విశ్వాసం మరియు చర్యల మధ్య వ్యతిరేకత-2

బుధ, 02/02/2022 - 17:36

ఇబ్నె ఖల్దూన్ వ్రాసినట్లు; బనీఉమయ్యాలు “అహ్లె సున్నత్
లు”(దైవప్రవక్త(స.అ) సున్నత్ అనుచరులు) అని పిలవబడుతున్నారు. మరియు అహ్లెబైత్(అ.స)లు బిద్అతీయులు అనబడుతున్నారు.

విశ్వాసం మరియు చర్యల మధ్య వ్యతిరేకత-2

దైవప్రవక్త(స.అ) చాలాసార్లు ఇలా ప్రవచించే వారు: శుభవార్త ఇవ్వు అసహ్యతను ప్రేరేపించకు, సౌలభ్యాన్ని ఎంచుకో కష్టమైన వాటి నుండి తప్పించుకోండి, నిస్సందేహముగా అల్లాహ్ మీకు స్వేచ్ఛను ప్రసాదించాడు. ఇక నీవు దేని భారం నీ పై బలవంతంగా వేసుకోకు.
అతనిలో దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ పట్ల సహన శక్తిలేదు, అన్న అబూబక్ర్ యొక్క ఈ అంగీకారానికి కారణం, అతను తన ఇచ్ఛానుసారం తన రాజకీయ పరిపాలనకు అనుకూలముగా మరియు అతని శక్తికి తగ్గట్టుగా ఉన్నటువంటి బిద్అత్
లు తీసుకొని రావడం.
రెండస్థానంలో బహుశ ఉమర్
కు కూడా అనిపించి ఉంటుంది, నాలో కూడా ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క అహ్కాముల పై అమలు చేసే శక్తిలేదు, అని. అందుకనే అతను కూడా అపవిత్రత(జునుబ్) స్థితిలో నీరు లభించకపోతే నమాజ్
ను వదిలేయవచ్చు, అని తీర్మానించారు. మరియు తన ఖియాఫత్ కాలంలో ఇదే ఫత్వాను ఇచ్చారు, ఇలా అని ముహద్దిసీన్లు ఉమర్ ప్రవచచాన్ని లిఖించారు.

మరి ఉమర్
కు స్ర్తీ సంభోగం అంటే ఇష్టం కూడాను, ఈ వ్యక్తి ఎవరంటే అతని గురించి అల్లాహ్ ఇలా ప్రవచించెను:
عَلِمَ ٱللَّهُ أَنَّكُمۡ كُنتُمۡ تَخۡتَانُونَ أَنفُسَكُمۡ فَتَابَ عَلَيۡكُمۡ وَعَفَا عَنكُمۡ
అనువాదం: మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్
కు తెలుసు. అయిన్నప్పటికీ ఆయన మీ తౌబాను అంగీకరించి, మీ తప్పును మన్నించాడు.[బఖరా సూరా:2 ఆయత్:187]
ఎందుకంటే ఉమర్ ఉపవాసదీక్షలో కూడా సంభోగానికి వెనకాడేవారు కాదు. మరి ఆ పరిస్థితిలో నీరు కూడా తక్కువగా లభించేది. అందుకని ఉమర్‌కు నమాజ్ వదిలేసే మరియు నీళ్ళు లభించిన తరువాత నమాజ్ చదివే ఈ  మార్గమే సులభంగా కనిపించింది.
ఉస్మాన్ కూడా దైవప్రవక్త(స.అ) సున్నత్ పట్ల వ్యతిరేకించడానికి ఎటువంటి లోటు వదలేదు. ఆయిషా, దైవప్రవక్త(స.అ) చొక్కా తీసుకొచ్చారు. మరియు ఇలా అన్నారు: “ఉస్మాన్, దైవప్రవక్త(స.అ) యొక్క కఫన్(శవవస్త్రము) పాతదవ్వకుండా నే అతని సున్నత్
ను మరిపించాడు”. చివరికి సహాబీయులు అతని పై “అతను దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ మరియు షైఖైన్
ల సున్నత్
ను వ్యతిరేకిస్తున్నారు” అని నిందించారు. మరి ఆ అపరాధం వలనే అతను చంపబడ్డారు.

ఇక ముఆవియా విషయానికి వస్తే వారిని మించి పోయాడు, ఇతడైతే బహిరంగంగా ఖుర్ఆన్ మరియు సున్నత్
ను వ్యతిరేకించేవాడు. ప్రజలును వాటి ఆశ్రయం పై అడ్డుకునేవాడు. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “అలీ(అ.స) నా నుండి మరియు నేను అలీ(అ.స) నుండి, అలీ(అ.స)ని దూషించడం నన్ను దూషించి నట్లు మరియు నా గురించి తప్పుగా మాట్లాడిన వాడు అల్లాహ్ గురించి తప్పుగా మాట్లాడినట్లే”[1]
ముఆవియా బహిరంగంగా హజ్రత్ అలీ(అ.స) పై లఅనత్ చేసేవాడు. అంతటి తో ఆగకుండా తన క్రింద ఉన్న అధికారుకు కూడా అలీ(అ.స)పై లఅనత్ చేయమని ఆదేశించాడు. ఎవరైనా అలా చేయడాన్ని నిరాకరిస్తే, అతడిని పదవి నుండి తొలగించేవాడు.
సత్యాన్ని అనుచరించే షియాల ప్రతిపక్షంలో, ముఆవియా తనను మరియు తన అనుచరులను “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అని అనేవాడు.
చరిత్రకారులు కొందరు చివరికి ఇలా కూడా వ్రాశారు; ఇమామ్ హసన్(అ.స)తో సంధి తరువాత ఏ సంవత్సరంలోనైతే ముఆవియా పట్టాభిషిక్తుడయ్యాడో ఆ సంవత్సరమును “ఆముల్ జమాఅహ్” అని అనడం మొదలు పెట్టారు.
ముఆవియా అండ్ పార్టీ, అనగా “శుక్రవారం మరియు ఈద్ రోజున (నమాజ్ సందర్భాలలో) పీఠాల నుండి అలీపై లఅనత్ చేయువారు” అన్న ఈ విషయం పై ఉన్న ముసుగు తొలగిపోవడంతో ఈ ఆశ్చర్యం కూడా పోతుంది.

ఒకవేళ “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”, ముఆవియా ఇబ్నె అబీసుఫ్యాన్ ద్వార ఆవిష్కరించబడినదే అయితే, అల్లాహ్
తో మేము కోరేది ఇదే; “ఓ అల్లాహ్! అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మరియు అహ్లెబైత్లందరు సృష్టించిన ఆ బిద్అత్ పైనే మమ్మల్ని ఈ లోకం నుండి తీసుకోని పో!”.
గౌరవనీయులైన పాఠకులారా! మీరు కొంచెం దృష్టి పెట్టి చూడండి, ఈ విధంగా చూసినట్లైతే బిద్అతీయులు మరియు మార్గభ్రష్టులు, అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారే అయ్యారు. కాని అహ్లెబైత్(అ.స)లకు చెందిన పవిత్ర ఇమాములను బిద్అత్ నివేదకులు, అని అనేవారు.
అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల ప్రముఖ విద్వాంసులు “అల్లామా ఇబ్నె ఖల్దూన్” వర్గాల గురించి చెప్పిన తరువాత ఇలా అన్నారు: అహ్లెబైత్(అ.స)లు సృష్టించిన వర్గాలు చాలా తక్కువ, వారు ఫిఖాలో ప్రముఖులు, వారి వర్గాల యొక్క మూలం సహాబీయులలో కొందరిని దూషించడం.[2]
గౌరవనీయులైన పాఠకులారా! నేను ముందే చెప్పాను, ఒకవేళ వారి చిత్రపఠం యొక్క రెండవ భాగాన్ని చూసినట్లైతే తప్పకుండా యతార్థాన్ని చేరు కుంటారు, అని. అతి దురాచారులైన వారు మరియు బనీఉమయ్యాలు “అహ్లె సున్నత్
లు”(దైవప్రవక్త(స.అ) సున్నత్ అనుచరులు) అని పిలవబడుతున్నారు. మరియు అహ్లెబైత్(అ.స)లు బిద్అతీయులు[3] అనబడుతున్నారు, (ఇబ్నె ఖల్దూన్ వ్రాసినట్లు). అలాంటప్పుడు ఇలాంటి ఇస్లాంకో నమస్కారం.

రిఫరెన్స్
1. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ121. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం6, పేజీ223. ఖసాయిసె నిసాయీ, పేజీ17.
2. ముఖద్దమయో ఇబ్నె ఖల్దూన్, పేజీ494.
3. దైవప్రవక్త(స.అ) సున్నత్ పై అమలు చేయకుండా దీన్
లో కొత్త విషయాలను సృషించినవారు.

అల్ షియా హుమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13