జుహూర్ దిశకు ప్రయాణం

సోమ, 02/07/2022 - 18:36

ఇమామ్ ను తన యదార్థ స్థానాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం మరియు ఇస్లామీయ చట్టాలు పెడదారికి పోకుండా అడ్డుకోవడానికి రెండు ముఖ్యమైన చర్యల అవసరం ఉంది.

జుహూర్ దిశకు ప్రయాణం

ప్రతీ మతం మరియు ధర్మం తన లక్ష్యాల కోసం తన సంస్కృతి మరియు పద్ధతులను బట్టి కొన్ని చట్టాలు మరియు నియంత్రణలు కలిగి ఉంటారు. దీని వలనే ఆ ధర్మాన్ని నమ్మే ప్రజలు ఒక క్రమంలో నడుస్తారు.
ఇస్లాం ధర్మం కూడా మనిషి విముక్తి కోసం అల్లాహ ప్రసాదించిన స్వభావం పై చట్టాలు నిర్థారించబడ్డాయి.[సూరయె మాయిదహ్, ఆయత్48] మరియు ఆ చట్టాలు పవిత్ర నాయకుడి విలాయత్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి[సూరయె మాయిదహ్, ఆయత్55]. ఎందుకంటే ఇస్లామీయ చట్టాలు పూర్తి విధంగా అమలులోకి రావాలంటే ఇస్లామీయ రాజ్యం రావాలి. రాజ్యం నడపాలంటే ఇమామ్ అవసరం ఉంటుంది. అప్పుడే మానవులు సంపూర్ణత్వానికి చేరగలరు.
కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే దైవప్రవక్త(స.అ) తరువాత ఇమామ్ ను తన యదార్థ స్థానం నుంచి వారిని ప్రక్కన పెట్టడం జరిగింది. ఇస్లామీయ చట్టాలు మాసూమ్ కాని మరియు పవిత్రులు కాని వ్యక్తుల చేతుల్లో పడ్డాయి. అవి రోజురోజుకు మారడం మొదలయ్యాయి. అయితే ఇమామ్ ను తన యదార్థ స్థానాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం మరియు ఇస్లామీయ చట్టాలు పెడదారికి పోకుండా అడ్డుకోవడానికి రెండు ముఖ్యమైన చర్యల అవసరం ఉంది.

మొదటిది: నాయకుడి పట్ల జ్ఞానం
దైవప్రవక్త(స.అ) మరణానంతరం ప్రజలకు తమ ఇమామ్(నాయకుడు) పట్ల జ్ఞానం లేకపోవడమే కాకుండా దైవప్రవక్త(స.అ) పట్ల ఉండవలసిన జ్ఞానం కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే తమ కాలపు ఇమామ్ ను ఇప్పుడు ఒక ముజ్తహిద్ ను నమ్మినట్లుగా కూడా విశ్వాసించేవారు కాదు.
ఇదే ప్రపంచ ఉనికి అక్షం అయినటువంటి ఇమామ్ ను ప్రక్కన పెట్టడానికి కారణమయ్యింది; ఇప్పుడు దైవప్రవక్త(స.అ) పన్నెండవ ఉత్తరాధికారి యొక్క అదృశ్య కారణాలలో ఒకటి ప్రజల తరపు నుంచి ఇమామ్ ను అంగీకరించకపోవడం అని భావిస్తారు. ఫలితంగా ఇమామ్ రాక మరియు వారి ప్రత్యక్షం సుధీర్ఘమౌతుంది.[1]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “తన కాలపు ఇమామ్ పట్ల జ్ఞానం లేకుండా మరణించినవాడి మృత్యువు అజ్ఞానపు మరణం అవుతుంది”[2] ఈ రివాయత్ కొన్ని అంశాలను సూచింస్తుంది:
1. ఇమామ్ ఉనికి ప్రతీ కాలంలో ఉంటుంది.
2. ఇమామ్ పట్ల జ్ఞానం మరియు వారి అనుచరణ; ఎందుకంటే వారి పట్ల జ్ఞానం లేకుండా వారిని అనుచరించడం అర్థం లేని విషయం.
3. అనుచరణ మరియు ఆజ్ఞ పాలన ఇమామ్ తప్పకుండా పవిత్రులు అయి ఉండాలి అని నిదర్శిస్తుంది; అంట ఒకవేళ ఇమామ్ పవిత్రులు కాకపోతే ఆ నాయకుడిని అనుచరించడం అర్థం లేని విషయం.
ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) ఇమామ్ పట్ల జ్ఞానం గురించి ఇలా ఉపదేశించారు: ఇమామ్ పట్ల కనీస జ్ఞానం ఏమిటంటే; ఇమామ్, దైవప్రవక్త(స.అ)తో సమానం అయితే దైవప్రవక్త(స.అ)కు దౌత్య స్థానం ఉంది. ఇమామ్ దైవప్రవక్త(స.అ) యొక్క వారసులు. వారి పట్ల విధేయత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స.అ) పట్ల విధేయతకు సమానం. నిస్సందేహంగా ప్రతీ విషయంలో వారికి లోబడి ఉండాలి, వారి ఆజ్ఞను అమలు పరచాలి”[3]
ఖేదించదగ్గ విషయమేమిటంటే ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉన్నాము అని వాదించడానికి ఈ గైబత్ కాలంలో ఈ పాటి జ్ఞానం కూడా లేకపోయింది.

రెండవది: శత్రువు పట్ల జ్ఞానం
దైవప్రవక్త(స.అ) యొక్క దౌత్యం ఆరంభం నుంచే శత్రువు నిత్యం నిజమైన మార్గదర్శకులను ప్రక్కన పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు చివరికి దైవప్రవక్త(స.అ) మరణానంతరం బహిరంగంగా ఈ పని చేసి విజయం పొందాడు; ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే తెలిసే విషయమేమిటంటే ప్రజలకు శత్రువు పట్ల అవగాహన లేకపోవడం. వారు శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలుసుకోలేకపోయారు, ఒక రకంగా చెప్పాలంటే మోసపోయారు. పరలోకాన్ని ఈ ప్రాపంచిక అల్ప రాబడికి అర్పించుకుంటాడు.
అల్లాహ్ సున్నత్ ప్రకారం ప్రతీ మార్గదర్శితో పాటు ఒక శత్రువు నిర్ధారించబడతాడు.[సూరయె అన్ఆమ్, ఆయత్112] ఆ శత్రువు ఎప్పటికీ శాంతిగా కూర్చోడు మరియు అణిచివేతకు నిత్యం ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఖుర్ఆన్ శత్రువును ఈ విధంగా పరిచయించెను: “నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం (అంటే మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటువేసి) కూర్చుంటాను.[సూరయె అఅరాఫ్, ఆయత్16] ఆ తరువాత శత్రువు యొక్క మార్గాలను వివరించెను.
సారాంశమేమిటంటే; ఇమామ్ తిరిగి తన స్థానం పొందాలంటే ఖచ్చితంగా ఈ సంఘటనలు జరగాలి. వీటి మార్గాలలో ఒకటి, ఖుర్ఆన్ మరియు అహ్లె బైత్(అ.స) కూడా వాటి గురించి చెప్పారు; అహ్లెబైత్(అ.స)కు సంబంధించిన సభలు అవి మజ్లిసుల రూపంలో మరియు జ్ఞాన సభల రూపంలో; ఎందుకంటే ఇలాంటి సభలు మరియు మజ్లిసులు మరలా ఇలాంటి సంఘటనలు జరగకపోవడంతో పాటు ప్రజల ఆలోచన, బుద్ధి వివేకాలు మరియు జ్ఞానం పై డైరెక్ట్ ప్రభావం చూపుతాయి. అంటే షియా వ్వవస్థ యొక్క మనుగడ అంతే కాదు ఆలోచన స్వేచ్ఛ కలిగి ఉన్న ప్రతీ ఒక్కడి మనుగడ, ఇలాంటి సభలను జరపడంలో ఉంది. ఇలా అనీ ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) వెల్లడించారు.[4]

రిఫరెన్స్
1. ఇలలుష్ షరాయె, సదూఖ్, భాగం1, పేజీ243.
2. కిఫాయతుల్ అసర్, ఖజాజీ రాజీ, పేజీ296.
3. కిఫాయతుల్ అసర్, ఖజాజీ రాజీ, పేజీ293.
4. సహీఫయె నూర్, ఆయతుల్లాహ్ ఖుమైనీ, భాగం15, పేజీ204.

https://btid.org/fa/news/197712

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16