అహ్లెసున్నత్
ల యొక్క ఇమాముల విశ్లేషణ

శుక్ర, 01/14/2022 - 17:03

అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు “ఫురూయే దీన్”లో “ఆయిమ్మయే అర్బఅహ్”; అబూహనీఫా, మాలిక్, షాఫెయీ మరియు అహ్మద్ ఇబ్నె హంబల్ లను అనుచరిస్తారు. అనగా ఫత్వాల పై అమలు చేస్తారు. వారిని ఫాలో అవుతారు.

అహ్లెసున్నత్
ల యొక్క ఇమాముల విశ్లేషణ

అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు “ఫురూయే దీన్”లో “ఆయిమ్మయే అర్బఅహ్”; అబూహనీఫా, మాలిక్, షాఫెయీ మరియు అహ్మద్ ఇబ్నె హంబల్ లను అనుచరిస్తారు. అనగా ఫత్వాల పై అమలు చేస్తారు. వారిని ఫాలో అవుతారు.
ఈ ఆయిమ్మ-ఎ-అర్బఅ, దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీయులు కారు. అలా అని వారిని తాబెయిన్‌ల నుండి అని కూడా లెక్కించలేము. వారెవరో దైవప్రవక్త(స.అ)కు తెలియదు, మరి దైవప్రవక్త(స.అ)కు వీరు చూడనూ లేదు. వయసు పరంగా చూసినట్లైతే వారిలో అందరి కన్న పెద్దవారు “అబూహనీఫా”. అబూహనీఫా మరియు దైవప్రవక్త(స.అ) మధ్య 100 సంవత్సరములకు పైగా తేడా ఉంది. ఎందుకంటే అబూహనీఫా హిజ్రీ శకం 80వ ఏట జన్మించారు మరియు 150వ ఏట మరణించారు. మరియు వారిలో అందరి కన్న చివరిలో “అహ్మద్ ఇబ్నె హంబల్”. అతను 165వ ఏట జన్మించారు. మరియు 241వ ఏట మరణించారు.

“ఉసూలె దీన్”[1]లో అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు, “ఇమామ్ అబుల్ హసన్ ఇబ్నె ఇస్మాయీల్ అష్అరీ”ను అనుచరిస్తారు. ఇతను 270వ ఏట జన్మించారు మరియు 235వ ఏట మరణించారు.

ఈ ఇమాములలో మీకు దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్ల(అ.స) నుండి ఎవరైనా గాని లేదా సహాబీయుల నుండి ఎవరైనా గాని కనిపించరు. లేదా దైవప్రవక్త(స.అ) వారిలో ఒకరి గురించైన ఎదైన చెప్పారా, వారిని ఆశ్రయించండి అని సూచించారా? అని చూస్తే ఎక్కడా ఇలాంటి హదీసులు కనిపించవు. దీనిని నిరూపించడం చాలా కష్టం.

అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు “మేము దైవప్రవక్త(స.అ) సున్నత్
ను ఆశ్రయించి ఉన్నాము” అని వాదించినప్పుడు, ఈ నాలుగు వర్గాలు ఎందుకు ఆలస్యంగా ఎర్పడ్డాయి? అంతకు ముందు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు ఎక్కడున్నట్లు? ఎవరి మాటనైనా అంగీకరించే వారా? అహ్కాములను ఎలా తెలుసుకునే వారు?. “దైవప్రవక్త(స.అ) కాలంలో లేనటువంటి మరియు అతని చూడనటువంటి వారి యొక్క తఖ్లీద్ మనకు చాలు”, అని ఎలా అనుకున్నారు?. ఈ నలుగురు ఇమాములు దౌష్ట్య, దుర్మార్గపు కాలంలో జన్మించారు, సహాబీయులు ఒకరినొకరు చంపుకున్నారు, కొందరిని కాఫిరులు అని పిలిచేవారు, అప్పటికి ఖలీఫాలు ఖుర్ఆన్ మరియు సున్నత్ విషయంలో తమ కోరికలకు తగ్గ మార్పులను చేసేశారు, వాటిలో స్వయపరియాలోచనం మొదలు పెట్టేశారు, అప్పటికి యజీద్ ఇబ్నె ముఆవియా యొక్క ఖిలాఫత్ కాలం గడిచిపోయింది. తన కాలంలో యజీద్ తన సైన్యానికి మదీనహ్ వాసుల పై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, అని పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. అలా ఆ యజీద్ సైన్యం అల్లకల్లోలాన్ని సృష్టించింది, యజీద్ యొక్క బైఅత్ చేయనటువంటి మంచి సహాబీయులను చంపేశారు, స్ర్రీలపై అత్యాచారం చేశారు, దయాదాక్షణ్యాలు లేకుండా ప్రవర్తించారు చివరికి చాలా మంది స్ర్తీలు గర్భవతులయ్యారు.

ఒక వివేకుడికి ఇటువంటి ఇమాముల పై ఎలా నమ్మకం కలుగుతుంది. ఎవరైతే దుష్ట మరియు నీచమైన కాలానికి సంబంధించిన వారో, అటువంటి కాలంలో ఆలోచనలు పెంపొందించు వారో, అటువంటి కాలంలో పెరిగిన వారో, ఆ కాలపు కపటానికి ఇష్టపడినవారో, ప్రతీ పని తప్పుడు జ్ఞానం పై నిర్ధారించబడిన వారో. కేవలం పాలకులకు నచ్చిన వారే ప్రముఖులు మరియు ప్రసిద్ధులయ్యారు.

సున్నత్‌ను ఆశ్రయించినవారు, విజ్ఞాన పట్టణానికి ద్వారమైన అలీ(అ.స) మరియు స్వర్గం యువకుల నాయకులైన ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స) మరియు తమ పితామహులైన దైవప్రవక్త(స.అ) యొక్క జ్ఞానాన్ని వారసత్వంగా పొందినటువంటి దైవప్రవక్త(స.అ) యొక్క సంతానం మరియు ఇతర పవిత్ర ఇమాములను ఎందుకని వదిలేయగలం. అయినా దైవప్రవక్త(స.అ) సున్నత్ గురించి తెలియనటువంటి, అంతేకాక అమవీయుల రాజకీయం ద్వార తయారు చేయబడిన వారి పట్ల ఎలా విధేయత చూపగలరు?

అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌లు దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్‌ను వదిలి, దానికి వ్యతిరేకంగా యుద్ధరంగాన్ని సిద్ధం చేసి “మేము దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ పట్ల విధేయులుగా ఉంటాము” అని ఎలా వాదించగలరు?. దైవప్రవక్త(స.అ) తమ పవిత్ర ఇత్రత్(అ.స)
ను ఆశ్రయించమని ప్రవచించినటువంటి దైవప్రవక్త(స.అ) యొక్క ఆదేశాలను మరియు వసీయత్(వీలు)ను మరిచి కూడా “మేము అహ్లె సున్నతులం” అని ఎలా వాదించగలరు?.

ఇస్లామీయ చరిత్ర ప్రవీణుడికి మరియు ఖుర్ఆన్, సున్నత్
ను చదివే ముస్లిములకు “అహ్లెసున్నత్
లు బనీఉమయ్యాహ్ మరియు బనీఅబ్బాస్
ల పట్ల విధేయతగా ఉండేవారు” అన్న విషయంలో సందేహం ఉంటుందా? మరియు ఇస్లామీయ చరిత్ర చదివే మరియు ఖుర్ఆన్, సున్నత్ గురించి తెలిసిన ఎవరైన ముస్లిం “షియాలు దైవప్రవక్త(స.అ) యొక్క ఇత్రత్(అ.స) పట్ల విధేయతగా ఉండరని మరియు వారిని ప్రేమించరని” ఎవరైనా సందేహిస్తాడా? వాస్తవానికి షియాలే దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ పట్ల విధేయత కలిగి ఉన్నవారు. మరెవ్వరికి “మేము దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ పట్ల విధేయత గలవారము” అని వాదించే హక్కు లేదు.

1. ఇస్లాం ధర్మం యొక్క మూలాధారాలు.
2. అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ116-117.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8