ఉమర్ మరియు ఇబ్నె అబ్బాస్ సంభాషణం

శని, 11/09/2019 - 13:52

ఉమర్ చివరి సమయంలో అతని మరియు ఇబ్నె అబ్బాస్ మధ్య జరిగిన సంభాషణం...

ఉమర్ మరియు ఇబ్నె అబ్బాస్ సంభాషణం

“బుఖారీ”, తన పుస్తకం “సహీ బుఖారీ”లో “మనాఖిబె ఉమర్ ఇబ్నె ఖత్తాబ్” అను అధ్యాయంలో ఇలా వ్రాసారు: “అతను(ఉమర్) గాయపడిన తరువాత నొప్పితో బాధను వ్యక్తం చేస్తే ఇబ్నె అబ్బాస్ వారిని శాంతి పరుస్తు “ఇదే మీ బాధైతే (బయపడనవసరం లేదు) మీరు దైవప్రవక్త[స.అ]తో కలిసి వుండే భాగ్యాన్ని పొందారు, వారు మిమ్మల్ని ఇష్టపడే వారు, ఆ తరువాత అబూబక్ర్‌తో కూడా చాలా కాలం వరకు కలిసే ఉన్నారు అతను కూడా మీతో ఇష్టంగానే వుండేవారు. ఆ తరువాత అతని అనుచరులతో జీవితాన్ని గడిపి ఇప్పుడు ఈ లోకం నుండి వెళ్తున్న సమయంలో అందరు మీతో రాజీ పడే వున్నారు” అని అన్నారు. అందుకు ఉమర్ ఇలా అన్నారు: “దైవప్రవక్త[స.అ]తో కలిసి ఉండడం, అతను నాతో రాజీ పడడం ఇవన్ని అల్లాహ్ ఉపకారములు. అలాగే అబూబక్ర్‌తో కలిసి ఉండడం మరి వారు కూడా నాతో రాజీ పడడం కూడా. కాని ఇప్పుడు నా కలత అంతా నీకోసం మరియు నీ అనుచరులకోసమే ఒకవేళ నేను భూమికి సమాన బంగారాన్ని అల్లాహ్ మార్గాన్న ఖర్చు చేసి అల్లాహ్ శిక్ష నుండి విముక్తి చెందగలను అంటే నేను ఇచ్చేసేవాడిని”.[ బుఖారీ, భాగం2, పేజీ 201]

రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం2, పేజీ 201.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18