అహ్లెసున్నత్, షియాల దృష్టిలో-2

మంగళ, 12/28/2021 - 11:37

ఒక సాధారణ షియాకు కూడా ఇస్లాం చరిత్ర తెలిసి ఉంటుంది, ఎందుకంటే వారు చరిత్ర యొక్క కొన్ని సంఘటనలను సురక్షితంగా ఉంచడాని సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు...

అహ్లెసున్నత్, షియాల దృష్టిలో-2

ఒక మామూలు షియాకు కూడా ఇస్లాం చరిత్ర తెలిసి ఉంటుంది, ఎందుకంటే వారు చరిత్ర యొక్క కొన్ని సంఘటనలను సురక్షితంగా ఉంచడాని సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు.
కాని సున్నీ ఆలిమ్
కు కూడా చరిత్రను ప్రముఖ్యత ఇవ్వడాన్ని చూడలేరు. వారు చరిత్రను ఒక అసభ్య సంఘటనగా భావిస్తారు. దానిని త్రవ్వడం మరియు దానిని తెలుసుకోవడం మంచిదికాదు, అని అనుకుంటారు. అంతేకాదు దానిని వదిలేయడం విధిగా భావిస్తారు, ఎందుకంటే దాని వల్ల మంచి పూర్వీకుల పట్ల అనుమానాలు పుట్టుకొస్తాయి. వాస్తవానికి వారు సహాబీయులందరిని న్యాయమూర్తులు మరియు పవిత్రులు అన్న విషయంపై తమను తృప్తి పరుచుకున్నారు. మరి చరిత్రలో వారి గురించి సురక్షితంగా ఉన్న వాటి వైపు తిరిగి కూడా చూడరు.
అందుకనే వాళ్ళను సాక్ష్యాలతో చర్చించాలనుకుంటున్న వారితో పోటి పడకుండా ఫరారవుతూ చూడగలరు. అయితే వాళ్ళకు ముందు నుండే మేము అపజయానికి పాలవుతాము అని తెలిసో, లేక అనుభూతులకు లొంగిపోయి పరిశోధన మార్గాన్ని ఎంచుకుంటారు మరి తమ విశ్వాసాలన్ని గాలిలో కలిసి పోతాయి మరియు వారు దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స) యొక్క షియాగా మారిపోతారేమో, అనో.

ఈ విధంగా “షియాలు అసలైన అహ్లెసున్నత్”లు అన్న మాట; ఎందుకంటే మొదటి ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), దైవప్రవక్త(స.అ) తరువాత దైవప్రవక్త (స.అ) సున్నత్ నీడలోనే తన జీవితాన్ని గడిపారు. మరియు అందులోనే స్వేస తీసుకున్నారు. ప్రజలు అతని వద్దకు ఖిలాఫత్ పదవిని తీసుకొని వచ్చారు, షైఖైన్
ల చరితము పై అమలు చేయాలనే షరతు పెట్టి బైఅత్ చేయడానికి సిద్ధమయ్యారు. అలీ(అ.స), నేను అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ పై తప్ప మరెవ్వరి సున్నత్ పై అమలు చేయను. నాకు దైవప్రవక్త(స.అ) సున్నత్ పై అమలు చేసి అల్లాహ్ గ్రంథం పై అమలు చేయనటువంటి ఖిలాఫత్, నాకు అవసరం లేదు, అని ప్రవచించిన తరువాత ఇలా అన్నారు: మీ ఖిలాఫత్ నా దృష్టిలో నేను దానిలో అల్లాహ్ ఆదేశాల పై అమలు పరచనివ్వనంత వరకు మేక ముక్కు నుండి వచ్చే చీమిడి వంటిది.
అతని కుమారుడు ఇమామ్ హుసైన్(అ.స) గారి ప్రపంచం ఉన్నంత వరకు వినబడేటు వంటి ప్రత్యేక వచనం: “ఒకవేళ ముహమ్మద్(స.అ) యొక్క దీన్ నా చావుతోనే స్థిరత్వం పొందుతుంది, అని అనుకుంటే; ఖడ్గాలు! రండి నన్ను చుట్టుముట్టండి”
అందుకనే షియాలు తమ సునీ సోదరులను ప్రేమగా చూస్తారు. వారిని కూడా రుజుమార్గం మరియు విముక్తి గల మార్గం పై తీసుకొని రావలని ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే షియా దృష్టిలో ఎవరినైనా రుజుమార్గం పై తీసుకొని రావడం -సరైన రివాయత్
లలో చెప్పిన విధంగా-  ప్రపంచం మరియు దానిలో ఉన్న అన్నింటి కన్నా మంచిదైనది. దైవప్రవక్త(స.అ) “ఖైబర్” యుద్ధానికి అలీ(అ.స)ని పంపిస్తూ ఇలా అన్నారు: “వాళ్ళతో(యూదులతో) వాళ్ళు لا الٰه الا اللہ و ان محمدا رسول اللہ  కలెమా, చదవనంత వరకు యుద్ధం చేయి. ఒకవేళ వాళ్ళు ఆ కలెమా చదివేస్తే మరి వాళ్ళ ప్రాణాలు మరియు సోమ్ము అధీనంలో తీసుకోకు, వాళ్ళ మిగిలిన సంగతి అల్లాహ్ చూసుకుంటాడు. ఒకవేళ అల్లాహ్ నీ ద్వార ఎవరికైన రుజుమార్గం చూపిస్తే అది నీ కోసం ఈ ప్రపంచంలో సూర్య కాంతి పడే వాటన్నీంటి కన్నా మంచిది, లేదా ఎర్ర ఒంటెల కన్న శ్రేష్ఠమైనది”[1]

ఎలాగైతే హజ్రత్ అలీ(అ.స) ప్రజలను రుజుమార్గం వైపు తీసుకొచ్చే వారో. మరియు వారిని అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ వైపు ఆహ్వానించే వారో అలాగే ఈనాడు అతని షియాలు తమపై వేయబడ్డ నిందల నుండి పూర్తి విధంగా డిఫెన్స్ చేస్తారు. తమ సున్నీ సోదరులకు అహ్లెబైత్(అ.స) యదార్థాన్ని విశ్లేషిస్తారు. వారి కొరకు సరైన మార్గానికి మార్గదర్శకులవుతారు.
అల్లాహ్ ఇలా ప్రవచించెను:
لَقَدۡ كَانَ فِي قَصَصِهِمۡ عِبۡرَةٞ لِّأُوْلِي ٱلۡأَلۡبَٰبِۗ مَا كَانَ حَدِيثٗا يُفۡتَرَىٰ وَلَٰكِن تَصۡدِيقَ ٱلَّذِي بَيۡنَ يَدَيۡهِ وَتَفۡصِيلَ كُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ
అనువాదం: నిస్సందేహముగా వారి గాథలలో విజ్ఞత గలవారికి గుణపాఠం ఉంది. (ఈ) మాటలు కల్పితమైన విషయం ఎంత మాత్రం కాదు. కాని ఇది తనకు పూర్వం ఉన్న (అల్లాహ్ గ్రంథాల)ను ధ్రువీకరిస్తుంది, ప్రతీ విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించేవారికి ఇది సన్మార్గం, కారుణ్యం.[యూసుఫ్ సూరా:12, ఆయత్:111][2]

రిఫరెన్స్
1. సహీ ముస్లిం, భాగం7, పేజీ 122. کتاب الفضائل، باب فضائل علی ابن ابی طالبؑ .
2. అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ104-105.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19