షియా యొక్క ఇమాముల విశ్లేషణ-2

గురు, 12/30/2021 - 13:40

అహ్లెసున్నత్‌లు తమ “సహాహ్” మరియు “మసానీద్” గ్రంథాలలో 12 ఇమాములను విశ్లేషిస్తున్న హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇరువర్గాల వారు ఆ హదీసులను సరైనవిగా అంగీకరించారు. చాలా ఉలమాలు వాటిని నిరూపించారు కూడాను

షియా యొక్క ఇమాముల విశ్లేషణ-2

అహ్లెసున్నత్‌లు తమ “సహాహ్” మరియు “మసానీద్” గ్రంథాలలో 12 ఇమాములను విశ్లేషిస్తున్న హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇరువర్గాల వారు ఆ హదీసులను సరైనవిగా అంగీకరించారు. చాలా ఉలమాలు వాటిని నిరూపించారు కూడాను
“మీరు ఆ హదీసులను సరైనవి అని అంగీకరిస్తూనే 12 ఇమాములను వదిలి నలుగురినే ఎందుకు ఫాలో అవుతారు” అని అడిగేవాడు అడిగినప్పుడు వారు ఇలా సమాధానం ఇస్తారు: “మంచి పూర్వీకులు, సఖీఫా జన్మనిచ్చిన “ఖులఫాయే సలాసహ్”; అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్‌ల సహచరులు, వారందరికి అహ్లెబైత్(అ.స) మరియు అలీ(అ.స)పై ద్వేషం మరియు వారి సంతానం తో శత్రుత్వం ఉండేది. అందుకని వారు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నాశనం చేశారు మరియు దానిని తమ స్వయపరియాలోచన ద్వారా మార్చేశారు.
అందుమూలంగా దైవప్రవక్త(స.అ) తరువాత ఉమ్మత్ రెండు భాగాలలో విడిపోయింది. మంచి పూర్వీకులు, వారిని ఆచరించేవారు, మరియు వారి అడుగు జాడలలో నడిచేవారు. వీళ్ళ సంఖ్య ఎక్కువ. వీళ్ళు అహ్లెసున్నత్ వల్ జమాఅత్ అయ్యారు. ఎవరైతే (అబూబక్ర్) బైఅత్ చేయలేదో వాళ్ళు అలీ(అ.స) మరియు అతని షియాలు. వీళ్ళ సంఖ్య తక్కువ, అందకనే వాళ్ళను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. నిరంతరం ప్రభుత్వ ఆగ్రహానికి గురి అయ్యి ఉండేవారు. ప్రజలు వాళ్ళను “రాఫిజీ” అనేవారు.
అయినప్పటికీ అహ్లెసున్నత్
లు శతాబ్ధాల వరకు ఉమ్మత్
పై పాలకులుగా ఉన్నారు. వారి భాగ్యరేఖలు వీళ్ళ చేతుల్లో ఉండేవి, అమవీయులు మరియు అబ్బాసీయులందరూ కూడా ఆబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, ముఆవియా మరియు యజీద్‌లు పునాది పెట్టిన ఖిలాఫత్ మద్రసా విధేయులుగా ఉన్నటువంటి వారే.[1]

ఖిలాఫత్ యొక్క గాలి తీసేయబడిన తరువాత, గంభీరత్వం తగ్గుతూ వచ్చింది. మరియు బానిసల, అపరిచితుల చేతికి వచ్చి చేరింది. అప్పుడు పూర్వపు ముస్లిములు చెరిపేయాలని అనుకున్న మరియు దాచిపెట్టాలని ప్రయత్నం చేసినటువంటి (అలా చేయకపోతే వాళ్ళ పని జరిగి ఉండేది కాదు) దైవప్రవక్త(స.అ) యొక్క హదీసులను ఒకేచోట సమకూర్చాలి, అన్న మాట వినిపించింది.
కొందరు ఈ హదీసులలో మరియు తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న హదీసుల మధ్య అనుకూల్యాన్ని ఏర్పర్చాలని అనుకున్నారు. మరియు అహ్లెబైత్(అ.స)ల పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. మరియు అలీ(అ.స) పేరుతో పాటు “రజీయల్లాహు అన్హూ” మరియు “కర్రమల్లాహు వజ్హు” అని అనేవారు. ఇదంతా “వాళ్ళు అహ్లెబైత్(అ.స)ల శత్రువులు కారు” అని ప్రజలు అనుకోవాలని, చేసేవారు.
ఏ ముస్లిం కూడా చివరికి ఏ ఒక్క కపటవర్తనుడు కూడా దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స) పట్ల శత్రుత్వాన్ని వ్యక్తం చేయలేడు. ఎందుకంటే అహ్లెబైత్ (అ.స)ల శత్రువు దైవప్రవక్త(స.అ) శత్రువు మరియు దైవప్రవక్త(స.అ) పట్ల శత్రుత్వ ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది.

ఈ మాటలన్నీంటి యొక్క సారాంశం ఏమిటంటే; పుణ్య పూర్వీకులు(సలఫె సాలెహ్) అహ్లెబైత్(అ.స)ల శత్రువులు. వీళ్ళు తమను స్వయంగా అహ్లెసున్నత్
గా నామకరించుకున్నారు, లేదా వాళ్ళ సహచరులు “అహ్ సున్నత్ వల్ జమాఅత్” అని నామకరణ చేశారు. దీనిపై సాక్ష్యమేమిటంటే వాళ్ళ అప్పట్టి పరిపాలకులు వృద్ధిలో తీసుకొచ్చిన ఆ నాలుగు వర్గాల పై అమలు చేసేవారు. (త్వరలోనే వాటి గురించి వివరిస్తాము) ఆ నాలుగు వర్గాలలో అహ్లెబైత్(అ.స) ఫిఖాను ఆశ్రయించి గాని లేదా 12 ఇమాముల నుండి ఏ ఒక్కరిని ఆశ్రయించి గాని  ఏ ఒక్క ఆదేశం కూడా లేదు.
వాస్తవానికి “షియా ఇమామిమాలే” అసలైన అహ్లెసున్నత్
లు. ఎందుకంటే వారు ఫిఖా ఆదేశాలలో అహ్లెబైత్(అ.స)ను ఆశ్రయిస్తారు. వారు తమ పితా మహులైన దైవప్రవక్త(స.అ) నుండి సరైన సున్నత్ ద్వార వారసత్వంలో పొందారు. వారు అందులో తమ అభిప్రాయాలను గాని స్వయపరియాలోచనలను గాని ప్రవచనలను గాని జోడించరు.
కేవలం షియాలు మాత్తమే చరిత్ర పొడుగునా నుసూస్‌లకు అనుగుణంగా ఉన్నారు. మరియు నస్స్ ఉండగా ఇజ్తిహాద్(స్వయపరియాలోచన) రద్దు చేస్తూ వచ్చారు. ఎలాగైతే వారు అలీ(అ.స) మరియు అతని కుమారుల ఖిలాఫత్‌ను అంగీకరిస్తారో, ఎందుకంటే దాని పై దైవప్రవక్త(స.అ) నస్స్
ను సూచించారు అందుకని అలీ(అ.స) మరియు అతని కుమారులను దైవప్రవక్త(స.అ) ఖలీఫాలు, అని అంటారు. ఐనప్పటికీ ఆ ఖిలాఫత్ పదవి బహిరంగంగా అలీ(అ.స)కు తప్ప వారిలో ఎవరికీ దక్కలేదు. మరి అలాగే వారి ఖిలాఫత్
ను అప్పటి నుండి ఇప్పటి వరుకు  తారుమారు చేస్తూ వచ్చిన ఆ అదికారుల ఖిలాఫత్‌ను అంగీకరించరు. ఎందుకంటే దాని పునాదులే అనుకోకుండ, అవివేకం పై పెట్టారు, దాని దౌష్టం నుండి అల్లాహ్
యే రక్షించాడు. ఇది దైవప్రవక్త(స.అ) అహ్కాములను నిరాకరించిన టువంటి ఖిలాఫత్. “ఖిలాఫతె రాషిదహ్” ఒక వారసత్వంగా మారింది. మరణించేవాడు తరువాత ఖలీఫాను నిశ్చయించి వెళ్ళేవాడు. అది యుద్ధం లేదా ఆపదల రూపంలోనే కానివ్వండి.[2]

ఈ కారణాల వల్లే అహ్లెసున్నత్‌లు ప్రతీ ఒక్క దుష్ట మరియు దుర్మార్గుల యొక్క ఇమామత్‌ను అంగీకరించవలసి వచ్చింది. అందుకే వారు దుర్మార్గపు పాలకుల ఖిలాఫత్
ను కూడా సరైనదిగా భావించారు.
“షియా ఇమామియా”, ఇమామ్ కొరకు ఇస్మత్(పవిత్రత) విధి, అని భావిస్తారు. అంటే “ఇమామతే కుబ్రా” మరియు ఇమామత్, నాయకత్వం వహించే హక్కు కేవలం పవిత్ర ఇమామ్
కే ఉంది. మరియు ఈ ఉమ్మత్
లో వారు తప్ప ఎవరూ పవిత్రులు కారు. వీళ్ళ నుండి అల్లాహ్ రిజ్స్(అపవిత్రత)ను దూరంగా ఉంచాడు మరియు ఎలాగైతే పవిత్రంగా ఉంచాలో అలాగే ఉంచాడు.

రిఫరెన్స్
1 .మేమిక్కడ తెలిసే హజ్రత్ అలీ(అ.) యొక్క ఖిలాఫత్ గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే అహ్లెసున్నత్ వల్ జమాఅత్ అతనిని ఖలీఫాగా అంగీకరించే వారు కాదు, ఎలాగైతే మేము ఇంతకు ముందు కూడా చెప్పామో. అహ్మద్ ఇబ్నె హంబల్ యొక్క కాలం నుండి అంగీకరించడం మొదలు పెట్టారు.
2. ఇలాంటి చీకటి కార్యాల నుండి కేవలం అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క ఖిలాఫత్ ఒక్కటే దూరంగా ఉండింది. కేవలం ఇతనొక్కరే, ఇతనికి ముందు గతించిన ఆ ఖలీఫా ద్వర నిశ్చయించబడనివారు మరియు అలాగే ఇతను బలాబలగాలతో ఖలీఫా అవ్వలేదు. ముస్లిములు స్వాతంత్రంగా ఇతనితో బైఅత్ చేశారు. ఇతనిని ప్రాధేయపటి ఖిలాఫత్
ను స్వీకరించమని ఆహ్వానించారు.
3. అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ112-115.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9