.హజ్రత్ అలీ[అ.స] సహాబీయులందరిలో, అందరి కన్న ధైర్యశాలి మరియు వీరుల.
చరిత్ర గ్రథాలలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: హజ్రత్ అలీ[అ.స] సహాబీయులందరిలో అందరి కన్న ధైర్యశాలి మరియు వీరుడు, సహాబీయులలో ఎవరినైతే వీరుడు అని అనుకునే వారో అతను కూడా చాలా యుద్ధాలలో యుద్ధ భూమిని వదిలి పారిపోయారు కేవలం హజ్రత్ అలీ[అ.స] తప్ప. అతను ఏ ఒక్క యుద్ధం నుండి కూడా పారిపోలేదు. హజ్రత్ అలీ[అ.స] యొక్క ధైర్యసాహసాలకు దైవప్రవక్త[స.అ] ఖైబర్ యుద్ధ సందర్భంలో అతనిని ఉద్దేశించి చెప్పిన ఈ మాటలే అన్నీటి కన్న పెద్ద సాక్ష్యం; దైవప్రవక్త[స.అ] ఖైబర్ యుద్ధ సందర్భంలో ఇలా ప్రవచించారు: “రేపు నేను ఎవరికైతే ఇస్లాం ధ్వజం ఇస్తానో అతను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త[స.అ]ను ఇష్టపడేవాడై ఉంటాడు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త[స.అ] అతనిని ఇష్టపడేటువంటివాడై ఉంటాడు, శత్రువులను ఓడించే వాడై ఉంటాడు, యుధ్ద భూమిని వదిలి పారిపోయే వాడై ఉండడు, ఈమన్ ద్వార అల్లాహ్ అతడిని పరీక్షించినవాడై ఉంటాడు” మరుసటిరోజు సహాబీయులందరు ఎగబడి ధ్వజం పొందాలనే ఆలోచనలో ఉన్నారు కాని దైవప్రవక్త[స.అ], హజ్రత్ అలీ[అ.స]కు ధ్వజాన్ని ఇచ్చారు.[సహీ బుఖారీ, భాగం5, పేజీ12 మరియు భాగం5, పేజీ77. సహీ ముస్లిం, భాగం7, పేజీ121].
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం5, పేజీ12 మరియు భాగం5, పేజీ77. సహీ ముస్లిం, భాగం7, పేజీ121, బాబొ ఫజాయిలు అలీ ఇబ్నె అబీతాలిబ్.
వ్యాఖ్యలు
ماشا اللہ
بہت اچھے پوسٹ سنڈ کر رہے ہیں جس کو پڑھ کر آدمی انسان بن سکتا ہے
جزاک الله خیرا، بہت بہت شکریہ آپ کا۔
Mashaallah....
Allah salamat rakhe aap sab ko...jazakallah
Shukriya ... Allah aap ko aur aap ki family ko bhi salamat rakhe... apna qeemti waqt is site ko de rahe hai, allah jazaye khair ataa kare.
ماشا ء اللہ
Jazakallah ... shukriya
వ్యాఖ్యానించండి