిములందరినీ దగ్గర చేయడం. అలా చేస్తే ఒకరికొకరు తెలుసు కోగలరు, మరియు శత్రుత్వం వదిలేస్తారు. నిస్సందేహంగా ఇందులోనే మేలు మరియు గొప్పతనాలు ఉన్నాయి. దీని ప్రభావాలు మనకు ఈనాడు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీని ఫలితాలు కూడా ఇన్
షా అల్లాహ్ తెలిసి వస్తాయి.

మీరు ఏ షియా ఇంట్లోనైనా ప్రవేసించి చూడండి మీకు అక్కడ షియా పుస్తకాలతో పాటు అహ్లెసున్నత్
ల పుస్తకాలు కూడా తప్పకుండా దొరుకుతాయి. మరి అలాంటప్పుడు ఉలమా మరియు విద్వాంసుల ఇళ్ళలో దొరక్కపోవడం అసాధ్యం. దీనికి పూర్తి వ్యతిరేకం అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల ఇళ్ళలో కనిపిస్తుంది, వారి ఇళ్ళలో కేవలం వారి ఉలమాల పుస్తకాలే దొరుకుతాయి. షియా యొక్క ఒక్క పుస్తకం కూడా దొరకదు, ఒకవేళ దొరికినాయో అనుకోండి ఒకటీ రెండు కన్న ఎక్కువ దొరకవు. అందుకనే అహ్లెసున్నత్
లు షియా యొక్క యదార్ధాలు తెలియక అలాగే ఉండి పోతారు. వారికి షియా యొక్క శత్రువులు సృష్టించే ఆ నిందలు మాత్రమే తెలుస్తాయి.

రిఫరెన్స్
అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ104-105.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11